Home Blog Page 3

నవ్వుల్ పువ్వుల్ – 5

When you are at a stage where you can relate every thing with your present situation 🤓😎

“స్వాతంత్ర్యం అర్ధరాత్రి ఎందుకిచ్చారంటావ్ ?”

“అప్పటికి పిల్ల పిశాచాలు అంతా పడుకునేసి ఉంటారు కదా, వటపత్ర శాయికి మల్లే! పెద్దలంతా తీరిగ్గా, ప్రశాంతంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీస్కుని ఉంటారు ఆ టైంలో, నా మాదిరిగా.”

“తల్లీ! మదర్ మేడ్ ఇన్ ఇండియా , నీకు సాష్టాంగ దండ ప్రణామాలు. చెట్టుమీది కాయకి సముద్రం లో ఉప్పుకి జత కలిపిన వారి వారసత్వం ఎక్కడికి పోతుంది!”

*********************************************************************************************

When you are fed up with the daily morning routine but at the same time addicted to it #pallichutney 😋😋😋

“మా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు !”
“మరి …ఓ సీమ పౌరుషమా ?”
“ఛస్ కాదు.”
“మరైతే ఏంటి .. కమాన్ టెల్ మీ ఐ సే ?”
“చనిక్కాయల చట్నీ !”
“ఆ ఆ ఆఁ !!!”
“య్యా .. యెస్ . ఇడ్లి అయినా దోస అయినా, ఉప్మా అయినా పొంగల్ అయినా, పూరీ అయినా పులిహోర అయినా, రొంత చనిగ్గింజల చట్నీ పడితేనే మన బండి పరిగెట్టేది. ఇక తాలింపు కూరల్లో, పులుసుల్లో అయితే పల్లీ పొడిని ఎరువులు జల్లినట్టు జల్లాల . otherwise its worthless you see !”

అద్గదీ !తొడ కొట్టరా చిన్నా ! 😎

***********************************************************************************************************

Wanna know the value and beauty of life, stay in a hostel for sometime! The days that taught me survival lessons 🙏🙌🏻🤗🤗

అమ్మా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అందరూ పండుగ చేసుకుంటారు. కానీ ఒక్కోసారి పండక్కి ఇంటికెళ్లే అవకాశం రాదు, ముఖ్యంగా ఇంటికి దూరంగా వేరే రాష్ట్రం లో హాస్టల్ లో ఉన్నవాళ్ళకి పండగ విలువ మా గొప్పగా తెలుసు.

హాస్టల్లో ఉన్నపుడు జైల్లో ఖైదీలకు కొట్టినట్లు మెస్సు బెల్లు కొట్టగానే , గ్లాసులు, ప్లేట్లు తీసుకుని మెస్సుకు వెళ్ళేవాళ్ళం. లైన్లో నిల్చుంటే ఊతప్పాలు, దద్దోజనం పెట్టేవాళ్ళు తంజావూరులో. భోజనం లేదా అంటే , ” సాపాడు మధ్యాహ్నం దానే, నైటుల టిఫినుదా ఇరుక్కుమ్,” అని తాబూలం నవ్వు నవ్వే వాడు, మెస్సు అంకుల్ .

ముప్పొద్దులా అన్నం తినే మాకు మహా కష్టంగా తోచేది. ఆలా మా సాంబారు కష్టాలు ఒక సంవత్సరం సాగాయి. ప్రతి రోజు సాంబారుతో చంపేసేవాడు. చివరికి కలలో కూడా సాంబారు సముద్రంలో ఒక్కదాన్నే ఈదుతున్నట్లు , మధ్యలో తైరు సాదం (పెరుగన్నం) దీవిలో ఒక్కదాన్నే చిక్కుకున్నట్లు, మా మెస్సు అంకులు నాపైకి ఊతప్పాలతో దాడి చేస్తున్నట్లు, నేను వాటిని ఇడ్లీ బాంబులతో ఎదుర్కొన్నట్లు పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. పండుగ పూట కూడా సాంబార్ సాదం, తైర్ సాదం పెట్టి స్పెషల్ ఎఫెక్ట్ కింద ఎదో కొళంబు అని పెట్టేవాళ్ళు. అదే మా పండుగ భోజనం.
చివరాఖరికి చెప్పొచ్చేదేంటంటే, అనివార్య కారణాల వల్ల హాస్టళ్లలో చిక్కడిపోయి ఇంటికి వెళ్లలేని సోదర సోదరీమణులకి “దసరా మరియు అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు .”

************************************************************************************************

 

You can learn lessons from anything, anywhere and at anytime. 🙏🙏😎

గురు శ్రీ: ఏమ్మా ! ఈ మధ్య ఇటువైపు రావడం లేదే !

శిష్య శ్రీ : అవసరం పడట్లేదు గురు గారూ .. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇంట్లోనే దొరికేస్తున్నాయి . ఇలాగే సాగితే ముందు ముందు నేనే ఒక time management కం stress management కం anger management కం meditation ఇలా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేస్తా .

గురు శ్రీ: ఇంతలో అంత మార్పు ఎలా సాధించావు తల్లీ?

శిష్య శ్రీ: మిమ్మల్ని ఏమడిగినా థియరీ పేపర్ లాగా తికమకగా చెప్తారు.

అదే నేను ఇంట్లో పనులు చేస్తుంటే ప్రాక్టీకల్స్ చేసేటప్పుడులా తేలిగ్గా అర్ధం అయిపోతున్నాయి గురూజీ !

ఉదాహరణకి, జీవితం అంటే ఏంటో చెప్పమంటే తిప్పిచ్చి మళ్ళిచ్చి మొదటికే తీసుకొస్తారు కదా !
ఇప్పుడు నాకు మొత్తం తేట తెల్లంగా అర్ధం అయిపొయింది.

గురు శ్రీ: అంత వివరంగా చెప్పినవారెవరు తల్లీ !

శిష్య శ్రీ: ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నప్పటికీ, నేను గుర్తించలేని నా ఆధ్యాత్మిక గురువు, శ్రీ మిక్సీ గారు .

అసలుకొస్తే anger management లో వారిని కొట్టేవారే లేరు. ఎంతోసి భల్లాల దేవ అయినా, రెండు సిట్టింగ్స్ వారితో వేస్తే దెబ్బకి బుద్ధుడు ఐపోవాల్సిందే.

గురు శ్రీ: ఏమని సెలవిచ్చారు వారు ?

శిష్య శ్రీ : జీవితం అంటే మిక్సీ కున్న మూడు జార్ల వంటిదీ అని ,
మనకి కావల్సినది ఎప్పుడూ , చిన్న జార్ కి ఎక్కువా, పెద్ద జార్ కు తక్కువా అని !
జీవించడం అంటే మనకి కావాల్సిన వాటికి సరిగ్గా సరిపొయ్యే జార్ ని ఎంచుకోవడమే అని !

గురూజీ! గురూజీ ! ఎక్కడా కనిపించరేమిటబ్బా !!!

**********************************************************************************************

Secret behind a fresh Monday morning 🤪😎💁‍♀️

Manager మేష్టారు :ఒరేయ్ వీకెండ్ ఎలా గడిపారో ఒక్క సొంత వాఖ్యం లో చెప్పండిరా !

Software పిలకాయలు : నేన్ ! నేన్ !నేన్ చెప్తానోచ్ !

Manager మేష్టారు : చెప్పవోయీ .. చూడబోతే భలే ఉత్సాహంగా కనపడుతోంది నీ వారాంత వ్యవహారము !!

పిల్ల software : మరేనండీ !

Manager మేష్టారు : చెప్పుమరీ ! చూస్తాను ఎంత చమత్కారంగా చెప్పగలవో !

Software పిల్లపిడుగు : ఈ నా వారాంతము “ ఇల్లే వైకుంఠము, కడుపే కైలాసము ”వలె గడిచినది . అదియే నా ఈ ఉత్సాహమునకు కారణమూ !

మేష్టారు : #%*#%@*%#$

******************************************************************************************************

And it’s a wrap..#happyhalloween2018

“టిక్ టిక్ టిక్ …. trick or treat !!”

“వస్తన్న వస్తన్నా ! ఎవర్రా అబ్బాయ్ నువ్వు .. ?”

“నేనేమో కొండ బూచోడు, వీడు అగ్గి బరాటా , వాడేమో ఒంటి కన్ను రాక్షసుడు, ఇడిగో వీడు భల్లూక రాజు, వాడు జటాజూట !”

“మరి మీరు ఎవలు అమ్మలూ ?”

“ఐ ఆమ్ జగన్మోహిని, తను జ్వాలాముఖి, తిను అపూర్వ చింతామణి !! అది త్రిజట ఇది కాపాలిక !”

“భేష్ భేష్ , భలే ఉన్నార్రా ! ఇదిగో వరసాకి వచ్చి candies తీసుకెళ్లండి ..ఒక్కొక్కళ్ళు రెండేసి తీస్కోండి ! మీరెళ్ళాక conjuring బ్యాచ్ వస్తోంది . మరి, హ్యాపీ హాలోవీన్ రా !!”

****************************************************************************

Get set go...#happyshopping!

“హల్లో ! సామానంతా మారుస్తున్నట్టున్నారు, ఏంటీ ఇల్లు షిఫ్ట్ అవుతున్నారా ? “

“లేదోయ్ . జస్ట్ సామాను మాత్రం స్టోర్ హౌస్ కి షిఫ్ట్ చేసేస్తున్నాము.”

“ఎందుకో ?”

“ఇహ thanksgiving వస్తోందిగా, online shopping మొదలు. దానికి తోడు ఊరినుంచి బావలు, బామ్మర్దుల విన్నపాలు వినవలె వింత వింతలు . ఈ నెల ఇహ అట్టపెట్టెలతోనే సంసారం నిండిపోతుంది. అందుకని కాస్త చోటు చేసుకుంటున్నాము అంతే ! “

***************************************************************************

What’s your count for this Deepavali 🤪🎉🎊🙌

“రేయ్ నీకు ఎన్నొచ్చాయ్ రా ?”

“మూడొందల ముప్పై ఆరు . మరి నీకో ?”

“ఆరొందల డెబ్భై నాలుగూ ! ”

“అర్రె ! నువ్వే గెలిచావ్ రా ..ఇదుగో థౌసండ్ వాలా , నీకే !”

“హెల్లొ ఏస్కూస్ మీ ! నాకు మూడువేల ఐదొందల పన్నెండు వచ్చాయి . చీప్ గా థౌసండ్ వాలా కాదు, పందెం ప్రకారం టెన్ థౌసండ్ వాలా పట్రండిరారేయ్ !”

“హౌ ? అదెలా రా ?”

“వాడిది పెద్ద జాయింట్ ఫ్యామిలి రా , 30 ఫామిలీ గ్రూప్స్ , ఏడాదికో ఊర్లో చదువు కాబట్టి 20 ఫ్రెండ్స్ గ్రూప్స్ , చిన్నా చితకా ఇంకో 50 గ్రూప్స్ వేసుకో !”

“ఛ .. పద మరి , టెన్ థౌసండ్ వాలా కొందాం !”

*“ఒరేయ్ పిలకాయలు, ఇంతకీ దేని గురించిరా మీరు మాట్లాడుకునేది . లాటరీ గానీ తగిలిందా ?”

“అబ్బే అదేంకాదు తాత , వాట్స్ అప్ లో కొత్తగా stickers పెట్టారు కదా, దీపావళికి ఎవరికి ఎక్కువ sticker విషెస్ వచ్చాయా అని పందెం!”

**********************************************************************************************

The great Indian Children’s day celebrations 🎉 😎😍🤗

“ఏంట్రా ఈ రోజు స్పెషల్సు !”

“అంతా మాములే ! నలుగురు టీచరమ్మలు, ఏడుగురు డాక్టర్లు , ఒక బెంగాలీ పెళ్లికూతురు ఒక్క అస్సామీ పెళ్ళికొడుకు , ఐదుగురేమో నర్సులు , ఇద్దరు మేరీమాతలు ఒక బుద్ధ భగవానుడూ, కడవ ఎత్తుకొచ్చిన శకుంతల, బాణమట్టుకొచ్చిన వేటగాడు !”

“చాల్లే ఎప్పుడూ వీళ్ళే వచ్చేది ఎలాగూ. మరి ప్రైజు ఎవరికొచ్చిందిరా ?”

“ఈ సారి స్పెషల్ ఎఫెక్ట్స్ మెర్మెయిడ్ కి ఇంకా నాగ కన్య కీ రా ! భలే ఉన్నారనుకో ! ”

“అబ్బో జలకన్యా, నాగ కన్యే .. రొటీన్ వేషాలే ఉంటాయని మిస్ అయిపోయానే ! ఛా ! ”
Happy Children’s day.. 😀

****************************************************************************************

It’s Friday night 😀 yay! #friyay

“నరుడా ఓ నరుడా ఏమి కోరికా ?”

“ఎస్కుస్ మీ .. ఎవరు సిస్టర్ మీరు ?”

“పాతాళ భైరవిని, పిలిచితివేల .. వచ్చితిని, ఏమి నీ కోరిక ?”

“సోమవారం నుండి శుక్రవారం దాకా దేకుతూ “పాండురంగ మహత్యం” లో ఎన్టీఆర్ లాగా, ‘ అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా ‘ అని పిలిచా, మొత్తుకున్నా…వచ్చావా? లేదే !! ఇప్పుడు శుక్రవారం రాత్రి వస్తే హౌ? ఎలా ! టెల్ మీ !! కమాన్ టెల్ మీ ఐ సే !!”

“సరే గాని, ఇప్పుడేమంటావ్ !!”

“శుక్రవారం రాత్రి కుబేరుడు వచ్చినా సోమవారం దాకా క్యూ లో ఉండాల్సిందే !! కమింగ్ బ్రో ! Bye-bye సిస్టర్ !”

******************************************************************************************

Done with my holidays 😒🙄

“ఉన్నావా, అసలున్నావా ? స్వామీ .. రా దిగిరా , దివి నుండి …..”

“బాలా , వచ్చితిన్ ! ఏలా ఊరికూరికే పిలిచెదవు !!”

