మన   తెలుగు వారి సీతమ్మ ఇక లేదు . ఈ వార్త తెలిసి బాధ వేసింది . తెలుగు వారందరికీ గుర్తుండిపోయే ఒక మంచి నటి . భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పడానికి వున్న  కొన్ని ఆణిముత్యాల   వంటి సినిమాలలో నటించిన,నిర్మించిన గొప్ప కళాకారిణి , అంజలీ దేవి.                                                                                                                                                                       స్త్రీ శక్తి కి ఒక గొప్ప ఉదాహరణ ఆమె . ఎందుకంటారా ,1930 ల లో ఆడవాళ్ళు బయటికి రావడమే పెద్ద తప్పని భావించే   రోజుల్లో నే తన ప్రతిభకు తగిన రంగాన్ని ఎంచుకుని ,అందులో రాణించింది . పురుషాధిక్యమున్న రంగం లో ఉన్నత స్థానం లో నిలచిన ధీశాలి .
భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడైతే ఎంతటి విజయాలనైనా సాదించగలరని తెలియజెప్పారు . ఆవిడ సినీరంగం లోకి వచ్చే నాటికే ఒక బిడ్డ కి తల్లి .ఈ కాలం లో కనీసం ఊహ కి కుడా అందని విషయం అది . అయినప్పటికీ తన భర్త ప్రోత్సాహం తో రాణించి తనని తక్కువగా చూసినవారి దగ్గరె మెప్పుపొందారు  . నిర్మాత గా మారి అంజలి పిక్చర్సు బ్యానరు పై ఎన్నో ఘన విజయాల్ని అందుకున్నారు  ,  కళాకారిణిగా మూస పాత్రలకి పరిమితమైపోకుండా అన్ని రకాల పాత్రలకి పరిపూర్న న్యాయం చేకూర్చిన   అభినేత్రి .
 చిన్నప్పుడు ఆమె నాకు తెలిసిన మొదటి దేవ కన్య . నేను చదివే చందమామ కధలలోని మనిషిలా  అనిపించేది . అన్నిటికన్నా చెట్టులెక్క గలవా ఓ నరహరి అని ఆమె ఆడీ  పాడిన పాటను తెలుగు వారు ఎలా మరచిపోగలరు . మన పిల్లలకి కుడా తప్పక చూపించవలసిన పాట అది. ఇంకా సువర్ణ సుందరి ,అనార్కలి ,సంఘం,పల్లెటూరి పిల్ల ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి మెప్పించారు .
సినిమాకి సంభందించిన అన్ని విభాగాలలోనూ మంచి పట్టు ఉన్న ప్రతిభావంతురాలు . ఎన్ని చెప్పుకున్నా ఆవిడ చేసిన లవకుశ గురించి చెప్పుకోకపోతే పెద్ద తప్పవుతుంది . వెండి తేర పై సీతమ్మ పాత్ర కి ప్రాణ ప్రతిష్ట చేసారు . ఆవిడ చేసిన ఆ పాత్ర చూసి కంట తడి పెట్టని వారుండరంటే నమ్మండి .

చివరిగా భగవంతుడు ఇచ్చిన జీవితానికి పూర్తి న్యాయం చేసి , చరిత్ర లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ,ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఈ తరం వారికి అందజేసి , స్వర్గస్థులైన అంజలీ దేవి గారికి
కళాభివందనాలతో వీడ్కోలు తెలియజేద్దాం …..

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *