Home Blog Page 5

వరలక్ష్మీ వ్రతం

vratham 0481అందరికీ వర లక్ష్మీ వ్రత శుక్రవారం శుభాకాంక్షలు.శ్రావణ మాసం లో అందరు ఎదురు చూసె వరలక్ష్మి వ్రతం వచ్చేసింది.మన తెలుగు మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ వ్రతాన్ని అందరు ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వర లక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి.ఆ రోజు కుదరని వారు శ్రావణ మాసం లోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు.తెలుగు వారే కాకుండా, కన్నడ మరియు తమిళ్ నాడు ప్రాంతం వారు కూడా ఈ వ్రతాన్ని వైభవంగా చేసుకుంటారు.
కులాలకి వర్నాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వ్రతం చేసుకోవచ్చు.ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు ఈ వ్రతాన్ని వైభవంగా జరుపుకుంటారు.
అష్ట ఐశ్వర్యాలకు,సిరి సంపదలకు నెలవైన అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.

ఈ వ్రతానికి కావలసినవి ముఖ్యంగా భక్తి,నమ్మకం.

kalasam-varalakshmiముందుగా పూజ స్థలం శుబ్రం చేసుకుని,అష్టదల పద్మం ముగ్గు వెసుకుని,దాని పై తమలపాకు,వక్క వుంచి పచ్చి బియ్యం పోసి అమ్మవారిని దానిపై కుర్చోపెట్టాలి.

అమ్మవారి రూపు లేదా,కొబ్బరికాయతో కాని అమ్మవారిని సిద్ధం చేసుకుని అలంకరించుకోవాలి.కలశం మన వీలుని బట్టి రాగి లేదా వెండి తెసుకుని,అందులో పసుపు,నాణేలు,తమలపాకు,వక్క వేసుకుని,దాని పై పసుపు కుంకుమ పూసిన కొబ్బరికాయని పెట్టాలి. కొబ్బరికాయకి అమ్మవారి రూపుని దారంతో జారిపోకుండా కట్టాలి.జాకెట్టు ముక్కతో కాని ఏదైనా కొత్త వస్త్రం తో కాని కుచ్చిల్లు పోసి కలసానికి చీరలాగా కట్టాలి.నగలు,పూలు పెట్టి చక్కగా అలంకరించుకోవచ్చు.DSC00495
పూలు:
imagesఅమ్మవారి పూజలో పూలది ముఖ్యమైన స్థానం.అమ్మవారి పూలలోఎరుపు రంగు పూలు ఉండేటట్లు చూసుకోండి.లక్ష్మి దేవికి ఎరుపు రంగు పూలంటే చాల ఇష్టమంట.కలువలు కుడా ఉండి తీరాలి.Nymphaea rubra
నైవేద్యం:
శుచిగా స్నానం చేసి ముందే నైవేద్యం చేసుకుని వుంచుకోవాలి.అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే ప్రీతి.పులిహోర,చక్కర పొంగలి,పరమాన్నం,గారెలు.ఇలా ఎవరి శక్తికి తగ్గట్టు వారు నైవేద్యం చేసుకోవచ్చు.IMG_0048
ఈ శుక్రవారం బంగారం కొని అమ్మవారికి పెడితే మంచిది.పాత రోజుల్లో ప్రతి వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి కాసులు కొన్ని కొని,కొన్ని సంవత్సరాల తర్వాత అలా కొన్నవాటితో వాటితో కాసుల పేరు చేయించుకునే వారట.
తరువాత పసుపు తో చిన్ని కొండలాగా చేసి కుంకుమ పెట్టి గణపతిని చేసుకోవాలి.అమ్మవారి ముందు తమలపాకు,వక్క పెట్టి గణపతిని అందులో పెట్టాలి.
ముందు గణపతి పూజ చేసుకుని తర్వతః వ్రతం మొదలు పెట్టాలి.
వ్రత విధానం వ్రత కధ మనకి అందుబాటులో దొరుకుతాయి.అందులో చెప్పినట్టు చేసి.కథ చదువుకుని,అక్షితలు తలపై చల్లుకుని,అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముంగించవచ్చు.

indiaoutsidemywindow

సాయంత్రం స్నేహితులని పిలిచి ప్రసాదం,తాంబూలం,పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి.ముందుగానే చిన్ని బ్యాగుల్లో జాకెట్టు పిసు,రెండు మట్టి గాజులు,పసుపు కుంకుమ,రెండు పళ్ళు,పూలు ఆకు వక్క పెట్టి ఉంచుకుంటే,వచ్చిన వారికి సులువుగా ఇవ్వడానికి వీలుంటుంది.

ఈ వ్రతాన్ని మీరు కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను.

                                           క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
                                              నీరజాలయకు నీరాజనం

                                                                                           జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
                                                                                                       నెలకొన్న కప్పురపు నీరాజనం
                                                                                          అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
                                                                                                       నిలువుమాణిక్యముల నీరాజనం

                                                                                          చరణ కిసలయములకు సకియరంభోరులకు
                                                                                                       నిరతమగు ముత్తేల నీరాజనం
                                                                                              అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
                                                                                                         నిరతి నానావర్ణ నీరాజనం

                                                                                               పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
                                                                                                   నెగడు సతికళలకును నీరాజనం
                                                                                              జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
                                                                                                   నిగుడు నిజ శోభనపు నీరాజనం

ఆలోచనలు …

Indian-Girlsశ్రావణ  మాసం  వచ్చేసింది ,అందులో మొదటి శుక్రవారం వచ్చేసింది  అని సంబరంగా వుంది కానీ , ఏంటో ఒకవైపు చెప్పలేని బాధ . మనిషిగా పుట్టినందుకు,సమాజం  పట్ల,పుట్టిన ఊరు పట్ల , పెరిగిన వాతావరణం  పట్ల ,మాట్లాడే  బాష పట్ల మమకారం  పెంచుకుంటాం . అది మానవ  నైజం. అలాంటి  భావాలు  లేని వాడు అసలు మనిషే కాడు , ఒత్తి రాయి . కాని ఏ విషయానికైనా మితం అనేది ఉంటుంది .ఉండాలి  కూడా . హద్దు మీరిన అభిమానం ,ఆశా  వినాశ నానికి  కారణం కావొచ్చు .

స్కూల్ కి  వెళ్లి పాఠాలు  అర్ధం  అవ్వడం మొదలు పెట్టిన నుండి నా దేశం పై నాకెంతో భక్తి గౌరవం   కలిగాయి. అసలు భారత దేశంలో పుట్టినందుకు  ఎంతగా  గర్వపడే దాన్నో . జాతీయ గీతం విన్నా ,మా తెలుగు తల్లికి మల్లెపూ దండ  అని విన్నా  తెలీకుండానే  కళ్ళలో  కన్నీటి పొర  అడ్డువచ్చేది . స్వతంత్ర  సమరం గురించి ,అమర వీరుల త్యాగాల గురించి క్లాసు లో  చెప్తుంటే దుఖంతో గొంతు తడబడేది .

ఇంత గొప్పదని భావించి ,తలచిన నా దేశం గురించి ఇప్పుడు చూస్తుంటే మొదట  బెంగగా  అనిపించింది ,తర్వాత  బాధ  వేసింది కానీ  రోజు రోజు పరిస్థితి  చూస్తుంటే చాలా  భయంగా  వుంది .

వాక్  స్వాతంత్రం  రాజ్యాంగం  మనకిచ్చినటువంటి హక్కు . హక్కు వుంది కదా  అని ఎవరికి  నచ్చినట్లు మాట్లాడడం ఎంత వరకు న్యాయం . ఎన్నో  విభిన్న జాతుల ,వాళ్ళు  వున్న మన దేశం లో అది చాల ప్రమాదకరం కూడా .న్యాయంగా  పోరాటం  సాగించి  తెలంగాణా  వాదులు  తెలంగాణా  తెచ్చుకునారు . ఆక్కడి వరకూ  బాగానే వుంది .కాని  అధికారంలో కి వచ్చిన  తర్వాత  ప్రజలు  ఎన్నుకున్న మనిషిగా వారికి  కొన్ని భాధ్యతలు  ఉంటాయ్. ఎన్ని మాటలు  మాట్లాడినా  కూడా  ఏమి అనిపించలేదు కానీ  ఈమధ్య  కవిత పార్లమెంటు  సభ్యురాలు  అయివుంది కూడా ,తెలంగాణా  అసలు భారత దేశంలోనే  లేదు ,భారత దేశం తెలంగాణాని  ఆక్రమించుకుంది  అని అంది . నిజంగా  ఈ మాటకి  ఎంత కోపం,భాధ వేసాయంటే  అసలు అలా  ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు అసలు . సంఘ వ్యతిరేకమైన మాటలు  మాట్లాడినప్పుడు  ఇది తప్పు అని ఎవరూ  చెప్పరేంటి . భారత  దేశం నా మాతృభూమి … అంటూ  రోజు  స్కూల్ లో  ప్రమాణం చేసే పిల్లలపై ఇలాంటి మాటలు  ప్రభావం చూపవా . నిజాం  ఉక్కు పాలన ని మర్చిపోయారా అప్పుడే …. తెలుగు తల్లి ఎవరయ్యా  అసలు తెలుగు తల్లి మాకు తెల్వదు .. అని చెప్పుకు తిరిగే వాళ్ళంతా ఎ భాషలో  మాట్లాడుతున్నట్లు . అసలు ఇంత దరిద్రం మనకెందుకు వచ్చింది .ప్రాంతీయ  గొడవలకి   భాషని  ఎందుకు బలి చేస్తున్నారు .

ఇంకో సిగ్గు మాలిన విషయం ఏంటంటే స్థానికత  గురించి ఈమధ్య వస్తున్న గందరగోళం .. 1956 నుండి వున్న వాళ్ళు మాత్రమే తెలంగాణా వాళ్ళు  అంటోంది ప్రభుత్వం . మరి తర్వాత వచ్చిన వారిని ఎం చేస్తారు . వారి కోసం త్రిసంఖు స్వర్గం తయ్యారు చేస్తారా . నేను తెలంగాణా  లో పుట్టాను . తెలంగాణ  బిడ్డనే . కానీ మా అమ్మ నాన్న రాయలసీమ వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఏ  స్థానికత  లేని సామాజిక అనాధ బిడ్డనా …  చెప్పండి?మా పుట్టుక ప్రశ్నా ర్ధకమా ?????ఎవరూ  ఒక్క  మాట మాట్లాడరేంటి  అసలు?అసలు ఎవరికీ  జవాబు  చెప్పనవసరం  లేదు అనే భావన  పాలించే వాళ్ళకి  వచ్చినప్పుడు  అది ప్రజాస్వామ్యం  ఎలా అవుతుంది అసలు??????నిరంకుశత్వం అవుతుంది కదా???

