Home Blog Page 8

కప్ప గారి వైభవం….

ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను,

mountain-yellow-frog-500కాలిఫోర్నియా లో విలియం సన్ ఫారెస్ట్ రేంజ్ అని ఉంది.అది ట్రెకింగ్ కి బాగా ఫేమస్ . ఏటా ఈ కొండపైకి ఎక్కడం ఇక్కడి ప్రజలకి ఒక మంచి అనుభూతి .కాని ఆ అనుభూతిని కేవలం జ్ఞాపకం గా మార్చేసింది ఒక జీవి. ఎవరనుకున్నారు ఒక కప్ప గారు.

నిజమండీ, మౌంటెయిన్ యెల్లో లేగ్ద్ ఫ్రాగ్(mountain yellow legged frog) అని ఒక అంతరించిపోబోయిన కప్ప గారి జాతి . ఈ విలియంసన్ రాక్ ప్రాంతం ఈ జాతి కప్పలు పెరిగే ప్రాంతమట.2005 లో వీటిసంఖ్య 5-6 మాత్రమే. ఇక్కడికి వచ్చేటూరిస్టుల వల్లే ఈ కప్ప గారి జాతి అంతరించిపోతోందని మొత్తం ట్రెక్కింగ్ నే మూసేసారు.అప్పటినుంచి ప్రజలు ఎన్ని సార్లు పిటిషన్లు పెట్టినా కూడా కప్ప ల గురించి ఆలోచించి ఆ కొండని ముసివేసారట.ఇక్కడి అటవీశాఖ వారి ప్రయత్నం ఫలించి ప్రస్తుతం కప్పల సంఖ్య 105 కి చేరుకుంది.మొత్తానికి అంతరించిపోతున్న జాతిని బతికిన్చారన్నమాట.

ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయాలు ఏంటంటే

1.మనుషుల వల్ల ప్రస్తుతం,వాటికి ప్రమాదం వుండే అవకాశాలు ఒక్క శాతం మాత్రమే, ఐనా కూడా ఆ కొంచం రిస్కు కూడా తీస్కోలేదు ఇక్కడి ప్రభుత్వం.

2.ఇక్కడ చెప్పేవిలియం సన్ రాక్ చుట్టూ వుండే అడవుల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నాయి.

3.ఇక్కడ ప్రజల అసంతృప్తి కన్నా పర్యావరణ సమతుల్యత(ecological balance) కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.

అంతా చదివాక నిజంగా ఆ కప్ప ఇక్కడ వుండడం దాని అదృష్టం అనిపించింది.అదే మన దేశం లో ఐతేనా అలాంటి జాతి కప్ప ఒకటి ఉందని మనకి తెలిసే లోపు కప్పనీ,, కప్ప ఉన్న గ్రానైట్ కొండను కూడా మింగేసేవాళ్ళు మన భూభకాసురులు.

siberian-tiger-resting-animal-hd-wallpaper-2880x1800-8054

కప్ప వరకూఎందుకండీ బాబు, పోయిన వారం పేపర్ లో వేసారు, మన జాతీయ జంతువు శ్రీ శ్రీ పెద్ద పులి గారిని, మెహబూబ్ నగర్ జిల్లాలోచంపేసారు. అక్కడి తో ఊరుకోక దాని కాళ్ళ గోర్లు, పళ్ళు పీకేసి ఎత్తుకుపోయారు.ఎంత దారుణం.అంతేలే,.. మనిషి ప్రాణాలకే విలువ లేదు,ఇక జంతువుల్ని ఎక్కడ బ్రతకనిస్తాం.

 

indian-sparrowఇప్పటికే పిచ్చుకలని పోగొట్టుకున్నాం, ఇంకా ఏమేమి పోగొట్టుకుంటామో.పిచుకలు గుర్తున్నాయా ఇంతకి మీకు. మనం మన పిల్లలు మాత్రమే ఉంటే చాలదండి భూమ్మీద మనతో పాటు ఉండడానికి ప్రతి ప్రాణమున్న జీవికి హక్కు వుంది. వాటికే గనక నోరు వుండివుంటే, వాటికే గనక మనలా కోర్టులు వుంటే, ఈపాటికి మనమంతా జైళ్ళల్లో వుండాల్సి వచ్చేదేమో.

