Home Blog Page 6

మన తొలి పండుగ – ఉగాది

ugadiతెలుగు ప్రజలందరికీ “జయ” నామ సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది మన తొలి పండుగ.తెలుగు వారి కొత్త సంవత్సరం.ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము.చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది, అలాగే ఇది వసంత ఋతువు.ఈ రోజు ప్రకృతి లో వున్న అందాలన్నీకొత్త చిగుర్లు తొడిగే వేళ . ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం..

తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై(60).ప్రభవ నామ సంవత్సరం మొదటిది. క్షయ నామ సంవత్సరం చివరిది.ఈ రోజు మనం జయ నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము.ఈ మొత్తం 60 సంవత్సరాలలో మనిషి  తన జీవిత కాలం మొత్తం మీద రెండు కన్నాఎక్కువ సార్లు ఒకే సంవత్సరాన్నిచూడలేడు.అందుకే తను జన్మించిన సంవత్సరం మళ్ళి చూసిన నాడు అంటే తన అరవయ్యో ఏట(60 పుట్టినరోజు) తనకి అంత ఆయుష్షు ఇచ్చినందుకు గాను “షష్టిపూర్తి మహోత్సవం “జరుపుకుంటాడు.

matsya-avatar-incarnation-lord-vishnu-dasavatara-storyఉగాది ప్రాశస్త్యం:

సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడు.అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మ కి అప్పగిస్తాడు. బ్రహ్మఅప్పుడు సృష్టి, స్థితి, లయ అనే మూడు పనులలో మొదటిదైన సృష్టి కార్యాన్నిఈ నాడే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టాడని మన పురాణాలు చెపుతున్నాయి …యుగానికి ఆది అంటే యుగానికి మొదటి రోజు కావున అది యుగాది గా మనం ఈనాడు జరుపుకుంటున్నాము.

ఉగాది రోజు:

ఉగాది రోజు ఇష్ట దైవాలను పూజించి పెద్దలకు,పిన్నలకు కొత్త బట్టలు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఉగాది పండుగ రోజు మాత్రమే చేసుకునే ఉగాది పచ్చడి వెనుక కూడా ఎంతో అర్ధంవుంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఖాలు, ఆశ్చర్యానందాల కి ప్రతి రూపంగా ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిని ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా సేవించాలి.

ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం మన జీవితంలో ని ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక –

  •  బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
  •  ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
  •  వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
  •  చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
  •  పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు
  • మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

25-ugadi-pachadi-andhra-601శాస్త్రీయకారణం:ఇంతే కాక ప్రకృతి అప్పుడే చలికాలం నుండిఎండాకాలం లోకి మారుతుంది కాబట్టి వాతావరణం మార్పులకి కఫ దోషాలు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుంది.ఉగాది రోజు నుంచి శ్రీ రామ నవమిరోజు వరకు ఈ పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెపుతున్నారు.

 

                                పంచాంగ శ్రవణం:

11Ugadi1ఈ రోజు పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ.ఆ సంవత్సరికి గాను తమ పేరున ఆదాయ లాభాలు,ఖర్చులూ, తమ కుటుంబ స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు.పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్ధం.తిధి,వారం,నక్షత్రం,యోగము,కరణము అనే ఐదు అంగాలతో కూడుకున్నది కాబట్టి అది పంచాంగం అని అంటారు.మనకి మొత్తం 15తిథులు,7 వారాలు,27 నక్షత్రాలూ,27 కరణములు,11 యోగములు వున్నాయి.ప్రతి మనషి యొక్క జన్మ నక్షత్రాన్నిబట్టి అతనికి ఆ సంవత్సరం ఎలా వుందో ,ఏ కార్యక్రమాలు చెయ్యవచ్చో పంచాంగం తెలియచేస్తుంది.మనం ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుతున్నప్పటికి.. శుభకార్యాలకి మాత్రం పంచాంగం ప్రకారమే ముహూర్తాలు పెట్టుకుంటాం.

ఇంతే కాకుండా ఈనాడు పండితులూ,కవులూ  సాహిత్య సమావేశాల్లో పాల్గుని కవితాగోష్టి నిర్వహిస్తారు కూడా.

ఇన్నివిశేషాలు కలిగిన మన తెలుగు వారి మొదటి పండుగని మీరంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొని ఆనందిస్తారని…ఈ జయ నామ సంవత్సరం మీకు అన్నింటిలో జయం కలిగించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు…

హోలీ పౌర్ణిమ..

CAAR-4bigప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటాం.వసంత ఋతువు ప్రారంభాన్నిహోలీ పండుగ సూచిస్తుంది.ఇది రంగుల పండుగ.తమ కిష్టమైన వారిపై రంగులు చల్లుకుని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకుంటారు.భారత దేశం తో పాటు నేపాల్ వారు కూడా హోలీ పండుగ జరుపుకుంటారు.ఉత్తర భారత దేశంలో ఈ పండుగ చాలా విశిష్టమైనది.

హోలీ పండుగ వెనుక కధ:holika_prahlaad

హిరణ్యకశిపుని చెల్లలు హోలిక రాక్షసి.హిరణ్యకశిపుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చేత హరినామం మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమౌతాడు.అప్పుడు హోలిక ప్రహ్లాదుని తీసుకు మంటల్లో కూర్చుంటుంది. మంటలనుండి గాయాలు అవ్వకుండా ఒక మాయా వస్త్రం కప్పుకుంటుంది.కాని ప్రహ్లాదుడు హరి నామస్మరణ చెయ్యగానే ఆ వస్త్రం బాలుని చేరి అతన్ని కాపాడుతుంది.హోలిక ఆ మంటల్లో చనిపోతుంది.తమను ఎన్నో రోజుల నుంచి వేధిస్తోన్న రాక్షసి హోలిక చనిపోవడం తో ప్రజలు ఆనందంగా రంగుల చల్లుకుని ఆనందిస్తారు.అదే హోలీ పౌర్ణమి అయింది.

 

Holi-Radha-Krishna కృష్ణ రాసలీలలు:

గుజరాత్ లోని మధుర మరియు బృందావనం పరిసర ప్రాంతాల్లో కృష్ణున్నివిశేషంగా పూజిస్తారు.ఇక్కడి ప్రజలు కృష్ణుడు గోపికలతో కలిసి వసంత ఋతువులో రాసలీలలు మరియు రంగులు చల్లుకుంటూ బృందావనం లో ఆడుకునేవాడని అదే హోలీ గా ప్రజులు జరుపుకుంటున్నారని భావిస్తారు.ఈ ప్రాంత నమ్మకం ప్రకారం కృష్ణుడు తన నల్లని శరీరం వల్ల ఎంతో చక్కని రంగు గల రాధ తనను ఇష్టపడదేమో అని యశోద దగ్గర బాధపడతాడు.అప్పుడు యశోద రాధ కి రంగులు పూయమని చెప్తుంది .అలా రాధ కి రంగులు పూసి తర్వాత గోపికలతో కూడా కలిసి రంగులు చల్లుకుని ఆనందించారని ఈ ప్రాంతపు నమ్మకం.

తెలుగు ప్రాంతం:

తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కాముని దహనం గా హోలీ రోజుని జరుపుకుంటారు.పార్వతి శివుని సేవించడానికై వచ్చినప్పుడు శివుని పై బాణం వేసి శివుని కోపానికి మన్మధుడు దహనం అవుతాడు.తన బాహ్య శరీరం పోగొట్టుకుని కామరూపం పొందుతాడు.అదే కాముని పున్నమి గా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.

ప్రతి ప్రాంతంలో జరుపుకోవడానికి వేరు వేరు కారణాలు ఉన్నప్పటికీ,హోలీ ఆనందాలని పంచుకునే రోజు.చిన్న పెద్దా అందరూ తమ మనసు లోని కష్టాలు మరిచి హాయిగా ఆనందంగా గడిపే రోజు.

all-god-wallpapers.blogspot.inఈ హోలీ అందరి జీవితాల్లో కి కొత్త రంగులు నింపాలి అని , పర్యావరణ సురక్షితమైనటువంటి రంగులతో హోలీ జరుపుకుని పర్యావరణం మరియు మీరు కూడా క్షేమంగా వుండాలని కోరుకుంటూ ….

అందరికీ హోలీ శుభాకాంక్షలు.

 

 

జన సేన

Janasenaఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే దాని వెనుక ఒక బలమైన కారణం వుండాలి.అదే ఒక వ్యవస్థ పై  తిరుగుబాటు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో ఏళ్ళు ఆ వ్యవస్థ తీరు పై కలిగిన అసహనం , అసంతృప్తి , ఆవేదన కారణం అయ్యుండాలి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రసంగం చూసిన తర్వాత కలిగిన భావన ఇది.ప్రస్తుతం పాలనా వ్యవస్థ తీరు పై తనకు గల ఆవేశం ,ఆక్రోశం ఈ విధంగా ఒక పార్టీ పెట్టడానికి కారణం అని తెలుస్తోంది.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తీరు , విభజన వల్ల ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయనే విషయం చాలా చక్కగా చెప్పాడు.

ప్రతి తెలుగు వాడూ ఒక్కసారి తిరిగి ఆలోచించేటటువంటి విషయాలు , తప్పకుండా ఆలోచించవలసిన విషయాలు జనసేన ఆవిర్భావ ప్రసంగం లో చెప్పారు.విడిపోయినందుకు కాదు… ఎలా విడదీసారు? అనే ప్రశ్న చాలా మందికి ఉంది.అలాగే భాష ని , ఒక ప్రాంతపు యాసని అడ్డుగా పెట్టుకుని ప్రజలను వేరు చెయ్యడం,తెలుగు జాతి సమగ్రతకు భంగం కలిగించేలా ప్రజలని రెచ్చగొట్టటం వంటి సున్నితమైన అంశాలను చాలా చక్కగా ప్రశ్నించడం జరిగింది.

badd11f5-c3ab-4b88-9495-210b604ef78eరాష్టం విడిపోయిన విషయం కన్నా ప్రజలను(మనసు ఉన్న వారు) ఎక్కువగా బాధ పెట్టిన సంగతి ఏంటంటే ప్రజల మధ్య వచ్చిన దూరం.కొన్ని ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు కూడా విభజన ప్రస్తావన వచ్చాక మా ప్రాంతం గొప్ప అంటే మా ప్రాంతం గొప్ప అని కొట్టుకోవడం మొదలుపెట్టారు.చివరికి చదువుకున్న వారిలో కూడా మా ప్రాంతంలో ఇంత మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ,మీ ప్రాంతం లో ఎంత మంది ఉన్నారు అని చాలా నీచమైన వాదనలకి దిగినవారు వున్నారు.ప్రాంతీయ భేదాల మధ్యన సాంస్కృతిక , సాహిత్య విభేదాలు సృష్టించుకుంటూ ఒకరిని ఒకరు శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు.

ప్రజల ఆలోచనలో వచ్చిన ఈ ధోరణి గురించి , దాని వల్ల జాతి సమగ్రత కు (మీకు దాని పై గౌరవం అంటూ ఉంటే)వచ్చే నష్టం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.ఒక ప్రాంతం బాగు పడటం , ఒక ప్రాంతం నష్టపోవడం అనే విషయం పక్కన పెడితే, మొత్తంగా చూస్తే సామాన్య మానవుడి పరిస్తితి రాష్ట్రం మొత్తం మీద ఒకలాగే వుంది…ప్రాంతీయ విభేదాలు ప్రజల సున్నిత భావాల పైన ప్రభావం చూపకూడదని చెప్పిన విషయం అక్షర సత్యం.Pro-Telangana-agitation

ఇదేకాకుండా రాజకీయ నాయకుల కుల,ప్రాంత పక్షపాతాల గురించి కూడా ప్రశ్నించాడు.ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్స్ పార్టీ తీరుపై తనకున్న తీవ్ర అసంతృప్తిని కూడా ధైర్యం గా వ్యక్తం చేసారు.ప్రశ్నించడానికే వస్తున్నానంటూ వచ్చిన మొదటి రోజే పేరు పేరునా అందర్నీ కడిగేసాడు.ముఖ్యంగా కాంగ్రెస్ పై ,ఆ పార్టి వ్యవస్థ పై తన కున్న తీవ్ర  అసహనాన్ని చాలా ఘాటుగానే చూపించాడు.