Indian-Childrens-in-Schoolమొన్నటికి  మొన్న చిన్ని చిన్ని పిల్లలు  బస్సు  ట్రైన్ కి గుద్దుకుని చనిపోతే ,ఆ వార్తని  సాక్షిలో చదవాల్సి  వచ్చింది . “పిల్లల బాక్సులు  తెరచి చూసాం  అందరి బాక్సుల్లోనూ పచ్చడి మెతుకులే .. రాజన్న రాజ్యం వుంటే ఈ దుస్థితి  వుండదు”,  అని రాసాడు .ఏ  వార్తనైన  వాళ్లకి  అనువుగా మార్చుకోవడం వీళ్ళని  చూసి నేర్చుకోవాలి .పసి పిల్లల  ప్రాణాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు మన మీడియా వాళ్ళు . మనసే విరిగిపోయింది . ఛి …

ఇవన్ని చూసి , ఆలోచించి బుర్ర వేడెక్కిపోతోంది . అందుకే  శ్రావణ  మాసం  పండుగల  గురించి రాద్దామని  మొదలు పెట్టి మనసులో వున్న  భారాన్నంతా  బయట పెట్టేసాను …

 

ఆషాడం లో….

rffఉగాది పండుగ నుండి అన్నీ డ్రై డేసే అమ్మాయిలకి.ఒక పండుగ ఉండదు,ఏమి ఉండదు.ఆషాడం వచ్చింది తన తర్వాత శ్రావణ మాసం తో వచ్చ్చే పండుగలను  మోసుకొచ్చింది.ఆషాడం వచ్చిందనగానే ఎంతో సంతోషంగా అనిపించింది..నాకు మాత్రం ఇంక రాబోయే కాలమంతా పండుగలు,కొత్త బట్టలు,విందు భోజనాలు అని తలచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది.

ఆషాడం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు.ఈ నెలలో తప్పకుండా  చందమామని,చుక్కలని ఆకాశం నుండి కోసి అమ్మాయిల చేతిలో పెడతారు.రోటిలో కాని మిక్సిలో కాని రుబ్బిన గోరింటాకు ని చేతికి పెట్టుకుని ఓపిగ్గా,విసుగు లేకుండా రాత్రంతా ఉంచుకుని తెల్లారగానే చేతిలో పూసిన మందార పువ్వుల్ని చూసుకుని మురిసిపోవడం ఒక మంచి అనుభూతి.ఎర్రగా పండితే మంచి మొగుడోస్తాడని,ఎవరికీ ఎక్కువ పండిందో అని పోటీలూ పెట్టుకుని మరీ చూసుకునే వాళ్ళం.ఇది ఉత్తి పిచ్చి నమ్మకం అని అందరికీ తెలుసు కాని తెలిసి తెలీని వయసులో అమాయకంగా పెద్దాళ్ళు చెప్పే మాటలు నమ్మేసి చేతులతో పాటు సిగ్గుతో ఎర్రగా పండిన చిన్నారి బుగ్గలను చూడాలంటే ఇలాంటి అందమైన అబద్ధాలు ఎన్నైనా చెప్పొచు,ఎన్నైనా ఉత్తుత్తినే నమ్మేయ్యొచ్చు..gghg

సైబర్ అమ్మాయిలూ..వాట్ ది హెల్? అని మాత్రం అనకండి.ఎందుకంటే అందమైన చేతులకి గోరింటాకు పెట్టుకుని వాటిని కంప్యూటర్ కీ బోర్డు పై టకటక ఆడిస్తుంటే ఎంత బాగుంటుంది కదా.ఆ రోజు ఆఫీస్ లో మీరే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు..డెఫినిట్లీ.ఎత్నిక్ లుక్ అని స్టైల్ గా చెప్పొచ్చు.

సైంటిఫిక్ రీసన్: సాంప్రదాయాలు అంటూ ఏదోటి చెప్పేస్తే ఈ రోజుల్లో ఊరుకోరు.ఖచ్చితంగా వాటికి కారణాలు అడుగుతారు కాబట్టి వాటి గురించి కూడా ఓసారి చూద్దాం..

bg_r2_c2ఆషాడం మనకు వర్షా కాలం,ఈ కాలంలో రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.గోరింటాకు రసంలో అంటి బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయంట.గోరింటాకుని చేతులకి ,వేళ్ళకి పెట్ట్టుకోవడం వల్ల తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్ళకుండా ఇది కాపాడుతుందని ఒక వివరణ.

గోరింటాకుకి ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట.కాబట్టి ఉద్యోగాలు చేసే అమ్మాయిలూ ఒకసారి ప్రయత్నం చేసి చూడొచ్చు.