కొసమెరుపు: అన్నట్టూ పైన కాలిఫోర్నియా విశేషాలు మన నాయకులకు చెప్పకండి బాబూ, ఎందుకేంటి….ఇంకేమన్నా ఉందా…బంగారం లాంటి గ్రానైట్ కొండలని వదిలేస్తారా కప్పల కోసం  అని ఇక్కడి వాళ్ళని కూడా పాడు చేసేస్తారు.పాపం….మంచితనాన్ని, మానవత్వాన్ని ఎక్కడో ఒక చోట బతకనిద్దాం.

నేటి భారతం..???

2 BHARAT MATA-MOTHER INDIA Vande maataraM.

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.దాదాపు 150 సంవత్సరాల దాస్య సృంఖలాలను తెంచుకున్న స్వతంత్ర భారతావని తనకంటూ సొంతమైనటువంటి రాజ్యాంగాన్నిఏర్పరచుకున్నటువంటి రోజు ఈ రోజు.1950, జనవరి 26న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వం లో భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం గా, సెక్యులర్ దేశం గా ఆవిర్భవించింది.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కై ఒక రాజ్యాంగం ఏర్పడిన రోజు.ప్రపంచదేశాల సరసన గర్వంగా భారతదేశం నిలబడ్డ రోజు ఈ రోజు.

జాతి గర్వించదగ్గ రోజు. కానీ నేటి సమాజం నిజంగా నాటి మహనీయులు కలలుగన్న సమాజమేనా? నిజంగా గర్వించ తగినటువంటి పరిస్థితులు నేటి సమాజం లో ఉన్నాయా????

ఎన్నోఏళ్ల బానిస బ్రతుకు తర్వాత, ఎందరో అమర వీరుల త్యాగ ఫలం వల్ల, మరెందరో మహనీయుల కృషి వల్ల ఏర్పడిన ఈ స్వతంత్ర భారతావని మళ్ళి తన ఉనికిని కోల్పోతోందా??

మన దేశం లో జరిగే ఘోరాలూ చూస్తోంటే నాకు కలిగిన అనుమానాలు ఇవి.ముఖ్యంగా స్ర్తీ లకు జరిగే అన్యాయాలు.

స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా స్త్ర్రీ కి రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ కు జరిగిన ఘోరం మరిచిపోయే లోపు అటువంటి ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయ్. అవి మరచిపోఎలోపు మానవత్వమే సిగ్గు పడేలా దేశఆర్ధిక రాజధాని అయిన ముంబయ్ లో అనూహ్య అనే అమ్మాయి అత్యంత దారుణంగా  హింసించబడి , హత్య చేయబడింది.అదీ పట్టపగలు .ఒక్క సారిగా యావత్  భారతావని  ఉల్లిక్కి పడింది.అంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు నిజమైన స్వాతంత్రం మనకు రానట్లే కదా?

క్యాబ్ డ్రైవర్లు,ఆటో వాలాలు, అపరిచితులు, టీచర్లు, భంధువులు, ప్రమాదం ఏ రూపం లోనైనారావచ్చు. సామాన్య మహిళకు రక్షణ అనేదే పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోతోంది.పసిపిల్లలు కూడా ఈ రాక్షస  కార్యాలకు బలైపోతున్నారు.అమాయకంగా,ఆనందంగా గడచిపోవలసిన బాల్యం ప్రశ్నార్ధకంగా మారిపోతోంది.govt_may_rope_in_aganwadis_save_the_girl_child