ప్రశ్నలు అందరికీ ఉంటాయ్ ..సమాజం పై,వ్యవస్థ పై అందరికీ ఎదో విధమైన అసహనం వుంటుంది.కాని అవి అడగాలంటే ఒక బలమైన వ్యక్తి కావాలి.ఆ పవర్ సినీ నటులకి ఒక వరం .పూర్వం కూడా ఈ విషయాన్నీ చాలా మంది నటులు నిరూపించారు.చరిత్ర సృష్టించారు.సినీ గ్లామర్ వల్ల తను సంపాదించుకున్న ఈ పవర్ తో ఒక వ్యవస్థ పై పోరాటం చేద్దాం అనుకున్న వ్యక్తుల్లో పవన్ కొత్తవాడు కాకపోయినా , తను రావడానికి గల కారణం(ప్రశ్నించడానికి) లో ఒక కొత్త కోణం ఉంది.తనకి ప్రస్తుతం వున్న ఆవేశానికి ,ఆలోచన కూడా తోడు కావాలి.ఆలోచన లేని ఆవేశం ఎక్కువ రోజులు వుండదు.

డ్రాబాక్స్:ప్రసంగం మొత్తం బాగానే ఉన్నప్పటికీ..పవన్ తన ప్రసంగాన్ని గంభీరంగా చెప్పివుంటే ఇంకా ఎఫెక్టివ్ గా వుండేది.పంచ్ డైలాగులు వున్నప్పుడు మాత్రమే ఆవేశంగా మాట్లాడి,మద్యలో అప్పుడప్పుడూ నవ్వడం పెద్దవాళ్ళకి అంత రుచించదు.ఏదైనా మార్పు తీస్కుని రావాలంటే ముందు పదవి కావాలి.అది దక్కాలంటే అన్ని వర్గాల ప్రజలను నమ్మించాలి.యువతనే కాకుండా అందర్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం మంచింది.తన అన్న చేసిన తప్పు చెయ్యకుండా , తన నీతికి కట్టుబడి వుండడం ప్రస్తుత రాజకీయల్లో చాలా కష్టం.మరి మన అవినీతి రాజకీయపు గాలివాటుకి కొట్టుకుని పోతాడో లేక ఎదురు నిలిచి పోరాడతాడో చూడాలి.ఎందుకంటే ..సినిమాల్లో లాగా “కట్ చేస్తే” అని చెప్పడానికి..నచ్చకపోతే ఎడిట్ చెయ్యడానికి ఇక్కడ వీలు లేదు కాబట్టి.

Jana-Sena-Party-Launch-Event-99చివరిమాట:వ్యవస్థ పట్ల తనకున్న అసహనం తో, సమాజం లో జరుగుతున్న అన్యాయాల వల్ల కలిగిన ఆవేశం లో తన లోపల జరిగే ఘర్షణ కి ప్రతిఫలమే ఈ జనసేన పార్టి అని చెప్పిన పవన్ గారి ఆవేశం ఇలాగే ఉంటుందో లేక …రాజకీయ పద్మవ్యూహం లో తలలు పండిన మయగాళ్ళ చేతిలో మోసపోకుండ నిలబడి పోరాడతాడో చూడాలి మరి .

తన తిక్కకి వుండే లెక్క తప్పకుండా వుంటే రాష్ట్ర /దేశ రాజకీయ చరిత్ర లో ఒక కొత్త కోణాన్నిచుస్తామేమో….ఎదురుచూద్దాం..మనకి అలవాటే కదా.

 

 

బాటిల్ ఆర్ట్..