సో గోరింటాకుతో రాబోయే పండుగ సీజన్లకి స్వాగతం చెప్పేద్దామా?…

ధర్మ యుద్ధం 2014: ఓటరు, మీడియా

vote-india_19502620131019మన రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప అస్త్రం ఓటు. ప్రతి  ఐదు సంవత్సరాలకి  ఎవరు మనకు సుపరిపాలన ఇవ్వగలరో  వారిని ఎన్నుకోగల శక్తి  ఓటు మనకి ఇస్తోంది. ప్రతి భారత పౌరుడు ఐదు సంవత్సరాలకి  ఒకసారి తన పాలకులని ఎన్నుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో  దేశ, రాష్ట్ర  నాయకత్వాన్ని, వ్యవస్థలో తేవలసిన మార్పుని మన ఓటే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం వేసే ఓటుపైనే  మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తో పాటు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడివుంది.  ఇప్పుడు నిజాయితీగా వ్యవహరించగల,  స్థిరమైన మరియు దృడమైన వైఖరితో ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థ నాయకుడు కావాలి.

ఇంత శక్తి ఉన్న ఓటర్ని ప్రభావితం చేయగల మరో శక్తి మీడియా. మరి ఎన్నికల సమయంలో మీడియా పాత్ర  చాలా కీలకం.  ప్రజాస్వామ్యంలో ఓటర్ని  చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీడియా పై చాలా ఉంది.  ఇంతటి శక్తివంతమైన, ప్రజల తరపున మాట్లాడాల్సిన  మీడియా కొన్ని వర్గాలుగా విడిపోయి ప్రజలని చైతన్యవంతం చేయకపోగా పక్క దారి పట్టిస్తోంది.

andhra-channelsఇప్పటి పరిస్థితి చూస్తుంటే అసలు మీడియాని నడుపుతున్న అధినేతలకు సమాజంపై భాధ్యత ఏమాత్రం ఉన్నట్టు కనిపించడంలేదు. చేతిలో ఆయుధం ఉంది కదా అని ఎలా పడితే అలా వాడితే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నప్రధాన మీడియాని తీసుకుందాం …. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, tv9.

మొదటగా ఈనాడు, సాక్షి గురించి తీసుకుంటే రెండు కూడా రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు పప్పెట్లులా ఉన్నాయే కానీ, ప్రజలకి యే మాత్రమూ ఉపయోగపడేలా వ్యవహరించట్లేదు. సాక్షి ఎంత సేపూ జగన్ గారి నామ స్మరణమే తప్ప మిగతావి యే విషయాలు వారికి పెద్దగా పట్టవు. మహా అయితే ఈనాడు వాళ్ళు ప్రచురించిన న్యూస్ కి కౌంటర్ న్యూస్ ప్రసారం చేయటం వాళ్ళ మీద ఛాలెంజ్ చేయటానికి సరిపోతుంది. ఇంతకన్నా సాక్షి గురుంచి చెప్పుకోటానికి కూడా ఏమి లేవు.

eenadu-vs-sakshi-paperఇక ఈనాడు పక్కా పక్షపాతంగా వ్యవహరిస్తోంది. ఈనాడు రామోజీ రావు గారు, తెలుగు దేశం పార్టిని ఎలాగైనా అధికారంలో కుర్చోపెట్టాలని  గట్టిగా కృషి చేస్తున్నారు. దానికోసం తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం ఈనాడు ద్వార చాలా గట్టిగా చేస్తున్నారు. జగన్ విషయంలో ఈనాడు మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం లేదు. నిజానికి జగన్ కి లేని ప్రాముఖ్యతని తెచ్చి పెట్టిందే వీళ్ళ  అత్యుత్సహమే. ఎంత సేపూ జగన్ ఇంత దోచేసాడు అంత దోచేసాడు అని రాసి రాసి, ఆఖరికి ప్రజలకి టైం పాస్ న్యూస్ లా తయారు చేసి పెట్టారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, జగన్ ఒక్కడే దోచేసాడా? ఈనాడు వారు మాత్రం జగన్ ని ఫోకస్ చేయటమే ద్యేయంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఇవి కాకుండా ఏదైనా న్యూస్ ఉందా అంటే అది వాళ్ళకి గిట్టనివారి గురించి ప్రముఖంగా ప్రచురించడం మాత్రమే. ఒకప్పుడు రాత్రి తొమ్మిది గంటల న్యూస్ లో రోజులో న్యూస్ మొతాన్ని అరగంటలో మన ముందర పెట్టేసేవాళ్ళు. కాని ఇప్పుడు తమకు నచ్చని వారి గురిచి  న్యూస్ చదవటానికే ఆ అరగంట సరిపోవటం లేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే  నేటి వార్తా పత్రికలని సమాజ స్థితిగతులు చెప్పే మాధ్యమాలు అనేకంటే…. ఫలానా పార్టీ వారి ప్రచార వేదికలు అని అనడం బాగుంటుందేమో.ఎందుకీ నాటకాలూ, ఎవరిని ఎమార్చడానికి.ప్రజలూ మరీ అంత గుడ్డివారు కాదని వీళ్ళకు తెలియదా.14-300x225