కొన్ని ఏళ్ల తర్వాత, వంటింటి కుందేళ్ళు అనే  పిలుపు నుండి విముక్తి పొంది, అన్ని రంగాల్లోతమ ప్రతిభను చాటుతున్నారు మహిళలు.కానీ ఈనాటి పరిస్థితులలో స్త్ర్రీ బయటికి రావడమే ఒక సాహసమైపోయింది. కొందరు మృగాల్ల పశుబలం ముందు ఓడిపోతోంది.

indian-women

ఈ ఓటమి మన భారతజాతి మొత్తానిది. స్త్రీ ని శక్తీ స్వరూపిణిగా చూపే దేశం లోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి.. మొన్నఎవరో, మన దేశానికీ వచ్చిన జర్మనీ దేశస్తురాలి పై కూడా కొందరు అఘాయిత్యం చేసారట.ప్రపంచదేశాలలో మన పరువు ఏమైపోవాలి?.నన్నడిగితే ఇలాంటి వాళ్ళు కూడా దేశ ద్రోహులే. కాదంటారా????

అసలు మనకెందుకీ  జాడ్యం.???

ఢిల్లీ సంఘటన తర్వాత పంజాబ్ లో మహిళల రక్షణ కోసం హెల్ప్ లైన్ పెడితే ఆరు నెలలలో 5లక్షల ఫిర్యాదులు వచ్చాయట. దీన్నిబట్టి మన సమాజం ఎటు వైపు వెల్తోందో మీరే ఆలోచించండి.

తప్పు ఎవరిది?? ఇంత దారుణమైన కార్యాలను చేసే వారికి ఈ సంఘంలోఉండే హక్కుఉందా???

ఆడపిల్లల స్వేచ్చను హరించే శక్తి వీల్లకి ఎవరు ఇచ్చారు???ఏ రాజ్యాంగం దీన్నిహర్షిస్తుంది???

ఇటు వంటి సమాజం లో ఉన్నామని గర్విద్దామా??

ఏమో,, అనూహ్య వార్త చదివాక స్వాతంత్రం మనకి వచ్చిందన్న ఆలోచనే కోల్పోయాను.మేరా భారత్ మహాన్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా వుంది.

ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు తెలీదు.కాని సాటి మహిళగా నా ఇంటి నుండి ఇటువంటి మృగం ఒకటి సమాజం లో కి వెళ్ళకుండా మాత్రం జాగ్రత్త తీస్కుంటాను.అది నా భాధ్యత అనుకుంటాను.

“ఇల్లు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది,సమాజం బాగుంటే జాతి గర్వించతగ్గ దేశం ఏర్పడుతుంది.”

photos-of-republic-day-of-india1సర్వజన సురక్షితమైన భారత దేశాన్నినిర్మించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడు మనస్పూర్తిగా గర్వంగా చేసుకోవచ్చు స్వతంత్ర దినాలు, గణతంత్రదినోత్సవాలు…..

సర్వేజనా సుఖినోభవంతు….

namasthe

కానుక..

స్నేహితుని  పెళ్ళి వస్తోంది, ఏదైనా కానుక ఇవ్వాలి కదామరి.కానుక అంటే మనం అవతలవారి సంతోషం కోరి, వారికి మంచి జరిగిందని , లేక జరగాలని,మనం మనస్ఫూర్తి గా ఇచ్చేది కదా.మనం ఇచ్చే కానుకలో మన అభిరుచి తెలుస్తుందంటారు.మనకి కొన్నిబ్రాండెడ్ కానుకలు ఉన్నాయండి,అదే మాటవరసకి వాచీ. నిజం అండి జనాల్లోఒక టాక్ కూడా  ఉంది , ఆంధ్రావాళ్ళు ఎవరికైనా కానుక ఇవ్వాలంటే 90 % మంది వాచీ నే కొంటారంట.నమ్మరా?నిజమండీ బాబు.మీరే చూస్కోండి కచ్చితంగా ఇప్పటికీ మీ దగ్గర ఒక్క  వాచీ ఐనా గిఫ్ట్ గా వచ్చింది ఉండి ఉంటుంది.ఇక పెళ్ళిళ్ళకైతే కచ్చ్చితంగా వెంకటేశ్వరస్వామి పటం లేదా సాయిబాబా ఫోటో.అదే మిత్రులైతే డిన్నర్ సెట్టు లేదా అబ్బాయ్ అమ్మాయ్ బొమ్మ.నా వరకు నా పెళ్లికే  నాకు ముగ్గురు వెంకటేశ్వరస్వాములు, ఇద్దరు సాయిబాబా గార్లు,నాలుగు డిన్నర్ సెట్లు వచ్చాయ్. కొన్నైతే కవలపిల్లలు అండి అదేనండి సేమ్ టు సేమ్ అనమాట.