ఈ సారి ఆక్టివిటీ కార్నెర్ లో బాటిల్ ఆర్ట్ చూద్దాం…మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయ్..పనికిరాని వాటన్నింటిని అర్జెంటు గా డస్ట్ బిన్ లో పారెయ్యడం మన పని …కానీ ,అలా కాకుండా వాటిల్లో నుంచి కూడా మన క్రియేటివిటీకి పని చెప్పొచ్చు..బాటిల్ ఆర్ట్ అంటే ఎదో కాదు..మన ఇంట్లో అప్పుడప్పుడూ గాజు సీసాలు చూస్తూ వుంటాం…వాటిని పారెయ్యకుండా వాటికి చక్కని పెయింటింగ్స్ వేసి ఫ్లవర్ వాస్ గానో, లేక తోటలోనో ,లేక లోపల లైట్ పెట్టి బెడ్ లాంప్ లానో పెట్టుకుంటే చాలా బాగుంటుంది..

ఈ రోజుల్లో చెప్పాలంటే trendy గా వుంటుంది..ట్రై చెయ్యండి..ఏదైనా క్రియేటివ్ గా చేస్తే ఏమవుతుంది? మహా అయితే బోర్ ఫీలింగ్ పోతుంది, కొత్త ఎనర్జీవస్తుంది….కాన్ఫిడెన్సు లెవెల్స్ పెరుగుతాయి అంతే…

మెటీరియల్ :

sjdhoud kaj

బాటిల్ కి ఏదైనా స్టికర్ లాగా వుంటే కాసేపు వేడి నీళ్ళల్లో ఉంచితే ఈసీగా ఊడి వచ్చేస్తుంది.పెయింటింగ్ కి fabric/acrylic paints యూస్ చెయ్యొచ్చు.

ఈ విధంగా ఉపయోగించవచ్చు:

unnamed njd nhd jdkd bhd

శక్తి…

ఒకరికి గారాల పట్టి,  ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ, ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి,  ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు, ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు , వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ’. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..

. 178355090 01 090129_varanasi_uttar_pradesh_india_bride_woman_beautiful_portrait_ghat_wedding_nosering_veil_innocent_lost_travel_photography 9891456-varanasi-india--july-22-2009-group-of-indian-women-in-colorful-saris-sit-and-watch-the-solar-eclipse ganpati 041 HappyinHerOwn-World-9511 images indian_people ?????????????????? Indian woman in Kolkata with mobile phone Indian-Women-Not-Allowed-Phones India-Women-Mobiledia-Kendra-Srivastava Kuechenarbeit_1000 mobilephone OB-QX533_iwoman_H_20111208051059 p358458421-3 Punjabi-sharpshooter sarees Social-Movements-in-the-Global-South-Indian-Women-300x206 Women and Water in India women-india-300x225 women-work-abroad తనకే తెలియని ఎంతో శక్తి కలిగిన వ్యక్తి స్త్రీ..తనని నమ్ముకున్న వాళ్ళ సంతోషం తప్ప ఇంకేమి ఆశించని మగువ.ప్రపంచం లో వున్న మహిళలందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…ప్రతి స్త్రీ తన లో వుండే ఆ శక్తి ని గుర్తించి మంచి వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందించుకుని, అన్ని విధాలుగా పురోగమించాలని కోరుకుంటూ…

namaste

 

ఇండియా విల్ గో ఆన్…

lkoఈ మధ్య రాష్రంలో ఇంకా దేశంలో , రాజకీయ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  చాలా బాధగా, భయంగా, బెంగగా అనిపిస్తోంది.నలుగురు ఒకచోట కలిస్తే ఎక్కడ చూసినా,వీటి గురించి చర్చలే .చివరికి ఆడవాళ్ళు కలిసినా కూడా పిల్లలు, వంటలు, పూల మొక్కలు, మొగలి రేకులు  అని కాకుండా రాష్ట్ర పరిస్థితుల గురించి, దేశం గురించి మాట్లడుకుంటున్నారంటే  చూడండి విషయం ఎంత సీరియస్సో..ఒకందుకు ఇది మంచి పరిణామమే….ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది..నాకెందుకులే, ఎవరైతే ఏంటి? అనే ఆలోచన తగ్గి, విశ్లేషించడం మొదలుపెట్టారు.అందరూ కాకపోయినా కనీసం కొంత మందిఐనా సమాజం గురించి ఆలోచిస్తున్నారు…ఈ మార్పు ఇలాగె కొనసాగితే ఎంత బాగుండు..ఆశపడటంలో తప్పు లేదు కదా?

