మనకు ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయ్. స్నేహితులు ,బంధువులు ,ఆత్మీయులు ఎంతో మంది వుంటారు . వారి కి శుభాకాంక్షలు తెలియచేయడానికి గ్రీటింగ్ కార్డ్లు ,గిఫ్ట్లు ఇస్తూ వుంటాం . మనకి తెలిసిన వారు చాలా మంది వుంటారు ,కానీ ఆత్మీయులు , మనసుకి నచ్చిన వారు కొందరే వుంటారు . వారికి కూడా అందరికి ఇచ్చేలా కాకుండా మీరే స్వయంగా తయారు చేసి ఇచ్చి చూడండి , మీకు ఎంత తృప్తి గా , తీసుకున్న వారికి ఎంత ఆనందంగా వుంటుందో .
ఇప్పుడు అందరూ గ్రీటింగ్స్ తెలియచేప్పాలనుకుంటే e -మెయిల్ లేక సెల్ ఫోన్ లో మెసేజ్ పంపుకుంటున్నారు , దీని బదులు చక్కగా మీరే మీ మనసులో భావాలను కాగితం మీద పెట్టి ఇవ్వండి ఎంత బావుంటుందో .
అంత ఓపిక కానీ తీరిక కానీ ఈ రోజుల్లో కష్టం అని తెలుసు . అందరికీ కాకపోయినా మీకు సొంతం అయిన వారికి , సొంతం కావాలనుకునే వారికీ(నిజంగా they can do magic in winning hearts) , ఆత్మీయులకి ఇవ్వండి . తేడా మీకే తెలుస్తుంది .
ఇవే కాదు , మీ ఇంట్లోకి కుడా చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చేసి పెట్టండి . వాటికి వచ్చే అభినందనలతో మీకు వచ్చే సంతోషం ఎవరూ వెలకట్టలేరు .
ఎలా వస్తాయో , నవ్వుతారో ఏమో అనే భయాలు అస్సలు వద్దు ,
అవి ఎలా ఉన్నా అందులో , వారికోసం మీరు పడ్డ కష్టం , తపన , మీరు స్పెండ్ చేసిన సమయం మాత్రమే కనిపిస్తాయ్ ,మీ ఆత్మీయులకి .
నేను చేసిన కొన్నిటిని ఇక్కడ పెడ్తున్నాను …..
Leave a Reply