గిఫ్ట్ సెలక్షన్ కూడా పెద్ద ఆర్ట్ అండి బాబు, అవతల వారికి నచ్చింది కొనాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది.కాకపోతే కొన్నిప్రోటోకాల్ ప్రకారం ఇయ్యాలి.అందుకే ఆ విషయం మా ఆయనకి వదిలేసా .నేను నా తరపున వాళ్ళకి సొంతంగా ఏదైనా చేసిద్దామని డిసైడ్ అయ్యా . ఏమిద్దామా…అనుకుంటే మొఘల్ పెయింటింగ్స్ గుర్తుకొచ్చాయ్.

నా వరకు నేను సొంతంగా ఏమైనా చేసి ఇవ్వడానికే ఇష్టపడతాను, అందులో మన ఇష్టం, ఆప్యాయత కనిపిస్తాయ్ అని నా ఉద్దేశం.

మీరు వేయొచ్చు అండి ఇది.కావలసిందల్లా కాన్వాస్ బోర్డు, పెయింట్లు, బ్రషులు ఇంకా కాస్తంత మీ “అమూల్యమైన సమయం’.  నేను వేద్దామనుకున్న బొమ్మ ఇది.  మీరు,  మీకు నచ్చింది,  మీ సంధర్భానికి తగినది  సెలెక్ట్ చేస్కోండి.

w

ఇది మొఘల్ కాలం నాటిది.రాజ కన్య, తామరపువ్వుతో ఉంది, మంచిది , శుభ సూచకం అని తీస్కున్నాను.

కాన్వాస్ బోర్డు తీస్కుని ముందుగా బ్రుష్షుతో మొత్తం ఒకసారి ఉత్తి నీటితో ఒక లేయర్ కోటింగ్ ఇవ్వండి.

తర్వాత ఆరిన వెంటనే పెన్సిల్ తో  ఔట్ లైను వేస్కుని , జాగ్రత్త గా రంగులు నింపాలి.r

రంగుల విషయంలోప్రయోగాలూ చెయ్యకుండా అవే వేసానునేను, మీకు కావలిసి వస్తే మీకు నచ్చినవి వేస్కోవచ్చు.b

 

రంగులు కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రతగా వుండాలి.చాలాకొంచం కొని చుక్కలు సరిపోతాయి. మీకు షేడ్స్ కావాలంటే రెండు మూడురంగులు కలిపి ట్రై చెయ్యవచ్చు.

 

 

unnamed

కాస్తదూది పక్కన వుంటే తప్పైతే వెంటనే కరక్టు చేస్కోవచ్చు.శరీరం కోసం నేను తెలుపు, పసుపు రంగులు మిక్స్ చేసి వాడాను.

 

 

 

చివరికి ఇలా వచ్చింది అనమాటf బాగుందో లేదో తర్వాత సంగతి అదో తృప్తి అంతే.

మీరు కూడా ప్రయత్నించి  చూడండి ఒక సారి….నేనే చెయ్యగాలిగానంటే మీరు కూడా తప్పక ఇంకా బాగా చెయ్యగలరు.

పూల రంగడు..

2తెలుగు సినీ రంగంలో ఒక శకం ముగిసింది. అదే అక్కినేని నాగేశ్వరరావు శకం. 75 సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను అలరించించిన మన నాగేశ్వరరావు గారు స్వర్గస్తులైనారు.ఆయన గురించి రాయడానికి ఆయనకి వచ్చినన్ని అవార్డులంత లేదు నా వయసు.నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే  ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు..అంతే. ఆయనో తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు.