ఈ మధ్య లైబ్రరీ వెళ్ళినప్పుడు ఒక పుస్తకం నన్ను ఆకట్టుకుంది.INDIA: A WOUNDED CIVILIZATION ….ఈ బుక్ రాసింది  1975 లో , భారత దేశం లో ఎమర్జెన్సీ ఉన్న రోజుల్లో.ఈ పుస్తకం లో భారత దేశం గురించి, ఇక్కడి వ్యవస్థ గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు రచయిత.ఎంతో గొప్పవైన మన ప్రాచీన వేద గ్రంథాలను, సనాతన ధర్మాలను పొగుడుతూనే… అదే ధర్మం , కర్మ అనే ముసుగులో ఇక్కడి ప్రజలు మనస్సాక్షిని చంపుకుని ఎలా తమ కష్టాలకు, కర్మ అనే సిద్ధాంతం తో ముడి పెట్టి బతుకుతున్నారో చెప్పారు.pilgrimage-tour-packages

మొదటి సారి మొఘల్ రాజులు ఎలా ఈ దేశం లోకి వచ్చారో మొదలుకుని, పోర్చుగీస్,ఫ్రాన్స్,తర్వాత బ్రిటిష్ వారు ఎలా ఈ సువిశాల దేశాన్ని ఆక్రమించుకుని ఎలా ఇక్కడి ప్రజల మనోభావాలతో  ఆడుకుని రాజ్యం చేసింది వివరించారు.

తరువాత స్వాతంత్రం వచ్చినా కూడా డెమోక్రసీ అనే ముసుగు లో రాజకీయ నాయకుల చేతుల్లో దేశం ఎలా నియంత పాలన కింద నడిచిందో వివరించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది..అప్పటికీ(1975), ఇప్పటికీ(2014)దేశం లో రాజకీయ పరంగా, ఎటువంటి మార్పు లేదు.అవే సమస్యలు.ఎందుకిలా?……మార్పు అనేది మనకి ఇష్టం లేకనా? లేక అదో రకం నిర్లిప్తతా???

నిజంగా మనం ఆత్మవంచన చేసుకుంటున్నామా??”ప్రపంచంలోఎవరూ వేలు ఎత్తి చూపించలేనటువంటి సనాతనధర్మం నీడలో, కళ్ళు మూసుకుని బ్రతికేస్తున్నామా???”అని అనిపించింది..

indian-low casteవిదేశీ దాడులు, బ్రిటిష్ పాలన, స్వాతంత్రం , అధిక జనాభా, నిరక్షరాస్యత,….ఇప్పుడు” రాజకీయాలు” ..ఇలా ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో భారతజాతి పోరాటం కొనసాగిస్తూనే  ఉండాలా???రత్నగర్భ  అవ్వడమే ఈ దేశం చేసిన తప్పా?

ఎవరితోనైనా ఈ విషయాల గురించి మాట్లాడితే , నువ్వేం చెయ్యగలవు ?నీకెందుకు అని ప్రశ్నిస్తారు…నిజమే ఒక పెద్ద మార్పు తీస్కుని రాలేక పోవచ్చు…కాని నా వరకు నేను,నా కుటుంబం వరకు మార్పు తీస్కుని వచ్చే ప్రయత్నం చెయ్య గలను కదా..ఇలా ఎవరికి వారు తమలో తాము మార్పు తీస్కుని వస్తే ఆ చిన్ని చిన్ని మార్పులే రేపు ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు..ఎందుకంటే

“దేశమంటే మట్టి కాదోయ్ , దేశం అంటే మనుషులోయ్”..కాబట్టి

ఆర్.కె.నారాయణ్(మాల్గుడి కథలు రచయిత) గారు అన్నట్టు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అవి చరిత్రలో కలిసిపోవాల్సిందే..ఇండియా విల్ గో ఆన్ ….”INDIA WILL GO ON”…కాకపోతే ఆ ప్రయత్నం లోనే మార్పు రావాలి అని ఆశ.

అది మనందరి చేతుల్లోనే వుంది…20120511044233_Sony Awards 9ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామా?