Home Blog Page 9

అంజలీ దేవి ……

మన   తెలుగు వారి సీతమ్మ ఇక లేదు . ఈ వార్త తెలిసి బాధ వేసింది . తెలుగు వారందరికీ గుర్తుండిపోయే ఒక మంచి నటి . భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పడానికి వున్న  కొన్ని ఆణిముత్యాల   వంటి సినిమాలలో నటించిన,నిర్మించిన గొప్ప కళాకారిణి , అంజలీ దేవి.                                                                                                                                                                       స్త్రీ శక్తి కి ఒక గొప్ప ఉదాహరణ ఆమె . ఎందుకంటారా ,1930 ల లో ఆడవాళ్ళు బయటికి రావడమే పెద్ద తప్పని భావించే   రోజుల్లో నే తన ప్రతిభకు తగిన రంగాన్ని ఎంచుకుని ,అందులో రాణించింది . పురుషాధిక్యమున్న రంగం లో ఉన్నత స్థానం లో నిలచిన ధీశాలి .
భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడైతే ఎంతటి విజయాలనైనా సాదించగలరని తెలియజెప్పారు . ఆవిడ సినీరంగం లోకి వచ్చే నాటికే ఒక బిడ్డ కి తల్లి .ఈ కాలం లో కనీసం ఊహ కి కుడా అందని విషయం అది . అయినప్పటికీ తన భర్త ప్రోత్సాహం తో రాణించి తనని తక్కువగా చూసినవారి దగ్గరె మెప్పుపొందారు  . నిర్మాత గా మారి అంజలి పిక్చర్సు బ్యానరు పై ఎన్నో ఘన విజయాల్ని అందుకున్నారు  ,  కళాకారిణిగా మూస పాత్రలకి పరిమితమైపోకుండా అన్ని రకాల పాత్రలకి పరిపూర్న న్యాయం చేకూర్చిన   అభినేత్రి .
 చిన్నప్పుడు ఆమె నాకు తెలిసిన మొదటి దేవ కన్య . నేను చదివే చందమామ కధలలోని మనిషిలా  అనిపించేది . అన్నిటికన్నా చెట్టులెక్క గలవా ఓ నరహరి అని ఆమె ఆడీ  పాడిన పాటను తెలుగు వారు ఎలా మరచిపోగలరు . మన పిల్లలకి కుడా తప్పక చూపించవలసిన పాట అది. ఇంకా సువర్ణ సుందరి ,అనార్కలి ,సంఘం,పల్లెటూరి పిల్ల ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి మెప్పించారు .
సినిమాకి సంభందించిన అన్ని విభాగాలలోనూ మంచి పట్టు ఉన్న ప్రతిభావంతురాలు . ఎన్ని చెప్పుకున్నా ఆవిడ చేసిన లవకుశ గురించి చెప్పుకోకపోతే పెద్ద తప్పవుతుంది . వెండి తేర పై సీతమ్మ పాత్ర కి ప్రాణ ప్రతిష్ట చేసారు . ఆవిడ చేసిన ఆ పాత్ర చూసి కంట తడి పెట్టని వారుండరంటే నమ్మండి .

చివరిగా భగవంతుడు ఇచ్చిన జీవితానికి పూర్తి న్యాయం చేసి , చరిత్ర లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ,ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఈ తరం వారికి అందజేసి , స్వర్గస్థులైన అంజలీ దేవి గారికి
కళాభివందనాలతో వీడ్కోలు తెలియజేద్దాం …..

చిలిపి కథ ………………

0

నా పెళ్లి జరిగి అప్పుడే ఆరు నెలలు ఆయిపోయింది. హం.. ఏంటో పెళ్లి జరిగిన వెంటనే నాకు అంతా
తెల్సిపోయినట్లు, ఏదో దైవరహస్యం కనుకున్నట్లు అనిపించింది. పెళ్లి కాని వాళ్ళని చూస్తే జాలి వేసేది, ఛ వీళ్ళకు ఏమి తేలీదు పాపం అని! కాని వెంటనే పెళ్ళిలో నా సీనియర్లు అంటే అమ్మ, అక్క, వదిన, అత్త మొదలయిన వాళ్ళని చూస్తే భయం వేసేది, చిన్న గీత పక్కన పెద్ద గీత లాగ.

పెళ్ళైతే ఏదో జీవితం పెద్దగా మారిపోతుంది అనుకున్నా, కానీ  జీవితం అలానే ఉంది. అందులోని అనుభూతులే కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా ఉన్నాయి. పెళ్లి రూపంలో దేవుడు(నమ్మేవాళ్ళకి) నాకో మంచి స్నేహితుడ్ని ఇచ్చాడు.

మొదటి రోజు నా మొదటి వంట. మా అయన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని స్టార్ట్ చేశా, మరీ రంగప్రవేశం కాదు కానీ ఇంతకు ముందే కాస్త అనుభవం ఉందిలెండి. మా హాస్టల్లో వంటవాడి పైత్యం తట్టుకోలేక రెండేళ్ళు నేను నా స్నేహితురాళ్ళు స్వయంపాకం వెలగపెట్టాం లెండి. తరవాత రెండేళ్ళు అమ్మ వంటని తినటమే కాని ఎలా చేస్తారో కనుకోవటం మాత్రం చేయలేదు. మా ఇంటి వంటిల్లు మా కాలేజీ లైబ్రరీ లాంటిది, ఎక్కడ ఉంటుందో తెలుసు కాని అందులోకి అప్పుడప్పుడే అడుగు పెట్టే  దాన్ని. న్యూస్ పేపర్లో సినిమా పేజి చదవటానికి వెళ్ళినట్లు, మంచి నీళ్ళకి, చిరు తిండ్లకి మాత్రమే వంటిల్లు గుర్తు వచ్చేది.

సర్లే ఏది ఐతే అదే అవుతుందని దైర్యంగా మొదలెట్టాను. కొత్త కాపురం అన్ని కొత్త సామనులే. వంటిల్లు ఐతే అప్పుడే రిబ్బన్ కట్ చేసిన స్టీల్ సామాన్ల అంగడిలా మెరిసిపోతోంది. నిజం చెప్పొద్దూ, వారం రోజుల వరకు నాకు అన్నిటిని ముట్టుకోవాలంటే భలే బాధ వేసేది(ఎక్కడ మాసిపోతాయో అని).   అంత ముద్దు వచ్చేవి బుజ్జిముండలు. ఉల్లిపాయలు కోద్దాం అని కత్తి తీసాను, సగం కోసే సరికి శ్రీ కత్తి గారు దాని పదును చూపించింది. బుస్సుమని రక్తం. ఏమి చేయాలి. ఆపేస్తే పరువు పోదూ, కొత్త మొగుడు దగ్గర. ఛి  క్షమించాలి. కొత్త మొగుడంటే కొత్త పెళ్ళికొడుకు అన్నమాట, నా మొగుడే, ఒక్కగాన్నోక్క మొగుడే.

సర్లే, కొత్త కాపురంలో మొదటి వంటకి రక్త తర్పణం చేశా అనుకుని దానితోనే వీర తిలకం దిద్ది అస్సు బుస్సుమని వంట కానిచ్చేసా.అన్నం, కూర, పెరుగూ అన్నీపెట్టి మా అయన కోసం ఎదురుచూసాను.భలే అన్పించింది సుమండీ.ఎంతైనా కొత్త కదా,ఎదురుచూడం నుండి కలిసి తినడం వరకు అన్నీ  కొత్తనే కదా.ఇష్టపడ్డ ఇద్దరు కలిసి చేసేవి అన్నీ కొత్తే, అన్నీ మత్తే, అన్నీ గమ్మతే, కొత్త కాపురంలో.

వచ్చాడు చివరకు, ఒక యుగం తర్వాత మా శ్రవణ కుమారుడు.మా ఆయనే లెండి.ఒక్కో సారి ఒక్కో పేరు పెట్టేస్తుంటాను మా ఆయనకి.ఎలా పిలిచినా అయన నవ్వేస్తుంటాడు, అచ్చు చందమామలాగా.నిజం అండీ, మీరు నమ్మాలి.ఇది కొత్త కాపురం మత్తులో అనడం లేదు,ఇప్పటికీ అలానే అన్పిస్తుంది మా అయన నవ్వు, గుప్పెడు మల్లెలు గుండెలమీద చల్లినట్లు.

“వంట చేశాను తిందాం రండి”, అన్నాను.”ఎం చేసావు”, అని అడిగాడు. కూర చేశాను, అన్నాను.ఏది,అని అడిగాడు.చూపించాను.టమోటాలు ఆలుగడ్డలు వేసి చేశాలే.”ఇది సరే, ఇంతకీ కూర ఏది?”, అన్నాడు.ఇదే కూర, అన్నాను.”కాదు ఇది వేపుడు అంటారు.కూర లోకి, పెరుగు లోకి నంజుకుంటే బాగుంటుంది”, అన్నాడు.నాకు అట్టే తేడా తెలీలా.ఇది మరీ బావుంది, కూరంటే కూరె.వేపుడు ఏంటి, నా మొహం.మా ఇంట్లో నేను అన్నింటినీ కూర అనే అంటాను.మా అయన మాత్రం, కూరని కూరే అనాలి, పులుసుని పులుసే అనాలి, వేపుడు వేపుడే అనాలి అని కొంచం లెక్చర్ ఇచ్చాడు. కొత్త కదా ఆ మత్తులో అబ్బ, మా అయనకు ఎన్ని విషయాలు తెలుసో అని మురిసిపోయాను. అది సరి కానీ వెళ్లి కూర పట్టరా అన్నాడు, అంతా ఇంతే అన్నాను. మరి రసమో అన్నాడు! నాకు మతి పోయింది. నా వంట చూసి మతిపోతుందని నేను అనుకుంటే మా అయన అడిగే వాటికి నా మతే పోయింది. సరే కొత్త పెళ్ళాం అపురూపం కనుక ఆ కూరే (మరేమంటారో మీరు) వేపుదని, కూరని, పులుసని, చారు అనుకుందాం అన్నాడు మా పులకేసి( మా ఆయన్నే… చెప్పాగా నా మొగుడు నా ఇష్టం).

రెండు కంచాలు పెట్టాను, ముద్ద( ఛీ ముద్దు కాదండి నిజంగా) పెట్టుకుందామని చెయ్యి పెడితే, కారం తగలగానే చుర్రుమంది, అబ్భా అనేసాను. కొత్త పెళ్ళాం బహుకోమలం కదా కొత్త మొగుడికి( ఛ కొత్త కొత్త ఎక్కువ ఐపోయింది ఏం చేయను కొత్త ఎంతైనా వింతే కదా….) మా అయన ఎంత దిగులుపడిపోయాడో… సీతమ్మకి వచినన్ని  కష్టాలు నాకోచ్చాయని బెంగేట్టేసుకొని అదయిపోయి, ఇదయిపోయి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసేసాడు. నేను ఇవన్నీ చూసి అసలు నొప్పి గోరంతఐతే, కొండంతగా విలవిలలాడిపోయాను. మా అయన దగ్గర వయ్యారాలు, వగలు పోవడం భలే సరదాగా వుంటుందిలే. అదే పెళ్ళికి ముందైతే ఒక బ్యాండ్ఎయిడ్ చుట్టేసుకొని చచ్చినట్టు స్పూన్తోనో లేకపోతే చేతితోనో తంటాలు పడాల్సివచ్చేది. హం… మొత్తానికి ఉత్తర కుమారుడు నా వేలుకి ఫ్రాక్చర్ అయిదన్నంతగా బెంగపడిపోయి రెండు కంచాలని ఒక్కటి చేసేసి, రెండు చేతులుని ఒకటి చేసేసి గోరు ముద్దలు తినిపించాడు. నేను మధ్యలో నొప్పి నటించి మా ఆయన్ను కంగారు పెట్టాను. ఈ విషయం ఆయనకు చెప్పకండెం. నా సీక్రెట్ … కాదులే మన సీక్రెట్…. హ హ ….

మా అయన దగ్గర అలా మొదటి రోజే గోరుముద్దులు, ఛ ఛ ముద్దలు తినేశానన్నమాట. చెప్పాగా జీవితం ఏమి మారలేదని, కాని అనుభూతుల్ని మాత్రం ఇస్తుంది. మనం దాని తీసుకునేదాన్ని బట్టి అవి తీపి లేదా చేదు జ్ఞాపకాలుగా అవుతుంటాయి.

తరవాత నేను చేసిన మొట్ట మొదటి పని, వెంటనే  వంటింట్లోకెళ్ళి నేను తిట్టిన తిట్లకు అలిగి, అలిసి, సొలసి మూలన పడి కూర్చున్న శ్రీ శ్రీ కత్తిగారికి గట్టిగా ఒక థాంక్స్ చెప్పుకున్నా. మరి అంత మంచి అనుభూతిని తర్వాత్తర్వాత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిందికదా అందుకని. లైట్ దానిపైన పడి కొత్త కతి కదా అది చమ్మక్కుమంటే నిజంగ్ నాకు అది కన్నుకొట్టి నవ్వినట్టే ఉంది. ఇప్పుడు తలచుకున్నాకూడా! తరువాత ఏమైందో మనలాంటి పెద్దవాళ్ళకు అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పనక్కరలేదనుకుంటా ….

సంక్రాంతి ముచ్చట్లు

మన జీవితంలో  ఇంకో సంక్రాంతి కి స్వాగతం చెప్పబోతున్నాం . ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు చూసాను , కాని  నాకు నచ్చిన సంక్రాంతి ఒక్కటే . అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగింది . సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త బట్టలు,సినిమాలు,మా అమ్మ చేసే తెలుగు వారి  పండగ మెనూ అదేనండి పులిహోర,పాయసం,వడ,బూరెలు,etc  ఇన్తే  అనుకునేదాన్ని . ఎందుకంటే టౌన్ లో ఇలానే చేస్తారు ,ఇంతే చేస్తారు కాబట్టి . పల్లెల్లో వేరేగా ఉంటుందని వినడమే కాని చూడలేదు ,కాబట్టి సంక్రాంతి అంటే ఇంతే,అని నా ఫీలింగ్ కాని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన సంక్రాంతి నేను మరిచిపోలేను . ఆ ఒక్క సంక్రాంతి చాలు జీవితానికి అనిపించింది.

తాజ్మహల్ చూడాలంటే  ఆగ్రా లోనే చూడాలి, సంక్రాంతి వైభోగమంటే  పల్లెల్లోనే చూడాలి , ఏమంటారు . ఎందుకో చెప్తాను చూడండి . మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మాకు చాలా దూరం ,కాబట్టి చిన్నప్పుడు ఎక్కువగా వేసవి సెలవుల్లోనే వెళ్ళేవాళ్ళం , కాస్త పెద్దైయ్యాక తరచుగా వెళ్ళేవాళ్ళం . మామయ్య ఆ సంవత్సరం సంక్రాంతికి ఊరు రమ్మన్నాడు ,అందరం వెళ్ళాం . అది పల్లెటూరు చాలా రిమోటు విలేజి  కాని మనుషులు మాత్రం తెలివైనవాల్లెనండి బాబు ,అంటే లౌక్యం ఎక్కువ,అది మన లాగ సిటీ పిల్లలకి ఉండదు .

ఆ ఊరు అంటే నాకు చాలా ఇష్టం. మీరు నమ్మరు కాని ఆ ఊర్లో మొత్తం 19 ఇల్లవాళ్ళే  వుంటారు తెలుసా . అంత చిన్న ఊరు అన్నమాట . ఊరి మధ్యలో చింతచెట్టు దాని చుట్టూ రచ్చ  బండ ఉంటాయి . ఈ చెట్టు చుట్టూ  ఇళ్లు  ఉంటాయన్నమాట . ఊరికి ఒకే ఒక్క గుడి, చిన్నది, శ్రీ రామచంద్రమూర్తి ది. అంత చిన్న ఊరు కావడం వల్ల, ఉన్న కొద్ది మంది జనాభా కాస్తొకూస్తొ చదువుకున్నవాళ్ళు అవడం వళ్ళ ఊరు చాల నీట్ గ ఉంటుంది .. చాల పల్లెలు చూసాకాని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉన్నంత నీట్ నెస్  ఎక్కడా చూల్లెదు . దీనిబట్టి మన దేశం లో నీట్ నెస్ లేకపోవడానికి ఓవర్ పాపులేషన్ కారణం  అని నా గట్టి ఫీలింగ్ .

ఇక పోతే సంబరాల్లోకి వచేద్దాం . ఇంటికి వెళ్ళగానే మా అమ్మమ్మ బోసినోటితో నవ్వుతూ ఎదురొచిన్ది . భలే తమాషాగా అనిపించింది. అదేంటో అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉండే ఆ సెక్యూర్ ఫీలింగ్ ఎవరిదగ్గర రాదు . భోగి పండుగ ముందు రోజు వచ్చాము మేము . అత్తయ్య పిండి రుబ్బుతోంది స్టార్ట్ అయ్యాయన్నమాట పనులు. అత్తయ్య ఆగకుండా చేస్తోంది పని , కాని అమ్మమ్మ మాత్రం మా రోజుల్లో ఇలాకాదే  అమ్మా ,ఏంటో ఈ కాలం పిల్లలు అంటూ సనుగుతూనెఉన్ది . అమ్మ, అత్తా ముసిముసిగా నవ్వుతూ పనులు చేస్కుంటున్నారు ,ఆవిడ మాటలు అసలు పట్టించుకోకుండా .నన్ను పని నేర్చుకోమని ఒకటే గొడవే మా అమ్మమ్మ . పెళ్ళైతే ఎలాగు తప్పదు ఇప్పట్నుంచే ఎందుకు అని మా మామయ్య సపోర్టు చేసాడు . అంతే కదా మరి కాస్త ఫ్రీడం ని ఎంజాయ్ చేసేది ఇప్పుడే కదే అమ్మమ్మా  అని నేను అంటే ,మళ్ళీ పాత పాట స్టార్ట్ చేసింది,మా రోజుల్లో అంటూ ,….. ఆపవే బాబూ అని నేన్ పారిపోయాను . మామయ్య నాకు మంచి ఫ్రెండ్ ,అయన బైక్ ఎక్కి కాస్త మా తోట దాకా వెళ్లి వచ్చాను.

బైక్ లో వెళ్తుంటే బలే ఉంది ,ఎటుచుసినా  పొలాలే .సమ్మర్ లో వచిన్నప్పుడు ఇంత బాగా వుండవు ,చాల హాయ్ గా అన్పించిన్ది. ఊరికి రావాలంటే కట్ట మీదనుండి రావాలి ,దానికి ఒక వైపు చెరువు ఇంకోవైపు పొలాలు ఉంటాయి . కట్టకి అటూ ఇతూ రావి చెట్లు ఉండేవి ,దానిమీద నడుస్తుంటే రావి చెట్టు గాలి బలే ఉండేది .కాని ఆ సంవత్సరం ఏదో ఇందిరమ్మ పధకం కింద చెట్లు కొట్టేసారు ,పనులు మాత్రం ఏమి జరిగేట్టు లేవు కాని చెట్లు మాత్రం పోయాయి . హూ …. బలే బాధేసింది . అందమైన వాలుజడ ఉన్న పిల్లకి డిప్ప కటింగ్ చేసినట్లైంది .

రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం . పొద్దున్న 3గంట్లకనుకుంట మా అమ్మమ్మ నిద్ర లేపేసింది . ఆ టైం కి అసలు నేను ఎప్పుదూ లేచిన్దిలేదు , భోగి మంటలు వేస్తున్నారు లే అని. సినిమాల్లో తప్ప ఎప్పుడూ చూడలేదు . చలికి వణుకుతూ బయటికి వెళ్ళాను . మామ వాళ్ళంతా అప్పుడే మంటలేసి చలికాచుకున్తున్నారు. చలి కి నేను కుడా వెళ్లి దాని ముందు కూర్చున్నాను. భోగి మంటల్లో చీడ పీడ అంతా పోతుందంట . పాత వస్తువులకి ఆలోచనలకి మంటల్లో టాటా చెప్పేసి జీవితం లోకి కొత్త వాటికి స్వాగతం చెప్పాలంట ,అమ్మమ్మ చెప్పిన్ది. అమ్మమ్మ కి ఎం తెలియదు అనుకోవడం నా తెలివితక్కువతనం అన్పించింది . ఒకవైపు చలి చలి గా  ఉంటే మంటల్లో చలి కాచుకోవడం భలే బాగుంది .

అమ్మావాళ్ళు మళ్లీ పనులలో పడిపోయారు ,ఈ పెద్దాల్లున్నారే రే రే …అనుకుంటూ నేన్ చక్కగా మళ్లీ ముసుగేస్కుని పడుకున్నా . పొద్దున్నే ముగ్గులు పెట్టి నేను,మామ వాళ్ళ పిల్లలు రంగులు వేసాం . అందులోకి కి గొబ్బెమ్మలు పెట్టి పైన గుమ్మడి పువ్వు పెట్టి పసుపు కుంకుమ పెట్టింది అత్త . అది గౌరీ దేవి అంట . అమ్మమ్మ దణ్ణం పెట్టుకోమంది ,సర్లే తర్వాత పెట్కుంటాను అన్నాను , గొబ్బెమ్మ కి దణ్ణం పెట్టుకుని కోరుకుంటే మాంచి మొగుడు వస్తాడు అంది , అప్పుడు వెంటనే చాల సిన్సియర్ గా దణ్ణం పెటుకున్నాను .అది చూసి తెగ నవ్వింది అమ్మమ్మ . హూ …. మరి కొట్టాల్సిన చోట కొట్టింది ఎంతైనా ఎక్స్పీ రియన్సు  కదా .వాళ్ళ చిన్నప్పుడు పెళ్ళికాని పిల్లలు పాటలు పాడేవాల్లట ….
సువ్వి గొబ్బెమ్మా శుభాన్నియ్యవే
తామరపువ్వంటి తమ్ముడ్నియ్యవే
చామంతి పువ్వంటి అత్త నియ్యవే
మల్లెపువ్వంటి  మామనియ్యవే
మొగలిపువ్వంటి మొగుడ్నియ్యవే
బంతిపువ్వంటి బతుకు నియ్యవే అనీ

నాకు పాడి చెప్పింది ,తాత వింటే ఒక్కటిస్తాడు ,ఇప్పుడు లేడు కాబట్టి సరిపోయింది, అని నేను పరిగెత్తా . నన్ను తిట్టిపోసింది ,ఆనక నవ్వేసిన్దిలెండి .

ఈ లోపు టిఫిన్ రెడీ . అది లాగిచ్చేసి మామ తో కలిసి టౌన్ దాకా వెల్లాను. ఆవుల కోసం డెకరేషన్ సామాన్ల కోసమ్. చాల పెద్ద సంత . ఆవులకి ఎద్దులకి ఇన్ని వస్తువులు ఉంటాయా అని ఆశ్చర్యమేసింది . ఇంటికి వచేసరికి అమ్మ వాళ్ళు అరిసెలు చెస్థున్నరు. వాళ్ళకి కొంచం హెల్ప్ చేసానన్నమాట .
తర్వాత ఆ రోజుకి ఏమి లేదండి, సాయంత్రం ఈ టీవీ లో పాత  సినిమా వేస్తే చూసి భోంచేసి బజ్జున్న్నాం .

తరవాత రోజు సంక్రాంతి ,మళ్ళీ  ఆ రోజు కుడా తలస్నానం చేసి కొత్త బట్టలు ,పిండివంటలు లాగించి , అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నాం . మధ్యాహ్నం  నేను మామ మళ్లీ  మా ఊరు వెళ్ళాం , మా నాన్న అక్కడ ఉన్నారు . నాన్న వాళ్ళ ఊరు వెళ్తే ఇంక్కేక్కడికి రారు .సంక్రాంతి పెద్ద పండుగ కదా అల్లుడిని పిలవాలని మామ వచ్చాడు,మా సొంతూరు పక్కనే,పెళ్లై   ఇన్నేళ్ళయినా కుడా వచ్చి మరీ పిలవాలి అంటాడు  మా మామ . రాత్రికి మళ్లీ  అమ్మమ్మ  దగ్గరికి వచ్చేసా  , అ ఊరికి ఈ ఊరికి బైక్ లో 10 నిముషాలు అంతే.మా నానమ్మ వాళ్ళ ఊర్లో పండుగ లేదు . అంటే ఊర్లో ఎవరో చనిపోయారు కాబట్టి ఆ ఇయర్ సంక్రాంతి లేదు . పల్లెల్లో ఇప్పటికీ అందరికీ వీలైనప్పుడే చేస్కుంటారు ,ఎవరిన్ట్లోనైన ఇలాంటివి జరిగితే ఊరంతటికి పండుగ లేదు .

సంక్రాంతి రోజు కన్నా తర్వాత రోజు కనుమ చాలా పెద్దగా  చేస్తారు మా వైపు .

కనుమ రోజు హడావిడి అంత ఇంతా కాదు. ఆ  రోజు భలే పని. నేను మామ్మయ్య పొద్దునే అవులని తీస్కుని చెరువు దగ్గరికి వెళ్ళాము ,వాటిని శుబ్రంగా కడికి ఎండలో కట్టేసాడు . తర్వాత ఇంటికి తీస్కొచ్చి వాటి కొమ్ములకి రంగులు వేసాము థ భలే సరదాగా  వున్ది.
తర్వాత రెస్టు . సాయంత్రం 3 గంటలకి గుడిలో గంటకొట్టారు , మా అమ్మమ్మ నా చేతికి  పళ్ళెం ఇచి పంపింది .నేను పిల్లలూ వెళ్ళాము .. పళ్ళెంలో వున్నా బియ్యం,బెల్లం,పాలు,నెయ్యి అక్కడ ఇచ్చాము, అలా అందరూ తెస్తారు , సాయంత్రం తోటలో దాన్ని వండి పరమాన్నం ప్రసాదం అందరికి ఇస్తారట . చూసారా ఇక్కడ ఎంత ఏకత్వం ఉందో .

ఈ పధతి బాగా నచ్చింది . ఇంకా ఇంటికి వచ్చి ఆవుల్ని రెడీ చేసాము రిబ్బన్లు, బెలూన్లు , పెట్టి తెగ రెడీ చేసాం . అందరూ సాయంత్రం తోటలోకి తీస్కోచినప్పుడు పోటి అనమాట ఎవరి ఆవులు బాగున్నాయో అని .

వాటిని రెడీ చేసి మేము కుడా రెడీ అయ్యము. తర్వాత అందరం కలిసి తోట లో ఉన్న కాటమరాజు దేవుడి దగ్గరికి వెల్లాము. అందరం అంటే ఆవులు కుడా అనమాట. పల్లెల్లో ఆవులు కూదా ఫ్యామిలీ మెమ్బర్సె …

అన్ని ఆవులు అంత చక్కగా రెడీ ఐ వస్తే భలే అనిపించింది . ట్రాక్టర్స్ వచ్చి ఎద్దులు లేవు కానీ అవి ఇంకా అందంగా ఉండేవట  .

తర్వాత ఒక చోట పెద్దమంట  వేసి ఆవులకి చూపించారు , అవి భయం తో పారిపోయాయి , నేను కంగారు పడితే ఏమి కాదు, అవే  వచ్చేస్తాయి ఇంటికి అన్నారు, నాకు ఆశ్చర్యం వేసిన్ది. అలా చేస్తే వాటికి దిష్టి పోతుందట . ఇప్పటికి పాలూ ,ఎరువు రూపమ్ లో ఆవుల వల్ల మంచి ఆదాయం వస్తుంది ఊర్లలో , అందుకని వాటిని చాలా  బాగా చూస్కున్తారు ..

తర్వాత ప్రసాదం పెట్టారు.నా ఫ్రెండ్స్ (అంటే వాళ్ళకి కుడా అది అమ్మమ్మా వాళ్ళ ఊరు అనమాట) వచ్చారు , వాళ్ళతో కలిసి కాసేపు అలా  కట్ట మీద నడిచి ఇంటికి వెళ్ళాను,ఆవులు వచ్చాయా లేదా అని చూస్తే చక్కగా వచ్చి అప్పుడే నెమరు వేస్తున్నాయి  హాయిగా ….
నాన్న వచ్చాడు ఇక  అమ్మమ్మ అది నాయనా ఇది నాయనా అని చంపేసింది .. తర్వాత భోజనాలు . ఇన్నేళ్ళ తర్వాత కుడా నాన్నకి స్పెషల్ ట్రీట్మెంట్ … నవ్వొచింది అమ్మమ్మ హడావిడి చూస్తే .
ఇంక  చాలా అలసిపోయాను …. బాగా నిద్రపట్టేసింది ….మనసు ఆనందంగా వున్నప్పుడు వచ్చే నిద్ర భలే మత్తుగా ,కమ్మగా వుంటుంది .

….. …
…..
….
తరవాత చాలా సంక్రాంతులు వచ్చాయి అన్నీ , టీవీ ముందో లేక హాస్టల్లో గడిచాయి కానీ ఇంత చక్కని పండుగ మళ్లీ ఎప్పుడూ చేస్కోలేదు .

అందరికీ సంక్రాంతి  శుభాకాంక్షలు ……..
వుంటాను  బై

దైవదర్శనం

చిన్నపటినుండి  దేవుడంటే నాకు చాలా  ఇష్టమండి . తెలిసీ తెలీని వయసులో దేవుడు అంటే ఎవరమ్మా అని అమ్మని అడిగినప్పుడు, “నీకు నేను నాన్న ఎలాగో మనందరికీ, అంటే భూమ్మీద  ఉన్న అందరికి దేవుడు అలాగన్న మాట” , అని మా అమ్మ చెప్పినప్పటినుండి ఇష్టం . ఇష్టం ఇంకా భయం కాలేదండి . అదేంటి అనుకుంటున్నారా ,చెప్తా చెప్తా ,……. మనం ఎప్పుడైనా మన కిష్టమైన వాళ్ళ దగ్గర ఎందుకు భయపడతాం , ఏదైనా తప్పు చేసినప్పుడు,లేదా పాపం చెసినప్పుదు. కాబట్టి మనిషిగా అయన అంటే  భయం లేదు అన్నమాట . ఉన్దకూడదు అని నా కోరిక.

ఇంత ఇష్టపడే దేవుడి మీద నాకు ఒకసారి కోపమో , బాధో లేక చికాకో తెలీని ఫీలింగ్ కలిగింది . ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే అమ్మకి చెప్తే గుంజిళ్ళు తీయించి గట్టిగా  నా దగ్గరే నా  చెంపలు వాయిన్పించింది . అనుమానం వస్తే తీర్చుకోవాలి కదండీ మరీ , దేవుడికి కోపం వస్తుందని అనుమానానికి  తెలీదుకదండి  .

ఇంతకీ ఎం జరిగిందంటే ………….. మా అమ్మ, వాళ్ళ ఫ్రెండు  గోదారి గట్టున వుండే దేవుడి దగ్గరికి వెళ్దాం అన్నారు . వంశీ గారి సినిమాలు ,అయన రాసిన పసలపూడి కధలు ,గోదారి కధలు చదివిన నాకు ఎప్పటినుండో ఆ గోదారి అందాలు చూడాలని ఆశ . వస్తావా అని అడగడం పూర్తి కాకుండానే వస్తానని తల ఆడించేసా . ఎంత ఆనందంగా  అన్పించిందంటే చెప్పలేను . గోదారి కోసమే స్టార్ట్ అయ్యాను .

బస్సులో  ప్రయాణం . వర్షాకాలం బాగా వర్షాల వల్ల  పంట చేలు చాల బాగున్నాయి . పచ్చదనాన్ని  చూస్తే  కళ్ళకి మనస్సుకి ఎంతో  మంచిదని పేపర్ లో చదివాను అది 100% కరెక్ట్ అన్పించింది . ఆఫీసు లో పనిచేసే వాళ్ళకి ఇది చిట్కా.  కళ్ళు స్ట్రైన్ అయితే కాసీపు  అలా నేచర్  ని చుడండి కొంచం రిలీఫ్ గా  అన్పిస్తుంది… హూ … కొద్ది దూరం  వెళ్ళాక అన్నీ కాటన్ తోటలు . పచ్చటి  చెట్లకి మంచు పువ్వులు కాసినట్లుగా ఉన్నాయ్ ….. ఎంత బాగున్నాయో … ఇప్పటికీ తలచుకుంటే  గుర్తే ….

తర్వాత గుడి ఉన్న ఊరు చేరుకున్నాం … ముందు గోదాట్లో  స్నానం అన్నారు ….. వెళ్ళాను …. మరీ లోతు  లేదు కాని మంచి ఫ్లో లో ఉన్ది… గోదారి చూడగానే భలే సంతోషమేసింది ….. ఎవరో పాత స్నేహితురాలిని చూసినట్లు …. అలా  ఎంత ఆడానో …. అమ్మ ఇక రావే నువ్వొచిన్ది దేవుడి కోసమా లేక గోదారి కోసమా అంటే గోదారి కోసమే అన్నాను . చెంపలు  వాయించుకోమంది … నేనేం తప్పు చెప్పాను ??
ఇక్కడ మొదలు నా డౌట్లు …. నేను చెప్పింది నిజమే కదా మరి దేవుడికి ఎందుకు కోపం వస్తుంది ???????ఎం చేస్తాను భానుప్రియ  లాగా అర్ధం చెస్కొరూ ……………. అని సాగాదీస్కుంటూ గుడికి  వచ్చాను . గుడి అంటే కూడా మనకి  ఇష్టం అన్నింటికనా  పులిహోర ఇంకానూ ….. అదేంటోనండి   ఎవరు ఎంత అద్భుతంగా చేసిన అది ప్రసాదంగా ఇచ్చే పులిహోరంత  బాగోదు …. అవునంటారా కాదా ………….

ఇలా ఉండగా దణ్ణం పెట్టుకుని దేవుడిని చూస్తున్నాను ,ఏదైనా కోరుకో మంటుంది అమ్మ ,సర్లే అని దణ్ణం పెట్టుకుని అన్న్నీ చూస్తున్నా , అమ్మ  సీరియస్ గా ఏదో అప్లికేషన్ పెడ్తోంది దేవుడికి .

అప్పుడు  జరిగిందండి ఆ సీను …. ఒకాయన  వచ్చాడు ఫామిలీ తో …సఫారీ సూటు లో …. బాగా పేరు ఉన్నదేమో పూజా రి  గారు ఎదురెల్లి  స్పెషల్  గ తీస్కేల్లారు … నేనేమి  అనుకోలేదు  అది కామన్ దేశంలో అని… వచ్చిన అతను చాలా పెద్దపెద్ద మంత్రాలు చదివించాడు పూజారి  గారి దగ్గర …. అంతా ప్రోటోకాల్  ట్రీట్మెంట్  అన్నమాట ….

ఇంతలో ఇంకొకళ్ళు వచ్చారు అది పల్లెటూరు , చాల సాదా గ ఉన్నారు ,అతను అతని  భార్య ఇద్దరు పిల్లలు , పెద్దగ చదువుకున్నట్లు లేరని తెలుస్తోంది …. కాని  వాళ్ళ కళ్ళ లో దేవుడిని చూసినప్పుదు కలిగిన ఆనందం ,తృప్తి  అమాయకమైన నమ్మకం ,భక్తి ….. భలే ముచ్చటేసింది ….

కానీ వాళ్ళు చాలా సేపు  ఎదురుచుసారు పూజారి దగ్గరకు రాలేదు … ఇతను పిలవడానికి భయపడుతున్నాడు ,… మేము కొంచం ముందు లైన్ లో ఉన్నాము మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు … అతను తీర్థం అడిగితే తర్వాత అని  సైగ చేసాడు అతను  కాసేపు చూసి  వెళ్ళిపోయాడు …. ఎమీ తీస్కోకుండా …. ఆ క్షణం నాకు ఎంత భాద వేసిందంటే ….. చెప్పలేను …. అక్కడ ఎక్కువమంది వున్నారా అంటే అది కూడా  కాదు . మేం , ఆ సఫారీ అయన అండ్ కో ఇంకా  ఈ అబ్బాయ్ వాళ్ళ ఫామిలీ అంతే ….
కానీ ఎందుకు ఆ తేడా …. చాల భాదేసింది ….. దేవుడు అందరకి ఒక్కడే కదా??????

దక్షిణ ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా చూస్తాడా ????
అమ్మ దగ్గరికి పిల్లలు వస్తే బాగా ఉన్న బిడ్డకి పలావు పెట్టి , ఎమీ లేని బిడ్డకి చారన్నం పెడ్తుందా ????అలా  చేస్తే తనసలు అమ్మ ఎలా అవుతుంది ????

అమ్మే అలా ఉండలేనప్పుడు .. అమ్మనే చూసుకునే దేవుడు  ఎలా తేడా చూపగలడు????

అంటే ఇక్కడ ఉన్నది మనుషులని చేసిన దేవుడా లేక మనిషి చేసిన దేవుడా ????????ఇలా  ఎన్ని ప్రశ్న లో నన్ను కన్ఫ్యూజ్  చేసాయి …

అమ్మని అడిగితే చెంపలు ఎర్రబదేలాగా వాయించుకోమని ఆర్డర్ పాస్ చేసింది …. ఏంటో ఎవరికీ చెప్పలేను …. అడగలేను…

ప్లీజ్ మీరైనా అర్ధం చెస్కోరూ … ఒకవేళ తప్పనిపిస్తే వదిలెయ్యండి …. ఎందుకంటే …
మళ్ళీ చెంపలు  వాయించుకుని గుంజిళ్ళు తీసే ఓపిక నాకు లేదు కాబట్టి …..

వచేటప్పుడు దూది లాగా తేలిగ్గా వున్న మనసు గోదాట్లో మున్చినట్లు బరువుగా అనిపించిన్ది….
వుంటాను ….బై

sayamkalam kaburlu – 1

నమస్కారమండి  నేను  ఒక తెలుగు అమ్మాయిని . తెలుగింటి  ఆడపిల్లలకి ఉండే  సహజమైన ఆభరణాలు అవే నండి ఆ వగరు ,పొగరు,అందం, అమాయకత్వం ,అన్నిటికి మించినది మన తెలుగు ఆడపిల్లల ఆస్తి అదే గడుసుతనం  వున్న ఒక సామాన్య ఆడ పిల్లని . కాబట్టి న ఈ బ్లాగులో విశేషాలు స్త్రీ కోణం నుండే ఉంటాయన్నమాట … అంటే నేనేదో స్త్రీ పక్షపాతినని  కాదు… అబ్బాయిల ఆలోచన ధోరణి అమ్మాయిల అలోచనా ధోరణి వేరుగా వుంటాయి కదా అది గమనిన్చుకుంటారని నా భావన ….
ఇకపోతే ఈ బ్లాగు ద్వారా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను .నా అంతట నేను చెయ్యలేనివి, ఇతరులకు చెప్పలేనివి, మనసులో ఎన్నాళ్ళనుండో వుండి వేధించే కొన్ని విషయాలు ఇవే కాకుండా కొన్ని సరదా విషయాలు ,మన అందరి జీవితాల్లో ఉండే గమ్మతైన  అనుభవలూ చూద్దాం .
మొన్న నేనో పుస్తకం చదివానండి , బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు , సెక్రటరీ  అనీ సులోచానారాణి గారి  నవల . 1970 లో వచ్చిన నవల  ఐన కూడా చాలా చాలా బాగుందండి . కథ  ని చెప్పిన తీరు, హీరోయిన్ వ్యక్తిత్వం ,హీరో ఔన్నత్యం ఓహ్ చాలా వండర్ఫుల్ నరేషన్ అండి . ముఖ్యంగా  మీకు రొమాంటిక్  నవలలు  ఇష్టమయితే తప్పకుండ నచుతున్ది…

ఆ నవల నుండి నేను  నేర్చుకున్నదీ  ,జీవితంలో చాల సార్లు అన్వయిన్చుకున్నది అయిన  ఒక వాక్యం చెప్పాలన్కుంటున్నాను …. అది ” ప్రతి మనిషి జీవితం రెండే విషయాల మీద ఆధారపడివుంటుంది ఒకటి అనుకున్నవన్నీ జరగటం రెండు అనుకున్నవి జరగకపోవటం”. చూడడానికి ఎమీ లేకపోయినా కొంచం ఆలోచిస్తే ఈ వాక్యం ఎంత అక్షరసత్యమో తెలుస్తుంది. ఎన్నో మలుపులతో చక్కటి తెలుగుతో చాలా  అందమైన నవల .

వెన్నెల్లో కొబ్బరాకుల  నీడలో కూర్చొని మనసుకి నచినవాల్లని  తలచుకునే ఆనందం, అనుభూతి చెందాలంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి ..

మీకు తెలీకుండానే ఒక అందమైన  అనుభూతిని మూటగట్టుకుని , మీదైన లోకం లోకి వెళతారు . మీరు అలసటగా  ఉంటె గనుక ఈ పుస్తకం ఒక కమ్మని తెలుగు టానిక్ …

ఈరోజుకి  ఇవేనండి …. ఇంకా మరిన్ని కబుర్లతో మల్లీ  కలుద్దాం …సెలవు