సినిమా అంటే నే మాయ, ఎన్నికొత్త మాధ్యమాలు వచ్చినా ఎన్నటికీ వన్నెతగ్గని రంగం ఏంటంటే సినీరంగం.అటువంటి రంగం లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ని , తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ని వేసిన వ్యక్తి  ఏఎన్ఆరు గారు.

img_90

అయన గురించి రాసేదేముందండి, అయన జీవితం తెరిచిన పుస్తకం.అయన చేసిన సినిమాలు,వచ్చిన అవార్డులు,రివార్డులు అందరికీ తెలిసిందే.కాకపోతే మనల్నిఇంతకాలంగా అలరించి, భౌతికంగా మనకి దూరమైన ఆ గొప్ప వ్యక్తి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం.

కళ అనేది దేవుడిచ్చిన వరం,ఎందుకంటే మనిషికి చావు సహజం, కాని కళకు  చావనేది లేనేలేదు.ప్రేక్షకులలో రసహృదయం ఉన్నన్నిరోజులూ కళాకారులు  బ్రతికే ఉంటారు,చావువారి శరీరానికేకానీ ,వారి కళకు కాదు.

ప్రతిభకు, కృషి,పట్టుదల,ఓర్పు,తెలివి, అదృష్టం తోడైతే మనిషి ఎంత సాధించగలడు అనే దానికి ఏఎన్ఆర్ ఒక ఉదాహరణ. 1924 లో జన్మించిన అక్కినేని గారిది గుడివాడ తాలుకా కృష్ణాపురం.చిన్నతనంలోనే నాటకాలు వేసేవాడు.నాటకాలలో అడపాత్రలకు అయన పెట్టింది పేరు.17 ఏళ్ల ప్రాయం లో సినీరంగం ప్రవేశించారు.చక్కని ముఖ వర్చస్సు, వాక్చాతుర్యం గల వాడవడంవల్ల వెంటనే మంచి పేరు తెచ్చుకున్నారు.

15

ఏ ఒక్క పాత్రకీ పరిమితం కాకుండా జానపద,సాంఘిక,పౌరాణిక,భక్తి పాత్రలన్నీ ధరించి మెప్పించాడు.తనకంటూ  ప్రత్యేకమైన ఒక శైలిని ఏర్పరచుకున్నారు.మన తెలుగు సినిమాల్లో డాన్సు చేసిన మొదట హీరో ఏఎన్ఆర్ గారేనట.అయన డైలాగ్డెలివరీ, ద్రెస్స్సింగ్, హెయిర్ స్టైల్ అన్ని ఒక ట్రెండ్ సెట్ చేసాయనే చెపొచ్చు.

తెలుగుసినీరంగం హైదరాబాదు రావడానికి అయన చేసిన కృషి మరువలేనిది.”డబ్బుకి నేను బాగా విలువఇస్తాను నాది అనుకున్నది నేను ఒక్క రూపాయ్ కూడా పోగొట్టుకోను”అని కచ్చితంగా నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి.ఎవరు ఏమనుకున్నాఎన్నిమాటలు అన్నా తను అనుకున్ననియమాల ప్రకారం జీవించిన  మనిషి.

ANR with NTR Rare Portrait

ఆయన నటించిన సినిమాల్లో నచ్చినవి పెర్కొందామంటే అయన నటించిన 257 సినిమాల గురించీ రాయవలసి వస్తుందేమో.అన్నీ ఆణిముత్యాలే ఏదిగొప్పదని ఏరగలం.

ఏమైతేనేమిపంచెకట్టులో  హుందాగా నడుస్తూ,హాయిగా నవ్వేసే మన ఏఎన్ఆర్ గారు ఇకలేరు, కళారంగానికి తను చేయవలసిన సేవ ఇక ఐపోయిన్దంటూ సెలవు తీస్కున్నారు.

చివరిగా ఒక పరిపూర్ణమైన,అర్ధవంతమైన జీవితాన్ని మనకి ఆదర్శంగా వుంచి “కేవలం భౌతికంగా” మాత్రమే మనల్నివిడిచిన మన దసరాబుల్లోడు,ఎవర్ గ్రీన్ పూల రంగడు ఏఎన్ఆర్ గారికి అంజలి ఘటిస్తూ ……

Akkineni_Nageswara_Raoసెలవు…

eh

 

పూల జడ…

imagesపుట్టగానే మనిషికి జాతి లక్షణాలు తెలిసిపోతుంటాయి. చూడండి చిన్నపిల్లలు గా వున్నప్పుడే ఆడపిల్లలు పూలు, పండ్లవైపు  మొగ్గు చూపితే, మగపిల్లలు కత్తులు, కటార్ల వైపు మొగ్గు చూపుతారు.ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మా ఎదురింటి పాప మా ఇంటికి వచ్చింది.పట్టుమని మూడు ఏళ్ళుకూడా లేవు అప్పుడే అది నైల్ పాలిష్ సీసా తెచ్చి పూయమంటుంది, లిప్ స్టిక్ వేయమని చెపుతుంది. అప్పుడే ఎంత ఇంటరెస్ట్ వచేసింది దీనికి అనుకున్నాను.

తనని చూస్తే చిన్నప్పుడు నేను గుర్తు వచ్చాను. చిన్నప్పుడు నాకు బాగా ఇష్టమైనది పెళ్ళిళ్ళకి వెళ్ళడం.ఇక పెల్లికూతురంటే హీరోయిన్లాగా అనిపించేది.పెళ్లి జరిగినంత సేపూ పెల్లికూతురు పక్కనే వుండేదాన్ని.అన్నిటికన్నా పెల్లికూతురికి వేసే పూల జడ అంటే చచ్చేంత ఇష్ట పడిపోయేదాన్ని.అంతపెద్ద  జుట్టు కి అందంగా పూలు చుట్టి , జడ గంటలు పెడితే ఎంత బాగుండేదో.వెనకాలే వుండేదాన్ని పూల జడ చూడడం కోసం.అసలు పూల జడకోసం త్వరగా పెరిగి పెళ్ళి చేసేసుకోవాలి అనిపించేది. ఒక సారి తమాషా ఏమైందంటే, ఇలాగే పెళ్ళికి వెళ్ళాం, ఎప్పటిలా పెళ్ళి కూతురు వెనకాల నడుస్తున్నాను, ఆవిడ గారికిజుట్టు లేకపోయేసరికి ఇంత బారు సవరం పెట్టి పూల జడకుట్టారు.

పూల జడ అంటే బరువు కదా సరీగ్గా పీటలమీద కూర్చునెసరికి అది కాస్తా ఊడి కింద పడింది.అయ్యో పూల జడ ఊడిపాయిందో అని నేను అరిచాను, పక్కనున్న ఆవిడ నానోరు  గట్టిగా మూసేసింది.అప్పటికే మంటపం లో ఉన్నవాళ్లు ఘోల్లు మన్నారు.పంతులూ, పెళ్ళికొడుకు అందురూ నవ్వడమే.ఏమ్చేస్తారు అప్పటికప్పుడు తాడుతో సవరాన్ని జుట్టుని జాయింట్ చేసారనమాట.అప్పుడు నాలో నేనే శపధం చేస్కున్నా నా పెళ్ళికి నాకు సొంత జడ వుండాలని, ఎన్ని ఫాషన్లు ఊరించినా కుడా నా పెళ్ళి వరకు పొడుగు జడ మెయింటైన్ చేసాను,నాకిష్టమైన పూల జడ కోసం.

sara1

తర్వాత ఒకసారి మా పాత ఫోటోలు  చూస్తుంటే, మా అక్క చిన్నపటి ఫోటో ఒకటి కనిపించింది, పూల జడవేస్కుని అడ్డం  ముందు నిల్చోపెట్టి స్టుడియోలో తీసారు.ఎంత బాగుందో ఫోటో, లంగా జాకెట్టు లో ముద్దు గా ఉంది.నాకెందుకు తీయలేదు అని ఒకటే గోల చేసాను ,ఒక పూట అన్నం కూడా తినలేదు.అసలు రెండో పిల్లగా పుడితే అన్నిరోటిన్ అయిపోతాయ్ పెద్దాలకి.వాళ్ళ కన్ని కొత్తవి, వాళ్ళు వాడేసినవి నాకు.పుస్తకాలు, సైకిలు,డిక్షనరీ,అన్నీఅక్క వే నాకు.ఇప్పటికీ వెక్కిరిస్తుంటాను అమ్మని, నా కన్నీసెకండ్ హ్యాండ్ వే ఇస్తావు అని.అప్పట్లోఉడుక్కునేదాన్ని, ఇప్పుడు నవ్వొస్తుంది.కాని అప్పటికి అది నాకు వరల్డు ప్రాబ్లం అంత పెద్దది.

తర్వాత మా పెద్దత్తని అడిగాను, పూలజడ గురించి, చాలారకాలు  ఉన్నాయంట.వాళ్ళ చిన్నప్పుడు పూలజడలు కుట్టడం కూడా నేర్పెవారంట.మల్లెలతో, అరటి చెట్టు బోదె ని సపోర్ట్ గా  పెట్టి కుట్టేవాల్లంట.ఉత్తి చామంతులతో, మొగలి పూలతో కూడా చేసేవారంట.ఒకసారి వాళ్ళ ఫ్రెండు పెళ్ళి కి రాత్రి  మొగలి పూలతో జడ కుడితే, తర్వాత రోజు వాళ్ళాయన ఒళ్ళంతా చీరుకుపోయిందట. నవ్వకండి పాపం….ఎందుకో మీకూ  తెలుసూ నాకూ తెలుసు.

ఇంక నా పెళ్ళికి  పూల జడ ఆర్డరు ఇచ్చారు, నాకేమో నేనే వెళ్ళి చెప్పి చేయించుకోవాలి అని. నన్నేమో ఇల్లు దాటనివ్వరు.కాని ఇప్పుడు అంతా అడ్వాన్సు కదా పూల అతనికి ఫోన్ ఉంది, నాన్న ఫోన్ చేసిస్తే నేనే చెప్పాను నేను  చెప్పినట్టు చేసిచ్చాడు.చివరికి నేను చిన్నపటి నుండి కన్న నా కల నా పెళ్ళి కి నెరవేరింది అనమాట.DSC_5551

అందుకే చుట్టాల్లోచిన్నపిల్లలుంటే వాళ్ళకి పూలజడలు వేసి ఒక ఫోటో తీయిస్తుంటాను.పెళ్లప్పుడు ముగ్ధలాగా వుంటే, చిన్నపుడు అమాయకంగా ఇంకా బాగుంటారు…పోయిన వేసవి కి మా అయనవాళ్ళ అక్కకూతురు వస్తే దానికి పూల జడ వేసి నా సరదా తీర్చుకున్నాను.ఎప్పుడూ లేటెస్టుఫాషన్ లో  ప్లాస్టిక్   పువ్వులా వుండే పిల్ల అచ్చు ముద్డ్డ బంతిలా ఎంత చక్కగావుందో.

కావాలంటే తేడా మీరే చూడండి

 

WP_002668

photo(1)

 

మీకు ఆడపిల్ల వుంటే తప్పకుండా ఒకసారి పూల జడ ట్రైచెయ్యండి, మీ చిన్నారి పాపాయి ఎంత చక్కగావుంటుందో చూడండి, ఫోటోని దాచి పెట్టి తను పెద్దైయ్యాక “కానుకగా” ఇవ్వండి……

 

అప్పట్లోప్రతి వారూ తమ పిల్లలకి పూలజడ కుట్టించి ఫోటోతీసేవారు. ప్రతి ఒక్కరి దగ్గర అలంటి ఫోటోఒకటి ఉండేది.ఆపుదప్పుదూ పేపర్లో ఆర్టికల్స్ కూడా వస్తుంటాయ్, బామ్మలు, ఆంటీలు రాసినవి, వాళ్ళ కాలం గురించి గొప్పగా  చెపుకుంతుంటారు.

మరి మనం కూడా చెప్పుకోవాలి కదా.మన పిల్లలకి కూడా మనం అందమైన జ్ఞాపకాలని అందించగలం అని నిరూపించుకోవాలి కదా, ఏమంటారు?.మన పెద్దవాళ్ళ కాలం నాటి ఆనందాలను మన చిన్నారులకి ఇస్తూ, అదే విధం గా ఈనాటికి తగ్గట్టుగా ఆధునిక వసతులన్నీసమకూర్చాలి వాళ్ళకి అంటాను, ఏమంటారు? 

“ఈ కాలం పిల్లలకిఏమితెలీదు, సరదాలు ముచట్లు ఏమి రావు అని అంటూ వుంటారు కదా, ఆ అవకాశం పెద్ద వాళ్ళకి ఇవ్వకండి. మోడ్రన్ గా వుండండి, పిల్లలనిఈ కాలానికి తగ్గట్టుగా నే పెంచండి, కాకపోతే అప్పుడప్పుడూ మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇలాంటి సరదాలని వాళ్ళకి కూడాఅందించండి.”

photo(2)

ప్రియమైన నీకు ..

మనకు ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయ్. స్నేహితులు ,బంధువులు ,ఆత్మీయులు ఎంతో మంది వుంటారు . వారి కి శుభాకాంక్షలు తెలియచేయడానికి గ్రీటింగ్ కార్డ్లు ,గిఫ్ట్లు ఇస్తూ వుంటాం . మనకి తెలిసిన వారు చాలా మంది వుంటారు ,కానీ ఆత్మీయులు , మనసుకి నచ్చిన వారు కొందరే వుంటారు . వారికి కూడా అందరికి ఇచ్చేలా కాకుండా మీరే స్వయంగా తయారు చేసి ఇచ్చి చూడండి , మీకు ఎంత తృప్తి గా , తీసుకున్న వారికి ఎంత ఆనందంగా వుంటుందో .

ఇప్పుడు అందరూ గ్రీటింగ్స్ తెలియచేప్పాలనుకుంటే e -మెయిల్ లేక సెల్ ఫోన్ లో మెసేజ్ పంపుకుంటున్నారు , దీని బదులు చక్కగా మీరే మీ మనసులో భావాలను కాగితం మీద పెట్టి ఇవ్వండి  ఎంత బావుంటుందో .
అంత ఓపిక కానీ తీరిక కానీ ఈ రోజుల్లో కష్టం అని తెలుసు . అందరికీ కాకపోయినా మీకు సొంతం అయిన వారికి , సొంతం కావాలనుకునే వారికీ(నిజంగా they can do magic in winning hearts)  , ఆత్మీయులకి ఇవ్వండి . తేడా మీకే తెలుస్తుంది .

ఇవే కాదు , మీ ఇంట్లోకి కుడా చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చేసి పెట్టండి . వాటికి వచ్చే అభినందనలతో మీకు వచ్చే సంతోషం ఎవరూ వెలకట్టలేరు .

ఎలా వస్తాయో , నవ్వుతారో ఏమో అనే భయాలు అస్సలు వద్దు ,
అవి ఎలా ఉన్నా అందులో , వారికోసం మీరు పడ్డ కష్టం , తపన , మీరు  స్పెండ్ చేసిన సమయం మాత్రమే  కనిపిస్తాయ్ ,మీ ఆత్మీయులకి .

నేను చేసిన కొన్నిటిని ఇక్కడ పెడ్తున్నాను …..