ఇకపోతే మిగిలింది ఆంద్రజ్యోతి, TV9. వీరు ఎప్పుడూ వార్తలను  సంచలనాత్మకముగా ఎలా ప్రచురించాలా అని ఆలోచిస్తారు తప్ప ప్రజలకు విషయాన్ని ఎలా తెలియచేయాలి అనే ఆలోచనే ఎప్పుడూ ఉండదు. వీళ్ళు ముఖ్య నాయకులతో కానీ సెలబ్రిటీస్తో  కానీ  ఇంటర్వూ తీసుకొన్నప్పుడు వారు చెప్పిన వాటిల్లో చిన్న చిన్న నెగెటివ్ మాటలనే హైలైట్ చేసి వాటికీ ఇంకాస్త మసాలా జోడించి దానిని తిప్పి తిప్పి చెప్పి వాళ్ళని పీల్చిపిప్పి చేస్తారు.అవతల వారి చెప్పేదానితో సంబంధం లేకుండా వీళ్ళకు కావలసిన విషయాన్నే వాళ్ళ దగ్గరనుండి రాబట్టుకుని ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుంటారు.సినీ తారల రహస్య జీవితాలు,రాజకీయ నాయకుల బూతు పురాణాలు చెప్పడమే వీరి ధ్యేయం.అంతే కానీ సమాజం కోసం కృషి చేసే వారి గురించి, చేస్తున్న వారి గురించి అస్సలు ఫోకస్ చెయ్యరు.సమాజం పై మనుషులకి విరక్తి కలిగించే వార్తలు తప్పించి ఇంకేమి ప్రసారం చెయ్యరు.ఆశావహ దృక్పధం కలిగించే ఆలోచన అసలు ఎవరికీ లేనట్టేవుంది.

media-and-courtsమీడియా అంటే చెడు వార్తలు, సినీ పురాణాలు, రాజకీయ భజనలు ఇంతకు మించి ఏమి లేదు అని అనుకునేటట్టు చేసారు.ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే ప్రజలకి మీడియా తప్పించి వేరే మార్గం లేదు.కానీ మీడియాని చూస్తుంటే కులాల వారీగా,ప్రాంతాల వారీగా, పక్షపాత బుద్ధితో ఎవరికి నచ్చిన వారిని వారు కాపాడుకుంటూ అవతలి వారిని మాటలతో తూట్లు పొడుస్తూ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది.

ఇప్పుడు ఉన్న ప్రముఖ మీడియా చానల్స్, పేపర్స్ ఎవైనా వారి రాజకీయ ,వ్యాపార స్వలాభాల కోసం పని చేస్తున్నాయే కానీ, ప్రజల కోసం పని చేయటం లేదు. మీడియాకి అసలు పక్షపాత వైఖరి ఉండకూడదు. ఏ విషయానైన్న సాధారణ విషయముగానే పరిగణించాలి.అంతే కాని మీడియా అధినేతల భావాలని ప్రజలమీద రుద్దటానికి ప్రయత్నిచటం ,దేశానికీ యే మాత్రం శేయస్కారం కాదు. ఇప్పటికైనా ఈ మీడియా వాళ్ళు ఈ నిజాన్ని గ్రహించి నడుచుకుంటే మంచిది లేకపోతే విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి వచ్చి రేపు నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు.

కత్తి కన్నా కలం చాలా పదునైనది.అంతటి పదునైన ఆయుధం వున్న మీడియా నీతికి, న్యాయానికీ కాకుండా ఇలా వర్గాలుగా విడివడి పక్షపాత బుద్దితో ఎవరికి నచ్చిన వారిని వారు కాపు కాయడం ఏమాత్రం న్యాయం????vote-for-the-right-person1

సీతారామ కళ్యాణం

1998

srirama2ఈ రోజు ఇంగ్లీష్ పరిక్ష అయిపోయింది.తర్వాత మాథ్స్ ఎగ్జాం.దేవుడా అసలు ఈ లెక్కలు ఎందుకు కనుక్కున్నావు, ఒకవేళ కనుక్కున్నా అందులో పరీక్షలు ఎందుకు కనుక్కున్నావు స్వామీ.ఏంటో ఈ మాథ్స్ ఎగ్జాం అంటేనే  జ్వరం వచ్చేస్తుంది.తప్పదు కదా, అన్నిటి తో పాటూ ఈ లెక్కలు కూడా ప్యాస్ అయితే కానీ ఫోర్త్ క్లాసుకి పంపరంట.ఇంత చిన్న బుర్రలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీరే చెప్పండి.అడిషన్లు, మైనస్సులే కాక 3rd క్లాసులో మల్టిప్లికేషన్లు,దివిషన్లు కూడా వచ్చి చేరాయి.ఇంకా 4త్ క్లాసుకి వెళ్తే ఇంకా పెద్దపెద్ద లెక్కలు ఉంటాయంట, చింటు అన్న చెప్పాడు.ఛ ఛ..పెద్దాల్లున్నారే ఎప్పుడూ ఇంతే.

రేపు మాకు సెలవు ఇచ్చారు.శ్రీ రామ నవమి కదా అందుకు.హమ్మయ్య సెలవు కదా ఇంకొంచం బాగా చదువుకోవచ్చు.పుస్తకం తీసానో లేదో ప్రియా అన్న,చింటూ అన్న వచ్చారు.మా ఇల్లు రామాలయం వీధిలో వుంటుంది.మా ఊరికి అదే రాముని గుడి.చాలా గొప్పగా చేస్తారు తెలుసా.నిజంగా పెళ్ళి లాగానే వుంటుంది.అప్పుడే చిన్నచిన్న షాపులన్నీ పెట్టేసారట.అన్నా వాళ్ళు, “ఒకసారి వెళ్ళి చూసి వద్దాం, రేపు ఏం కొనుక్కోవాలో డిసైడ్ చేస్కుందాం”, అని అన్నారు.సరేలే వచ్చాక చదువుకోవచ్చు అని వెళ్ళాను.