“ఇదే ఈసారికి ఆఖరు అనుకో! ఆదివారం స్కిప్ చేసి సోమవారం వచ్చేట్టు చూడు తండ్రీ !
వరసగా 4 రోజులు సెలవులు. కథలు చెప్పి చెప్పి నోరు నొప్పి , ఆటలు ఆడించి ఆడించి తల నొప్పి , ఊ కొట్టి కొట్టీ చెవులు నొప్పి. బుర్రలో అంతా రైమ్స్ ఏ రిపీట్ మోడ్ లో ప్లే అవుతున్నాయి .
నేనెవరో , ఏంటో, జీవితం , పరమార్థం, మోక్షం, లాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్ ! ఇంకో రోజు అంటే నా వల్ల కాదు, తొరగా సోమవారం వస్తే వాళ్ళ టీచర్ కి అప్పగించి ఒక దణ్ణం పెట్టి వస్తా !’

“ఇదిస్తే అదంటావు ! అదిస్తే ఇంకోటంటావు … అందుకే సుబ్బరంగా నా గేమ్సు , నా రూల్సు అనేది . ఆప్షన్స్ లేవు ఇక వస్తా .. మరిక పిలవకు ! ”

*****************************************************************************************************

by
Srinidhi Yellala.

నవ్వుల్ పువ్వుల్ – 4

 

Learning to perfect the art of aging gracefully 😍😛🤪

నల్లటి మేఘాలతో ఆకాశం బరువెక్కింది ! అచ్చం బాధతో మూగగా రోదిస్తున్న నా మనసులాగా !

ఇప్పుడు అంత భారమైన బాధ ఏమొచ్చింది?

నా పిల్లకి మాటలొచ్చాయి !

అయితే ఇంకేం .. పంచదార చిలకలు పంచిపెట్టు ఎంచక్కా ! సమస్య ఏంటి దాంట్లో ?

అది కాదు సమస్య ..దానితో పాటు తన ఫ్రెండ్స్ కి కూడా మాటలు వచ్చేశాయ్ !

It’s natural ! సో ?

ప్లే డేట్ కి తీసుకెళ్తే అంతా కలిసి “ఆంటీ ” “ ఆంటీ ” అని ఒకటే రొద! ప్రపంచంలోని పిల్లలంతా కలిసి కాళకేయ సైన్యం లాగ “ఆంటీ, ఆంటీ” అని దండెత్తి వస్తున్నట్టు కలలు.

If so, then you have officially received the title of “auntie “👑.

*************************************************************************

Dedication levels 🙏🙏

హలో! ససస సా…ర్ ర్ ర్ ! What a pleasant surprise!
యా యా బాగున్నా సర్ .. మీరు బాగున్నారా? ఓ యస్ ! Definitely . మీరు అడగడం నేను కాదనడమూ నా! మీకెందుకు, నే కనుక్కుంటా! నే జూస్కుంటాగా ! bye సర్ !

ఎవరు? మీ స్కూల్ టీచర్ ఆ ?

కాదు !

విజయవాడ కోచ్ ఆ ?

కాదు

కాలేజీ లెక్చరర్ ఆ ?

కాదెహే !

మరి?

కాలేజ్ లో మా సీనియర్ !

ఏంటి ఇన్నేళ్ల తర్వాత కూడా సర్ అంటున్నావా ?

1st ఇయర్ లో ఈడు చేసిన ర్యాగింగ్ కి చచ్చేముందు వచ్చినా “ఎస్ సర్” అనే అంటానేమో ! గుడ్ morning కి తర్వాత “సార్” అని చెప్పలేదని B.N. రెడ్డి నగర్ నుండి శేరిగూడ బస్టాప్ వరకు ఎన్ని బస్టాపులు ఉన్నాయో వరసగా ..” In order I Say”, చెప్పించాడు. అదికూడా చెవులు పట్టుకుని !

ఓహ్ ! ఇప్పుడేం పనటా నీతో ?

మా క్లాస్ దివ్యకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసిందంట ! నెంబర్ కావాలని చేసాడు !

ఓహ్ ! నీ దగ్గర ఉంది కదా , కనుక్కోవడం ఎందుకు ? దివ్యని అడిగి పంపిస్తావా ?

ఆ … అడగ్గానే పంపిస్తారు పాపం ! ఎంతెంత హింస పెట్టాడూ ! dairy milk ఇస్తానని organic chemistry రికార్డు మొత్తం రాయించుకుని, dairy milk shots చేతిలో పెట్టాడు ! వీడికి దివ్య నెంబర్ ఎట్టా దొరుకుతుందో చూస్తా !నేనివ్వను, ఎవ్వరినీ ఇవ్వనివ్వను .

హౌ ? ఎలా ?

ఆ … వాట్స్ ఆప్ గ్రూపులు ఉన్నది ఇందుకు కాదేటి .. ఇల్లాంటి విషయాల్లో మా ఐకమత్యం చూసి ఐక్య రాజ్య సమితి కూడా అవాక్కయి పోవాలా …అ ..అ .. ఆ !!

*************************************************************************************************

To the efforts of photographers 🙏 on world photography day

ఇందుమూలంగా పుర ప్రజలకి చెప్పొచ్చేదేంటంటే … పిల్లి కూతలు కూయకుండా, సర్కస్ ఫీట్లు చెయ్యకుండా , రెడీ ష్టెడీ 1 — 2 — 3 అనేలోపు బులి రాణీ గారి చూపు కెమెరా వైపు పడేట్టు చేసి ఫుటో తీయగలినోడ్ని … అగ్గి బరాటా బిరుదుతో సన్మానించి, అర్ధరాజ్యాన్ని ఇస్తానని మారాజు గోరు చెప్పమనారహో ఓఓఓఓ …

***********************************************************************************************

The moment you realize the key force behind living 🤗🤩

గురు శ్రీ : తల్లీ ! ఏమిటి ఇలా వచ్చావు ? దేనికీ తీరిక లేదు అంటావు కదా ?

శిష్య శ్రీ : ఒక ధర్మ సందేహం వస్తే , ఎదో కాస్త తీరిక చేసుకు,చూసుకుని వచ్చా స్వామి !

గురు శ్రీ : అడుగు బిడ్డా !

శిష్య శ్రీ : జీవితం అనగా ఏమిటి స్వామి ?

గురు శ్రీ : చాలా లోతైన ప్రశ్న తల్లీ. ఒకసారి ఒక ఫలానా గొప్ప దేశపు ఫలానా మేధావి ఎం చెప్పాడంటే , “the relationship between జీవితం ….. ”

శిష్య శ్రీ : అబ్బబ్బా ఏం చెప్పినా , తేలిగ్గా తొందరగా చెప్పండి స్వామి… !

గురు శ్రీ : అయితే విను … జీవితం అంటే !

శిష్య శ్రీ : అంటే …

గురు శ్రీ : జీవితం అంటే …

శిష్య శ్రీ : అంటే ఏ ఏ ఏ ఏ ….

గురు శ్రీ : జీవితం అంటే టిఫిన్, లంచ్ మరియు డిన్నర్ తల్లి.

అంటే, మూడు పూటలా ఇంత భోజనం చేసుకోవడం, లేదా చేయించుకోవడం లేదా సంపాదించుకోవడం.

మిగతా క్రియలన్నీ ఈ మూడింటికి సంబంధించి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్లు బిడ్డా .

శిష్య శ్రీ : ఆహా సూక్ష్మంలో మోక్షం చూపారు 🙏.

*********************************************************************************************

Happy Labor day! 

* “అసలు హాలిడే అంటే ఎల్లా ఉండాలీ …. ఈ రోజు వంట నాది ఓకే నా ! యూ జస్ట్ రిలాక్స్ యా !”
# “డబల్ వాకే ! థాంక్స్ ! యే యే యే !”

* “జస్ట్ కొంచం ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటోస్, చిల్లీస్, పుదీనా రెడీ చేసేయ్ , పిచ్చెక్కిస్తా ఇక !”
# “hmm సర్లే … ఓ…… కే !”

* “బిర్యానీ రెడీ ! క్లీనింగ్ నీదే మరి !”
# “ఓ ఓ …. కే ……. !”

పబ్లిక్ టాక్ : బిర్యానీ చేస్తే మనోడే చేయాలోయ్ .. అబ్బోఓ బ్రేహ్మాండం . నువ్ చాలా లక్కీ .

☺️
🤔🤭😦🙄

ప్రపంచంలోని ఎన్నో పనులు సజావుగా సాగడానికి రాళ్ళెత్తిన సోదర సోదరీమణులకి … లాల్ సలాం కామ్రేడ్స్ 🙌🏻

************************************************************************************************

When it is your sister’s birthday, you remember all sort of funny things!😀😀😎
“తాతా ఏమన్నా చెప్పు కదా !”

“కథ చెప్పనా ?”

“వద్దు .. ఎప్పుడూ ‘పుటుక్కు జరజర డుబుక్కు మే’ కథే చెప్తావ్ . వేరే ఏదన్నా చెప్పు.”

“నీకో మాట చెపుతా .. గుర్తు పెట్టుకో అమ్మణ్ణి !”

“ఊఉ .. చెప్పు మరీ.”

“నువ్వేమో … ‘గ జ డ ద బ’ … బడా బడా మాట్లాడుతూనే ఉంటావ్ కదా, అందుకు !
పెద్ద అమ్మణ్ణి ఏమో … ‘క చ ట త ప’… కోపం జాస్తి అందుకు ! హ హా హా !”

“ఏంటో ఏదీ సులువుగా చెప్పవు కదా !పో !”

అప్పుడు అర్ధం కాలేదు మా తాతయ్య చమత్కారం . సో …

డియర్ క చ ట త ప,

Happy Birthday

ఇట్లు,
గ జ డ ద బ .

*************************************************************************************

Probability factor with your kid is always “1”🤪🤪🤪

మీ బుడ్డదానికి తినిపిద్దామని కింద కూర్చోపెట్టి, గిన్నిలో అన్నమేసి, పప్పేసి, చారోసి, నెయ్యేసి సిద్ధం చేసుకున్నారు అనుకోండి.

మాటి మాటికీ లేవకుండా ఉండేట్టు చిన్నిగ్లాసుడు నీళ్ళోసి కూడా తెచ్చిపెట్టుకున్నారనుకోండి! ఇక్కడే జాగ్రత్తగా వినాలి మరి,

a ) బుడ్డది సుమారు ఒక సంవత్సర కాలంలో, గ్లాసుడు నీళ్లు ఎన్ని సార్లు కింద పడేయవచ్చు ?
b ) బుడ్డ దానికి ఏఏ దిశలో పెడితే గ్లాసు పడెయ్యకుండా ఉండును ?

నాన్న : probability = number of favorable outcomes / total number of possible outcomes
అంటే , ఒక 365 రోజుల్లో హాలిడేసు, ఔటింగులు, ట్రిప్పులు!
ఒక 279 ని 365 తో , లేక 298 ని 365 తో… హ్మ్ ! ఒక్క 2 నిముషాలు టైం ఇస్తే చెప్పేస్తానోయ్ !

అమ్మ : a ) 100 కి 100% తన్నేస్తుంది.
8 దిక్కుల్లో ఏ దిశలో పెట్టినా మిస్ అయ్యే అవకాశం లేదు. మిమ్మల్ని నూటొక్క సాకులతో కుర్చోనియ్యదు, నిలబడ నియ్యదు .

**************************************************************************************************

by
Srinidhi Yellala.

 

నవ్వుల్ పువ్వుల్ – 3

How to utilize negative energy

🙎‍♀️అప్పట్లో ఒకడుండేవాడు ! మొన్నీ మధ్య FB లో మళ్ళీ కనిపించాడు !

👩‍🎤అంటే topless గా బైక్ మీద తిరుగుతున్న రౌడీ విజయ్ దేవరకొండ లాగానా ?

🙎‍♀️కాదు .. 4th క్లాస్ లో వేళ్ళాడుతున్న నిక్కరుని గట్టిగ పట్టుకుని , టీచర్ ప్లీజ్ అర్జెంటు .. అంటూ “దైన్యం” అనే పదానికి pictorial ఇమేజ్ లా నిలబడ్డ వాడిలా !

👩‍🎤ఓహో ! స్కూల్ డేస్ ఆ ! ఇంతకీ ఏం జేశాడు ?

🙎‍♀️నా మనోభావాలు దెబ్బ తీసాడు , నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని అణచేసాడు ?

👩‍🎤హౌ ? ఎలా?

🙎‍♀️8థ్ క్లాస్ లో నీ favourite సబ్జెక్టు ఏంటి అని అడిగితే , “తెలుగు” అని చెప్పా, “ఎందుకు ? “ అని టీచర్ అడిగింది .

ఎందుకని తెలుగంటే ఇష్టమో నేను అందంగా చెప్పేలోపే ,

“ఎందుకంటే బాగా భట్టీ పెట్టొచ్చని ” అని వెనక నుండి అరిచి క్లాసంతా ఘొల్లుమని నవ్వేలా చేసాడు . అలా దారుణంగా నా మనో భావాలను దెబ్బ తీసాడు .

👩‍🎤ఇంకా ?

🙎‍♀️10th క్లాస్ లో టీచర్ అప్పజెప్పమంది కదా అని, నా కిష్టమైన పద్యమని ఆనందంగా

“అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌.. ” అని

దూకే జలపాతము లాగా, పరవశించి చెప్తోంటే …

“ బా బా భట్టీ క్వీన్ “ అని పిల్లి కూతలు కూసి గేలి చేసి నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాల రాచాడు .

👩‍🎤ఇంకా ?

🙎‍♀️అరువు తెచ్చుకున్న బాలమిత్ర పుస్తకం చదివి inspire అయ్యి , స్కూల్ lawn లో ఉన్న గడ్డిపువ్వుని చూస్తూ ….

“ పచ్చల దీవిలో , ముత్యపు చినుకు “ అని ఎదో వర్ణన మనసులో అనుకుంటోంటే , చట్టుక్కున వచ్చి ,

“ A B C D ఎప్ఫు .. మీ తాత తలకాయ టప్పు ” అని పుట్టుకున్న ఆ గడ్డిపువ్వుని తెంపి నా మనో భావాలను దెబ్బ తీసాడు .

👩‍🎤ఇప్పుడేం చేస్తున్నాడు ?

🙎‍♀️నన్ను భట్టీ queen అన్నవాడు, ఆ పై విజయవాడలో మూడేళ్లు ముక్కు మూసుకుని భట్టీయం వేసి జీవితం లో సెటిల్ అయినాడు .
ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకి FB లో కనపడి , ఆరిన మంటలు రాజేసాడు …

👩‍🎤ఇప్పుడు ఎం చేద్దామనీ ?

🙎‍♀️debate లో కూర్చోపెట్టి నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని తొక్కేసి , మనోభావాలని దెబ్బ తీసినందుకు చర్చిద్దాము అని 4 స్టూడియోలకి కాల్ చేసా .. అందరూ బిజీ అంట .

👩‍🎤చివరికి ఎం జేసావ్?

🙎‍♀️ఏం జేస్తాం .. కాస్త చింతపండు, పీతాంబరి తీస్కుని వాడి మొహం లా మట్టి గొట్టుకు పోయిన రాగి కూజా తీస్కుని , నా కోపం పోయే దాకా తోమి తోమి ఇలా చేశా !

*********************************************************************

When you are obsessed with your saucepan 🙍‍♀️

🙂 అమ్మాయ్ ,అన్నీ సిద్ధంగా ఉంచుకున్నావా ? నేను టైం అంటే టైమే . ఆనక తిరిగి మళ్ళీ నన్ను శాడిస్టు , సైకో అంటే ఒప్పుకోను చెప్తున్నా !

🙋‍♀️ అబ్బా సరేలే , ప్రతి సారీ అలాగే చేస్తానా ఏంటి ! ఈసారి చూస్కో నా ప్రతాపం .

😏 ఏమో , మీ జాతిని ఎవరు నమ్మొచారు . ఓడ దాటే దాకా ఓడ మల్లన్నా , ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నా అనే రకం . ఎన్ని యుగాల నుండి చూడట్లేదూ .
సర్లే కానీ , నేను రెడీ మరి .. నువ్వు?

💁‍♀️ వో ఎస్ … ఎప్పుడో రెడీ ! dont be silly ya .

😌 ఆవాలు వేస్కో ..

💁‍♀️ వేసేసా

😌 జీలకర్ర వేస్కో

💁‍♀️ వేసేసా … సో ఈజీ ఐ సే .

🙄 సర్లే చానా జూసాం కానీ … పోపు గింజలు, వెల్లుల్లి ,ఎండు మిరపకాయలూ ?

🙋‍♀️ వేసేసా … ఏమనుకున్నావ్ మరి నేనంటే !

🤨 మరి కరేపాకో ???

🤦‍♀️ ఓఓఓ … షి ష్ ష్… అఅఅఅఅ … ఒక్క నిమిషం …ఒకే ఒక్క నిమిషం .. ప్లీజ్ !!ప్లీజ్ ..ప్లీజ్ !

🤓 మరదే నే ముందే చెప్పా … మాటంటే మాటే ..టైమంటే టైమే అని ! నా వల్ల కాదు అమ్మడు … ఆగలేను … వేగిపోతున్నా ఇక్కడ .

🙍‍♀️ ప్లీజ్ ప్లీజ్ .. ఇదుగో ఫ్రిడ్జ్ డోర్ తెరిచా ,వెతుకు తున్నా … ఏడ చచ్చిందో ఇది ఈ మహారణ్యం లో ! కనపడదే !

🤪 ఇహ ఆగడం నా వాళ్ళ కాదు అమ్మడోయ్ !

🙍‍♀️ ప్లీజ్ నా బుజ్జివి కదూ , ఒక్క అర నిమిషం … నీకు బంగారు చెవులు చేపిస్తా .. నీ పీఠానికి వెండి తొడుగు చేపిస్తా . . జీవితాంతం కలిసి మెలిసి కాపురం చెయ్య వలసిన వాళ్ళం .. ఇదిగో వచ్చేస్తున్నా !
ఆ దొరికింది … కొత్తిమీరకీ బెండకాయలకి మధ్యలో నక్కింది .. రా బయటికి రా !
ఇదిగో కరివేపాఆఆఆఆఆ …

😔 అయిపొయింది అమ్మడూ , అంతా అయిపోయింది … మాడి మసైపోయింది నీ పోపు.

🙆‍♀️ ఛీ పో ఎప్పుడూ ఇంతే నువ్వు , ఇంత దుర్మార్గం నే నెక్కడా చూడలేదు .. మరీ ఇంత కాఠిన్యం పనికిరాదు ..నిన్ను తప్ప వేరొకరిని ఇష్టపడను అనేగా నేనంటే అలుసు .. పో ..నీ ముఖం చూపించకు నాకు.. పొయ్యి ఆ సింకు లో పడీ ఏడువు !

అందుకే దేనిపై ఎక్కువ మమకారం పెంచుకో రాదు .

**************************************************************************************

“భావుకత” now a days be like.

ఆమె: “అన్నాను ఈ పొద్దు రావొద్దు నువ్వని … రావొద్దనీ !
సూరీడుతో మాట అన్నాను !!”

అతడు : మరే .. మంచి పని చేసావ్ .. new code release ఉంది , offshore కాల్స్ కూడా తీస్కోవాలి .. చాలా పనుంది .. థాంక్స్ యా !

ఆమె : “అన్నాను మా ఫోన్ లోని తొలికోడితో , నేను తొలికోడితో …
కూతెట్టి చంపొద్దు అన్నాను !!”

అతడు : మరి ..అంతగాక . పొద్దున్నే వెధవ డిస్టర్బెన్స్యూ ….క్విక్ గా ఒక జత ఇస్త్రీ , స్నానం , స్టేషనూ , 8.10 కి ట్రైనూ … ఓ 7.45 కలా లేపు చాలు !

ఆమె: ఇదిగో నీ పనంతా అయిపోయాక .. if at all … in case .. నే గుర్తొస్తే ఆదిలాబాద్ అడవులకి వచ్చెయ్ .. తపస్సు చేస్కుంటూ వుంటాను .

అతడు: ఓకే డన్ ! You carry on! నాకోసం వెయిట్ చెయ్యకు .. have fun యా !

ఆమె: %#@@%#$%@$%#@%&$#%@&$#%

P.S: those “lyrics” are from “mallepandiri” Telugu movie song!

by
Srinidhi Yellala.

నవ్వుల్ పువ్వుల్ – 2

You are what you are when you are alone

👨‍💼బియాన్స్ వింటావా?
👩‍💼యా! షూర్ ! ఐ లవ్ హర్ మ్యూసిక్ ! మీ ఫేవొరేట్ ఏంటి?
👨‍💼యూ know ! వెల్ ! నికీ మినాజ్ బ్లా బ్లా బ్లా ….. టేలర్ స్విఫ్ట్ బ్లా బ్లా బ్లా …. షీరన్ బ్లా బ్లా బ్లా… య్యా ..యూ సీ 😎!
👩‍💼amazing యా ! యూ ఆర్ సో కూల్ !
👨‍💼can‘t help యూ సీ ! 😬
👩‍💼see you ! thanks for the రైడ్ !
**********
👨‍💼21 మైల్స్ ! 880సౌత్ ఎక్కించి గురూ గారి పాటలు పెడితే .. జామ్ జామ్ అని లాగించేయొచ్చు !

జుంబారే జుంజుంబరే! జుంబరాహి జుంబరాహి జుంబారే !
😎😎😎😎😎😎😎😎😎

************************************************************************************

The time you get to know that your kid is growing up

👨‍💼నా ఐడి కార్డు ఎక్కడపెట్టేసావ్, ఏదీ బయటలేకుండా సర్దేస్తుంటావ్ అన్నీ !
🙍నాకు తెలీదు, పాప ఎక్కడో పెట్టేసి ఉంటుంది, చూసి ఇస్తా ఉండు.
👨‍💼టీవీ రిమోట్ కనపడట్లేదు . అన్నీ ఎక్కడో ….
🙍పాప ఎక్కడో పెట్టేసి ఉంటుంది. ఉండు.. చూసిస్తా .
👨‍💼క్రెడిట్ కార్డు ఇక్కడ పెట్టాను , ఏదీ… 
🙍పాప ఎక్కడో ….
👨‍💼నిన్న పోస్ట్ లో pamphlets తో పాటు important మెయిల్ వచ్చింది , ఇక్కడ పెట్టా ఏదీ ..
🙍ఏమో పాప ఆడివుంటుంది .

పాప:😼😼😼😼

🙆వామ్మో! పాకే వయసు నుండి పరిగెట్టే వయసుకి వచ్చింది, అన్నీ అర్ధం అవుతున్నట్లు ఉంది.

కోర్ట్ సీన్ లో బోనులో ఉన్న ముద్దాయిని, జడ్జి జగ్గయ్య చూస్తున్నట్టు చూస్తోంది! నా మతి మరుపుకి కొత్త సాకు వెతుక్కోవాలి !

*********************************************************************************

How phone signals in your hometown “ సొంతూరు” help us to remember our ROOTS.

🙋‍♀️హెల్లో …. అమ్మా ! ఆఆ … బాగున్నావా ? నాన్న బాగున్నారా ?
beep … beep ….
ఒకటో సారి : మీరు కాల్ చేస్తున్న subscriber అందుబాటులో లేరు కాసేపాగి ప్రయత్నిచండి…!!
రెండో సారి : మీరు కాల్ చేస్తున్…..
.
.
నూటతొంబై రెండో సారి : మీరు కాల్ చేస్తున్…..

🙎‍♀️హెల్లొ … మా … బాండావా ? నాయ్న …. హె … ల్లో ..ఓఓఓ !
beep ….beep … మీరు కాల్ చేస్ …..
🙎‍♀️ఛి జీవితం “ ఉప్పు కప్పురంబు .. పద్యం కూడా ఇన్ని సార్లు వినలా స్కూల్లో “

🙎‍♀️హే …. !
beep …beep ….
మీరు కాల్ …
🤦‍♀️జానకీ … కత్తి అందుకో జానకి .. నాయాల్ది ఈరోజు ఇదో నేనో తేలిపోవాలి అంతే … !

🙅‍♀️అల్లో .. మోవ్ ! నాయన్ని మిద్ది మీదికి పొమ్మను మా … ఎందిమా ఈ సిగ్నల్సు … మా … మా ”
బీప్…
మీ …
🙅‍♀️నొక్కు ..నొక్కెయ్ మళ్ళి వచ్చింది భగవద్గీత చెప్పడానికి !

🙍‍♀️ల్లో …
🧔చెప్పు అమ్మలూ .. మిద్ది పైకి వచ్చి, పొగగూటిపైన నిల్చుండా .. ఇప్పుడు చెప్పు .
🙋‍♀️అబ్బా .. బ్రతికించావు నాన్న , మీ అల్లుడు గారూ … పొద్దున బసుకి ….
beep beep …
మీరు కాల్ చేస్తున్న subscriber స్పందించుట లేదు….
🤦‍♀️🤐🤐🤐🤐

🙍‍♀️అ…ల్లో …
🧔అమ్మలూ ..
🙍‍♀️యో … పొద్దున్న బస్సుకి మా రెడ్డి దిగుతాండాడు గానీ పోయి తెచ్చుకో పో….ఉంటా .
హమయ్య
BGM : జీవితమంటే పోరాటం , పోరాటం లో ఉంది జయం. ఎక్కు తొలి….

******************************************************************************************

Pre preparations for some of the curries be like:

🌞ఆ విధంబున మత్స్యావతారం ధరించి భగవానుడు మానవ జాతిని రక్షించెను.

🙎‍♀️ఆ పడతి చిక్కుడుకాయలు వొలుచుచుండెను .

🌞కూర్మ, వరాహ, నరసింహ, వామనావతారములు ఎత్తిన దేవదేవుడు మానవ జాతిని ఉద్దరించెను.

🙎‍♀️ఏకాగ్రచిత్తముతో ఆ మగువ చిక్కుడుకాయలు వొలుచుచుండెను .

🌞లోక కళ్యాణార్థమై పరశురామ,రామ, కృష్ణ, బలరామావతారములు గూడ పూర్తి అయినవి .

🙍‍♀️ఆ ఇంతి చిక్కుడుకాయలు వలుచుచుండెను .

****
🌞తల్లి ! ఇంకొక్క కల్కి అవతారమే మిగిలినదమ్మా .. నీ పని అయినదా !

🙍‍♀️లాభం లేదు స్వామి, కాస్త ఓపిక తెచ్చుకుని పదకొండో అవతారం కూడా పూర్తిచేశారంటే ఎలాగో అలా కానిచేస్తాను.

****************************************************************************

How marriages are made in heaven!💁‍♀️🤷‍♀️
👩అమ్మాయి: రాగ సుధా రసా …. పానము జేసి … gradening చేయవే ఓ మనసా … రాగ సుధా రసా .

👨అబ్బాయ్ : చిటికె మీద చిటికె వేసెరా .. youtube చూస్తూ … బాత్రూం లోనా …తమ్ముడూ ..ఎయ్ ….చిటికె మీదా చిటికె .. అరె

👩అమ్మాయి : నిండు వెన్నెలా , పండు జాబిలి .. వెన్నెల మరకల్లో, కొబ్బరి ఆకుల నీడల్లో కువకువలాడుకుందామా !

👱‍♂️అబ్బాయ్ : వెధవ దోమలు .. nonsense … హ్యాపీగా పొటాటో చిప్స్ తింటూ మ్యాచ్ చూస్తూ (ఎవరు ఎవరి జట్టో తెలీకపోయినా ) లెట్స్ బీ couch పొటాటోస్ .

🌞బ్రహ్మ : సెగట్రీ వీళ్లిద్దరికీ ముడేట్టేయ్ !

సెగట్రీ : గురు గారూ …వై? హౌ ? ఎలా?

🌞బ్రహ్మ : జీవితం లో బ్యాలెన్సింగ్ ఉండాలోయ్ … తాంబూలాలు ఇవ్వడమే మన వంతు … ఇహ next ఏంజెయ్యాలో వాళ్లే చూసుకుంటారు .

Gods must be crazy 😜 I say!

by
Srinidhi Yellala.

నవ్వుల్ పువ్వుల్ -1

Dedicated to all my hostel friends…

అనగనగా విజయవాడ …. ఇంటర్లో ఉండగా ఒక రోజు రాత్రి
సమయం 7:55 నిముషాలు.
study hours లో చదువుతున్నట్టు జీవిస్తున్న అమ్మాయిలు, మెల్లగా పుస్తకాలు సర్దేసి, బ్యాగుల్లోంచి నెమ్మదిగా శబ్దం చెయ్యకుండా ఏవో బయటికి తీస్తున్నారు.
As usual , dates కి days కి synchronization తప్పిన నేను , చుట్టూ జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధ సన్నాహాలకి, పుస్తకం లోంచి తల తీసి చూసా!
కూర్చున్న కుర్చీల్లోంచే “కొక్కో” లో “కో ” అనగానే పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు , ఒక కాలు బయటికి పెట్టి కూర్చుని ఉన్నారు, మేరె క్లాస్ కి ఫోజియో ….
మొహంపై పై చేరిన నవ్వు క్షణం లో అనుమానంగా,భయంగా,కంగారు మారగా.. పక్కనే ఉన్న కిన్నుని చూసా ..
స్టీల్ ప్లేట్ విత్ గ్లాస్ చేత్తో పట్టుకుని , మరో ఐదు నిమిషాల్లో మోగబోయే బెల్ కోసం చెవులు రిక్కించి , “yes … its saturday … సాంబార్ with POTATO చిప్స్ ” అంది .
“షిట్ షిట్ షిట్” మళ్ళీ ప్లేట్ మర్చిపోయా.
“మూడో ఫ్లోర్ లో రూమ్,….
బెల్ కొట్టగానే మెస్ వైపు పరిగెట్టే 10 section ల సైన్యం….
వాళ్ళకి ఎదురెళ్లే ఒంటరి నేను…. ” లాభం లేదు వెళ్లి రావడానికే 20 నిముషాలు.
“Time is inversely proportional to the number of chips in your plate ”
వృథా ప్రయాస కాబట్టి కిన్నుతో బేరం కుదుర్చుకున్నా …
“బోటనీ రికార్డు లో 3 బొమ్మలు … మెస్ లో నీ పక్కన సీట్ ఆపితే!”
కళ్ళద్దాలను మెల్లిగా తీసి చున్నీతో తుడుస్తూ ..”zoology record లో కూడా 3 బొమ్మలు గీస్తేనే” అంది.
“3 botany + 2 zoology” బేరంలోకి దిగుతూ మెట్లు ఎక్కి రూమ్ లోకి పరిగెత్తడానికి సిద్దపడుతూ నేను.
“ఓకే… డీల్”
” డీల్”
“ట్రింగ్ గ్ గ్ గ్ గ్ ….”
ఉరుకు బిడ్డా ఉర్కు … జై భవానీ !!!!!!!!!!!!!!
కట్ చేస్తే …
దిగ్గున నిద్రలోంచి లేచి కూర్చున్నా .. చైరు ,study plank లేవు… నా ఇల్లే, నా మంచమే, పక్కనే బుసలు కొడ్తున్న పిల్ల పాము, తండ్రి పాము.. హమ్మయ్య కలా? కలే!
sambar with potato chips తిన్నప్పుడల్లా వచ్చే కల !
బాటిల్డు నీళ్లు తాగి “రామం స్కందం ” చదువుకుని పడుకున్నా మళ్ళి .

******************************************************************************************

Substitution classes in school days

5th క్లాస్ substitution క్లాస్
సార్ : రేయ్ మన క్లాస్ గాన గంభీర, ఒక పాట పాడరా !
సో కాల్డ్ Jr .DSP ఆఫ్ క్లాస్ : “కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

6th క్లాస్ substitution క్లాస్ :
సార్ : ఒక పాట పాడరా !
Jr.DSP : కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

7th క్లాస్ substitution క్లాస్ :
సార్ : ఇహ కానీయరా !
Jr.DSP : కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

8th క్లాస్ :
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

9th క్లాస్ :
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

ఫేర్ వెల్ పార్టీ :
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. వూ ..వూ ..ఊ .. మామోయ్మ్ !”

సార్ : 👏🏻🤗😒🙏🙏🙏🙏🙏

అంటే….. మరి….అప్పట్లో ఆ డెడికేషనూ , ప్రేమా , ఇష్టాలూ అలా ఉండేవి మరి 😁😁🤗😆

**********************************************************************************************************

My Modern Ammamma

👧 అమ్మమ్మామ్మామ్మాఆఆఆ ..!

👵🏻 ఎందుకంతలా అరుస్తావు !

👧 నా ఐప్యాడ్ నాకు ఇచెయ్యవే !

👵🏻 నో … వీల్లేదు … భలేగా వుంది! విసిగించకు .. కాసేపాగు … వెళ్లి చదువుకో.

👧 నాకు సెలవులు అమ్మమ్మా .
👵🏻 అయినా సరే ఇవ్వను.

👧 అత్తారింటికి దారేది సీరియల్ కి టైం అయ్యిందే .

👵🏻 నేను వైకుంఠానికి వెళ్లే దారి వెతుక్కునే పాటికి కూడా దానికి అత్తారింటి దారి తెలీదులే గానీ … బయల్దేరు … మంచి రసపట్టు లో ఉంది.
ఈ యూట్యూబ్ లో ఎంత బాగున్నాయో … అనవసరంగా సంవత్సరాల తరబడి సీరియళ్ళకి సమయం వృధా చేశాను.

******************************************************************************

Romance after marriage be like

వాట్స్ ఆప్ ఉచిత సలహా : మీ పార్టనర్ కి రోజుకి ఒక్కసారైనా కాల్ చేసి i love you చెప్పండి …. ఇలా కనుక ఒక వారం చేస్తే అద్భుతాలు చూస్తారు .

 👩: చేద్దాం…
ఆ చూద్దాం ….
పోనిలే పాపం మంచోడు…. 
సర్లే ట్రై చేద్దాం …..

ట్రింగ్ ట్రింగ్

👱in ఆఫీస్ : చెప్పు ( దీక్షగా ఇనప్పెట్టె తాళం తీస్తున్న గజదొంగ, తనని డిస్టర్బ్ చేసిన అసిస్టెంట్ తో మాట్లాడే టోన్ లో )

👩: ఇంట్లో టొమోటోలు అయిపోయాయ్, గెట్ దెమ్ , bye .

by
Srinidhi Yellala.

సరదా కబుర్లు

 

జ్ఞానోదయం 

65వ కళ …. చుట్టూతా ఒలకపొయ్యకుండా, వంటింటి గట్టు పై “modern art” వెయ్యకుండా, సర్కస్ ఫీట్లు ఏమీ చెయ్యకుండా

“టీ “ని అన్ని కప్పుల్లోకీ “సమంగా” ( I mean it I say, “EQUALLY”)🤓🤓 వడపోయుట అయితే,

కనపడని 66 కళే , నాలుక కాల్చుకోకుండా వేడి వేడి ఆ “టీ ,”

త్రాగుట 😎😎😎

***********************************************************************************************

 

On every valentines day

తను …. “హాయ్!”
నేను….. “హాయ్! ”
అంతరాత్మ 2: “ఏం చెప్పకు నువ్వు ! ముందు ఆడ్నే చెప్పనీ !”
తను : “కేక్ కట్ చేద్దామా !!”

అంతరాత్మ 2: “ ఋతురాగాలు నుండి ఇదే ఐడియా .. ఋతుగీతం కూడా స్టార్ట్ ఐంది … చానా జూసినం ఎల్లెళ్లమను ..”

నేను: “వద్దులే … డైటింగ్ స్టార్ట్ చేసాం కదా ”

తను : “ డిన్నర్ కి బయటికి వెళ్దామా ?”

అంతరాత్మ 2: “ అస్సలు ఒద్దు .. నువ్వెంత రొమాంటిక్ ప్లేస్ సెలెక్ట్ చేసినా .. చివరికి దేశీ రెస్టారంట్ లోకెళ్ళి .. అన్నా రెండు దమ్ బిర్యానీ .. బిల్ … అంటాడు .. నీ …. “”

నేను: “వద్దులే టైర్డ్ అయిపోయాం కదా.. పిజ్జా ఆర్డర్ చేసేద్దాం ”

తను : “ మూవీ కెల్దామ? “”

అంతరాత్మ2: “నిన్ననే కొత్త ఆక్షన్ సినిమా 4థ్ సిరీస్ ట్రైలర్ చూస్తుండు .. నీ బతుకు zandu balmఏ అక్కో !”

నేను : “ It’s ok baby!”
తను : “ మరి సెలెబ్రేషన్స్ వద్దా !”

అంతరాత్మ 2: “ వీక్ డే లో వస్తే తద్దినం కూడా పోస్టుపోన్ చేస్తా… ఈ దినం ఓ లెక్కా !”

నేను: “ u must be tired too kada ra!”

తాను: “మరైతే నేను మ్యాచ్ చూస్కోనా ?”

అంతరాత్మ 2: “దొరికిండు బిడ్డ .. ముఖం చూడు ఎట్లా వెలిగిపోతుందో ! మల్లి పెద్ద త్యాగరాజ్ లాగా పోసు !”

నేను: “ఓకే బేబీ ! “

తను : “మరీ … 😬😬😬 “”

అంతరాత్మ 2: “ వద్దు వద్దూ … ఆడి జాదూ నవ్వు చూడకు … నిన్నే చూడొద్దన్నానా?“

నేను: “wish you the same ra! Don’t disturb for a while I need some rest!”

అంతరాత్మ 2: “ య్యెయ్ య్యెయ్ .. ”friends” episode 10006th టైం చూడొచ్చు ”

ఏది ఇది .. అప్పుడే రూమ్ లోకి పోయిందా !
రూమ్ లో : అంతరాత్మ 1 తో కలిసి “ వాలు కనుల దాన” పాట వింటూ రాత్రి surprise gift కోసం .. ఫస్ట్ పిక్, ఫస్ట్ డేట్, ఫస్ట్ చాక్లెట్ , ఫస్ట్ కాఫీ అని scrapbook DIY చేస్తున్న నేను ! #happyvalentinesday

*****************************************************************

                                                                                  మండే మార్నింగ్ యిక్కడ

 

చట్నీ కి కావలసిన వన్నీ మిక్సీ గిన్నెలో పెట్టేసా! 1 స్పీడ్ లో తిప్పనా లేక మూడు లో కొట్టేయనా ?

అంతరాత్మ 1: “ఒద్దు జానకి వద్దు ! పాత పాఠం మరచిపోయావా? చిల్లిన్దనుకో గోడంతా నాశనం! పొద్దున్నే మూడ్ నాశనం ! దాంతో రోజంతా నాశనం !

అంతరాత్మ 2: కొట్టేయ్ జానకి ! దీంతల్లి 3 లో పెట్టి కొడితే.. నాయాల్ది .. పల్లి పచ్చడి క్షణంలో పచ్చడి పచ్చడి ఐపోవాలా ! కొట్టేయ్ 3 లో !

అంతరాత్మ 1: వద్దు జానకి … వద్దు!ముందు పల్స్ కొట్టు , మెల్లగా స్పీడ్ పెంచు,

అంతరాత్మ 2: చల్ తీ … ఆడెవడు .. ఈడెవడు ! నీకిపుడు అడ్డేవడు ! కోట్టేయ్ 3 లో !

నేను: టాక్ టాక్ 3… బుర్ర్ర్ర్ర్ర్ర్ర్ ! పచక్ ! గోడమీద.. కడిగిన గిన్నెలు మీద పచ్చడి కల్లాపి !

అంతరాత్మ 1: జంప్

అంతరాత్మ 2: అంతకు ముందే జంప్

“అంత బ్రాంతి ఏ నా ! జీవితానా టిఫిన్ ఇంతేనా ! దోస చట్నీ నిరాశేనా ! చివరికి మిగిలింది బ్రెడ్డు జామే నా !!!!”

త్వరగా తగలడు ..మండే మార్నింగ్ యిక్కడ !!!

**************************************************************

Common కోర్స్

కొత్త common కోర్స్ లో మొదటి రోజు. నానా జాతి సమ్మేళనం లాగా ఉన్న క్లాసు. లెక్చరర్ పరిచయాల్లో బయటపడ్డ మన మొహాలు .
బ్రేక్ టైం లో..
మీరు ఏ ఫీల్డ్ ?
“ఫార్మాసీ ”
మీరు?
“బయో టెక్నాలజీ ”
మరి మీరు?
“నేను లాయర్ ”
మిగతా ఇద్దరూ .. “వావ్ ”
లాయర్ : “actually నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, u know? మా ఊర్లో అన్ని రకాల కేసులు డీల్ చేసాను . చెప్పాలంటే …. ”
ఫార్మసీ : “అవును మీరు ఇంతకీ కోర్టులో “యువర్ ఆనర్” అని అరుస్తారా లేదా “మి లార్డ్ ” అని అరుస్తారా?
బయో టెక్నాలజీ : “మీరు రోజూ నల్ల గౌను వేసుకుంటారా , ఉక్కపోయ్యదూ ?”
బ్రేక్ సమాప్తం …పరారీలో లాయర్..

****************************************************

బేతాళ ప్రశ్నలు 

బేతాళుడు : “రాణీ నేను అడిగే ప్రశ్నలకి జవాబు తెలిసి కూడా చెప్పలేదంటే నీ తల థౌసండ్ పీసెస్ అవ్వుగాక !”

రాణి : “…. ”

బేతాళ : “ పబ్లిక్ హెల్త్ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ తీస్కున్నావా?”

రాణి : “… ”

బేతాళ : “పొటెరీ నుండి బేకింగ్ వరకు, 5 మినిట్ క్రాఫ్ట్స్ నుండి యూట్యూబ్ వంటల వరకు అన్ని ట్రై చేద్దాం అనుకుని వదిలేసావా ?”

రాణి : “…. ”

బేతాళ : “ ఫెమినిస్ట్ పోస్ట్లు అన్నిటికి లైకులు కొట్టి, జాబ్ చేసే ఫ్రెండ్స్ అందరిని Unfollow చేసావా ?”

రాణి : “….. ”

బేతాళ : “స్కైప్, వాట్సాప్, ఫేస్బుక్ ,ఇంస్టా లకి ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి నిర్విరామంగా కృషి చేసావా ?”

రాణి : “…. ”

బేతాళ : “సర్దిందే సర్ది, తోమిందే తోమి OCD కి ఒక్క అంగుళం దూరం ఉన్నావా ?”

రాణి: “…… ”

బేతాళ : “ వీటన్నిటికి సమాధానం చెప్పు … ఊఉ … …. లేదంటే నీ తల 1001 పీసెస్ … “

రాణి: “ఎందుకంటే ”

బేతాళ : “ ఉ కమాన్ .. చెప్పు ”

రాణి : “ ఎందుకంటే ”

బేతాళ : “ 1002”

రాణి : “ ఎందుకంటే నేను H4 dependent కాబట్టి ”

బేతాళ : “ తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ ”

by
Srinidhi Yellala.