నమస్కారమండి నేను ఒక తెలుగు అమ్మాయిని . తెలుగింటి ఆడపిల్లలకి ఉండే సహజమైన ఆభరణాలు అవే నండి ఆ వగరు ,పొగరు,అందం, అమాయకత్వం ,అన్నిటికి మించినది మన తెలుగు ఆడపిల్లల ఆస్తి అదే గడుసుతనం వున్న ఒక సామాన్య ఆడ పిల్లని . కాబట్టి న ఈ బ్లాగులో విశేషాలు స్త్రీ కోణం నుండే ఉంటాయన్నమాట … అంటే నేనేదో స్త్రీ పక్షపాతినని కాదు… అబ్బాయిల ఆలోచన ధోరణి అమ్మాయిల అలోచనా ధోరణి వేరుగా వుంటాయి కదా అది గమనిన్చుకుంటారని నా భావన ….
ఇకపోతే ఈ బ్లాగు ద్వారా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను .నా అంతట నేను చెయ్యలేనివి, ఇతరులకు చెప్పలేనివి, మనసులో ఎన్నాళ్ళనుండో వుండి వేధించే కొన్ని విషయాలు ఇవే కాకుండా కొన్ని సరదా విషయాలు ,మన అందరి జీవితాల్లో ఉండే గమ్మతైన అనుభవలూ చూద్దాం .
మొన్న నేనో పుస్తకం చదివానండి , బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు , సెక్రటరీ అనీ సులోచానారాణి గారి నవల . 1970 లో వచ్చిన నవల ఐన కూడా చాలా చాలా బాగుందండి . కథ ని చెప్పిన తీరు, హీరోయిన్ వ్యక్తిత్వం ,హీరో ఔన్నత్యం ఓహ్ చాలా వండర్ఫుల్ నరేషన్ అండి . ముఖ్యంగా మీకు రొమాంటిక్ నవలలు ఇష్టమయితే తప్పకుండ నచుతున్ది…
ఆ నవల నుండి నేను నేర్చుకున్నదీ ,జీవితంలో చాల సార్లు అన్వయిన్చుకున్నది అయిన ఒక వాక్యం చెప్పాలన్కుంటున్నాను …. అది ” ప్రతి మనిషి జీవితం రెండే విషయాల మీద ఆధారపడివుంటుంది ఒకటి అనుకున్నవన్నీ జరగటం రెండు అనుకున్నవి జరగకపోవటం”. చూడడానికి ఎమీ లేకపోయినా కొంచం ఆలోచిస్తే ఈ వాక్యం ఎంత అక్షరసత్యమో తెలుస్తుంది. ఎన్నో మలుపులతో చక్కటి తెలుగుతో చాలా అందమైన నవల .
వెన్నెల్లో కొబ్బరాకుల నీడలో కూర్చొని మనసుకి నచినవాల్లని తలచుకునే ఆనందం, అనుభూతి చెందాలంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి ..
మీకు తెలీకుండానే ఒక అందమైన అనుభూతిని మూటగట్టుకుని , మీదైన లోకం లోకి వెళతారు . మీరు అలసటగా ఉంటె గనుక ఈ పుస్తకం ఒక కమ్మని తెలుగు టానిక్ …
ఈరోజుకి ఇవేనండి …. ఇంకా మరిన్ని కబుర్లతో మల్లీ కలుద్దాం …సెలవు
Leave a Reply