Sri Rama Pattabhishekamఅబ్బో గుడి చుట్టూరా చిన్ని చిన్ని దుకాణాలు పెట్టేసారు.బొమ్మలూ,బెలూన్లు,ఐస్ క్రీం,బాదం పాలూ, ఇలా చాలారకాల దుకాణాలు వున్నాయ్.ఈ సారి కొత్త కొత్త బొమ్మలు చాలా వచ్చాయ్.అన్నిటికన్నా నాకు బైనాకులర్స్ చాలా నచ్చింది.కళ్ళకి పెట్టుకుంటే అన్నీ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి.ఇంకో రూపాయ్ ఇస్తే నెగిటివ్స్ కూడా ఇస్తాడు, వాటిని అందుట్లో పెడ్తే సినిమా పోస్టర్లు కనిపిస్తాయ్.చాలా బాగుంది.ఎలాగైనా ఈ సారి దీన్ని కొనేయ్యాలి.ఇంకా రంగునీళ్ళు వున్న గాజు ట్యూబులు,ఈ సారి కొత్త గా వచ్చిన వాటర్ బెలూన్లు, పెప్సీ పిక్నిక్ సెట్ బుడుగులు ఇలా చాలా పెద్ద లిస్టు తయారుచేసుకున్నాం.అన్నా వాళ్ళు బ్యాటూ,బాలు కొందాం అనుకున్నారు.ఏంటో ఈ అబ్బాయిలకి ఎప్పుడూ బ్యాట్లు,బాలు తప్పించి ఇంకేమి వుండవు.మాకైతే చక్కగా ఎన్ని బొమ్మలో…హమయ్య నేను అమ్మాయిని కాబట్టి సరిపోయింది.ఎంచక్కా గౌన్లు,పట్టు పావడాలు,పరికిణీలు, చీరలు,నగలు,జడలు అబ్బా….అబ్బాయిలైతే ఏముంది అయితే నిక్కర్లు,లేకపోతే ప్యాంట్లు.Bapu Bommalu 6114

ఇంక ఇంటికొచ్చి కాసేపు చదువుకుందామని పుస్తకాలు తెరిచాను.పుస్తకం నిండా గుడి దగ్గర చూసిన బొమ్మలే కనిపిస్తున్నాయ్.అలా అరగంట కూర్చుని రేపటి గురించి ప్లాన్ వేస్కునేసరికి నేను తెగ చదివి అలసిపోయానని అమ్మ నాకు బువ్వపెట్టి బజ్జోపెట్టేసింది.

359“సీతారాముల కళ్యాణం చూతము రారండి”, గుడి స్పీకర్ లోంచి వస్తున్న పాటకి మెలకువ వచ్చింది.అమ్మ గబ గబ నాకు స్నానం చేయించి ఎండాకాలం కదా అని కొత్తగా కుట్టించిన కాటన్ ఫ్రాకు వేసి రెడీ చేసింది.నన్ను మా నాన్నకి అప్పగించి తను పక్కింటి ఆంటి తో పెళ్ళికి వెళ్ళింది.నాన్న నన్ను తీస్కుని, పెళ్ళి చివర్లో వస్తాలే అని చెప్పాడు.అమ్మ వెళ్ళాక చింటూ అన్న వచ్చాడు, గుడి దగ్గరికి వెళ్దాం అని.నాన్న నాకు పది రూపాయలు ఇచ్చాడు.అమ్మో పదిరూపాయలే జాగ్రత్తగా చూసుకోవాలి.ఒక గంటలో వచ్చెయ్యమని చెప్పి పంపించాడు.మేము ప్రియ అన్న వాళ్ళింటికి వెళ్ళి అక్కడినుండి అంతా కలిసి గుడి దగ్గరికి వెళ్ళాము.నిన్న చూసిన బైనాకులర్సు,ఒక చిన్ని పాప బొమ్మా, రెండు బెలూన్లు కొనుక్కున్నాను.అన్నా వాళ్ళు ఒకరు బ్యాటూ ఒకరు బాలూ కొని చెరి రెండు బెలూన్లు కొనుక్కున్నారు.

తర్వాత నిన్నలేని కొత్త షాపులు అన్నీ మళ్ళి ఒకసారి చూసి వచ్చాము.బాదం ఇసుక్రిం కొనుక్కుని తిన్నాం.భలే రుచిగా వుంది.ఐసు క్రీం కోసమైనా ఈ ఎండాకాలం ఎండలు భరించాలనిపిస్తుంది. ఇంకా ఒక రూపాయ్ మిగిలింది దాంతో సాయంత్రం ఇంకో ఐస్ క్రీం తిందామని దాచుకున్నాను.untitled

అన్నా వాళ్ళు నన్ను ఇంట్లో దింపేసి వెళ్లారు.నాన్నకి నా బొమ్మలన్నీ చూపించాను.కాసేపు అయ్యాక గుడికి వెళ్ళాం.ఎంత మంది వచ్చారో.మేము బొమ్మలతో ఆడుకున్నట్లు చిన్నిచిన్ని బొమ్మ దేవుళ్ళకి పెళ్ళి చేస్తున్నారు.నాకేమో కనిపించట్లేదు అప్పటికీ నాన్న నన్ను ఎత్తుకుని నిల్చున్నాడు. కాసేపు చూసాను,ఆ పూజారి మాట్లాడుతూనే వున్నాడు.”ఇంకా ఎంతసేపు నాన్నా తొందరగా పెళ్ళి చేసుకోమను దేవుణ్ణి “,అంటే అందరూ ఉష్ అంటూ చెంపలు వేస్కోమన్నారు.

SITA PARANIకాసేపు నా గోల భరించి ఇక  వల్ల కాక మా అమ్మని ఆ గుంపులో వెతికి పట్టుకుని అందరి కాళ్ళు తొక్కి,తిట్టించుకుని ఎలాగో మా అమ్మ ఒల్లో నన్ను కూలేసి నాన్న వెళ్ళిపోయాడు.చెమటలు కారిపోతున్నాయ్ బాబోయ్, తొందరగా  పెళ్ళి చేస్కోడేంటి ఈ దేవుడు.ఐనా ఎండా కాలం లో ఎందుకు చేస్కోవాలనిపించిందో ఈయనకి, అనుకుంటూ ఉన్నానా… ఇంతలో నాకు నిద్రపట్టేసింది.ఒక్కసారిగా పెద్దగా చప్పుళ్ళు వినిపించడంతో ఉలిక్కిపడ్డాను, అందరూ బియ్యం చల్లుతున్నారు దేవుడిపైన,నా మీద కూడా పడ్డాయ్.దేవుడ్నిచూపించి దండం పెట్టుకోమంది అమ్మ,కనిపిస్తే గా అసలు.నాన్న దగ్గర వున్నా బాగుండేది, భుజాలమీద ఎత్తుకుని చూపించేవాడు.వడపప్పు,పానకం ప్రసాదం పెట్టారు.నాకు వద్దంటే అమ్మఅస్సలు వినలేదు.ఎండాకాలంలో చాలా మంచివట, ఎండదెబ్బ తగలకుండా ఉంటుందని బలవంతంగా తాగించింది.vadapappu-paanakam

36-631x450తర్వాత ఇంటికి వచ్చాక బువ్వ తినేసి చదువుకున్దామంటే నాన్న టి.వీలో సినిమా పెట్టాడు.రామాయణం సినిమా …చూస్తుంటే చూడాలనిపించింది.అబ్బ ఎంత బాగున్నారో రాజులూ రాణులూ.పెళ్ళి ఎంత బాగా చేసారో.పోనిలే ఇక్కడన్నా చూసాను సరిగ్గా ….గుళ్ళో కంటే బాగా.సీత ఎంత బాగుందనుకున్నారు..రాముడి పక్కన ఉంటే ఇంకా చాలా బాగుంది.ఎంత బాగుందంటే అంత బాగున్నదన్నమాట.ఇహ అంతకన్నా నేచెప్పలేను బాబూ.పాపం రాముడు సీతా అడవికి వెళ్ళిపోయారు.తర్వాత హనుమంతుడు వాళ్ళని కలిపాడు.ఎంత బలమో తెలుసా హనుమంతుడికి,ఐనా రాముడు ఎంత చెప్తే అంత ఆయనకి.రావణాసురుడు విలన్ అన్నమాట, చాలా చెడ్డవాడు.చాలా బాగుంది సినిమా.పాపం రాముడికి,సీతకి ఎన్ని కష్టాలో తెలుసా…ఐనా కూడా ఎప్పుడూ కోపం రాలేదు వాళ్ళకి…ఎంత మంచివాళో పాపం..మంచివాడు కాబట్టే రావణుడికి  పది తలలు వున్నా ఈజీగా చంపేసాడు…నాన్న చెప్పాడు, మొదట్లో కష్టాలు పడినా కూడా చివరాఖరులో మంచే గెలుస్తుందట…చెడ్డ వాళ్ళు మొదట్లో సుఖపడినట్లు ఉన్నా చివర్లో ఓడిపోతారట…చెడుపై ఎప్పుడూ గెలుపు మంచికేనట.ఓహో ఇందుకన్న మాట రాముడిని అందరూ దేవుడనేది.ASOKAVANAM

CHUDAMANIఇంతలో సాయంత్రం అయిపోయింది.అమ్మ గుర్తుచేసింది లెక్కల గురించి అంతే మళ్ళి జ్వరం ఒచ్చేసింది.అయ్యబాబోయ్ ఒక రోజు సెలవొచ్చినా కూడా ఎక్కువ ఏమి చదవలేదు.ఆ పక్క బొమ్మలన్నీ ఊరిస్తున్నాయ్.పోనిలే ఇంకో మూడు పరీక్షలు రాసేస్తే పనైపోతుంది.ఎంచక్కా అన్నీ సెలవులే అప్పుడు, చక్కగా ఆడుకోవచ్చు.Bazaar_art_print,_c.1910's

ఇప్పుడు ఇంక చదువుకోవాలి..మరి ఉంటాను.అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలుSita-Rama-Kalyanam

 

రాగి చెంబు….

hamptonpotsఅమెరికా ప్రయాణానికి సామాన్లు సర్దటం అంటే  పి.హెచ్.డి కి థీసిస్ ప్రిపేర్ చేసినంత పనితో సమానం. ఎన్నిపెట్టుకున్నాఇంకాఎదో ఒకటి మర్చిపోయామనే వుంటుంది.కనిపించిన ప్రతి వస్తువు బ్యాగులోదూర్చెయ్యాలి అనిపిస్తుంది.వీలైతే ఇక్కడ వున్నఇల్లుని మొత్తం ప్యాక్ చేసేసి వెంట తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది.కానిఎం చేస్తాం. సర్దిన వాటిని మళ్ళి మళ్ళి సర్ది ఫైనల్ గా బరువు చూస్కుని ఇంకెక్కడన్నా కాస్త ఖాళీవుంటే అందులోకొన్నికుక్కి ఎలాగో అలా సామాను సర్దుకున్నాం.అమ్మఇంత హడావిడిలోకూడా రాగి చెంబు సర్దడం మరిచి పోలేదు .అమెరికా వెళ్తూ కూడా రాగి చెంబు ఎందుకె? అంటే వినదు.రొజూ రాత్రి రాగిచెంబులో నీళ్ళు ఉంచుకుని పొద్దునే లేచి తాగమని చెప్పింది.పెద్దవాళ్ళు చెప్తే మనకన్ని నస రామాయణం అని అనిపిస్తుంటుంది.సరేలేఅమ్మని బాధపెట్టడం ఎందుకని తెచ్చుకున్నాను.కాని ఎప్పుడూ దాన్నివాడిందిలేదు.

ఈమధ్య ఆన్ లైన్ లో ఒక ఆర్టికల్ చదవడం జరిగింది.ప్రస్తుతం జనరేషన్ కి వున్నఅనారోగ్య సమస్యల గురించీ,ఈ రోజుల్లో మన డైలీలైఫ్ ని మన పెద్దల డైలీలైఫ్ తో పోల్చి ,కొన్నిసలహాలు,సూచనలూ చెప్పారు.అందులో రాగి పాత్రల గురించి, వాటి మెడికల్ వాల్యూస్ గురించి చెప్పారు.అది చదివాక రాగి పాత్రల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.

9745mixing_bowlsరాగి పాత్రలు:

రాగి కి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుందట.రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు.కాబట్టి ఇందులో వున్నపధార్దాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.

మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం.రాగి పాత్రలలో నీళ్ళు కనుక ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు.అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు.మనం ఎప్పుడైనా ఎక్కడైనా నదిని దాటేటప్పుడు అందులో నాణేలు వేస్తుంటాము , గుర్తుందా.ఎందుకోతెలుసా?

పాతకాలం లో ప్రజలకి నీళ్ళు కావాలంటే ఆధారం నదులే.అప్పట్లో రాగినాణేలు వాడేవాళ్ళు.ఇలా నదిలో రాగి నాణేలు వేసినప్పుడు  నీరు శుద్ధి చెంది మనుషులకి మేలు కలుగుతుందని పెద్దల ఆలోచన.ఆ అలవాటు ప్రకారమే ఇప్పటికీ ఏదైనా నది దాటుతుంటే మనం అందులో నాణేలు వేస్తుంటాము.

గంగాజలాన్నిచిన్న చిన్నరాగి చెంబుల్లోఅమ్ముతుంటారు.రాగి పాత్రలలో నీరు ఎక్కువ రోజులు చెడకుండా ఉంటాయని అలా చేస్తారంట.

చెవులు కుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలకి కొన్నిచోట్ల మొదటిసారి రాగి తీగలు చుడుతారు.పుండుపడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటిబ్యాక్టిరియల్ లక్షణం దీనికి కారణం.

రాగి చెంబులో నీళ్ళు:

BOILERమనకి నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగి తో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు అప్పట్లో.ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడినది.

రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలాచాలా మంచిదని చెప్పారు.అలా తాగితే కడుపులో వున్నచెడు అంతా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుందని చెప్పారు.ఈ అలవాటు వల్ల గ్యాస్ ప్రాబ్లెమ్స్,కిడ్నీప్రాబ్లంస్, లివర్ ప్రొబ్లెంస్ కూడా తగ్గిపోతాయని చెప్పారు.145

బ్రిటిష్ కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్లు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు కూడా.

ఏ విషయం కూడా తన దాకా వస్తే కానీ మనిషికి విలువ తెలియదు అంటుంటారు.ఇది నూటికి నూరుపాళ్ళు కరెక్టు.పెద్దవాళ్ళుఎన్నోవిషయాలు చెప్తుంటారు అవన్నీనాన్సెన్స్, చాదస్తం,మూఢనమ్మకాలు, అని చెప్పుకుని మనం అంతగా పట్టించుకోము.కాకపోతే ఎంతో అడ్వాన్సుడు జనరేషన్ అని చెప్పుకునే మనం ఆరోగ్యం విషయంలో చాలా వెనుకబడి వున్నాము.ఈ రోజుల్లో సగటున ప్రతి ఇంటికి వచ్చే మెడికల్  బిల్లులు చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.

ఇన్నిచదివి కూడా అమ్మ చెప్పిన మాట వినకపొతే ఫూల్ అయ్యేది నేనే అనుకుని వెంటనే రాగిచెంబుని బయటికితీసాను.మీరుకూడా ఈ పద్ధతిని  ఫాలో అవ్వండి.ఎందుకంటే శరీరాన్ని ప్రేమించకలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం.