చిన్నపటినుండి దేవుడంటే నాకు చాలా ఇష్టమండి . తెలిసీ తెలీని వయసులో దేవుడు అంటే ఎవరమ్మా అని అమ్మని అడిగినప్పుడు, “నీకు నేను నాన్న ఎలాగో మనందరికీ, అంటే భూమ్మీద ఉన్న అందరికి దేవుడు అలాగన్న మాట” , అని మా అమ్మ చెప్పినప్పటినుండి ఇష్టం . ఇష్టం ఇంకా భయం కాలేదండి . అదేంటి అనుకుంటున్నారా ,చెప్తా చెప్తా ,……. మనం ఎప్పుడైనా మన కిష్టమైన వాళ్ళ దగ్గర ఎందుకు భయపడతాం , ఏదైనా తప్పు చేసినప్పుడు,లేదా పాపం చెసినప్పుదు. కాబట్టి మనిషిగా అయన అంటే భయం లేదు అన్నమాట . ఉన్దకూడదు అని నా కోరిక.
ఇంత ఇష్టపడే దేవుడి మీద నాకు ఒకసారి కోపమో , బాధో లేక చికాకో తెలీని ఫీలింగ్ కలిగింది . ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే అమ్మకి చెప్తే గుంజిళ్ళు తీయించి గట్టిగా నా దగ్గరే నా చెంపలు వాయిన్పించింది . అనుమానం వస్తే తీర్చుకోవాలి కదండీ మరీ , దేవుడికి కోపం వస్తుందని అనుమానానికి తెలీదుకదండి .
ఇంతకీ ఎం జరిగిందంటే ………….. మా అమ్మ, వాళ్ళ ఫ్రెండు గోదారి గట్టున వుండే దేవుడి దగ్గరికి వెళ్దాం అన్నారు . వంశీ గారి సినిమాలు ,అయన రాసిన పసలపూడి కధలు ,గోదారి కధలు చదివిన నాకు ఎప్పటినుండో ఆ గోదారి అందాలు చూడాలని ఆశ . వస్తావా అని అడగడం పూర్తి కాకుండానే వస్తానని తల ఆడించేసా . ఎంత ఆనందంగా అన్పించిందంటే చెప్పలేను . గోదారి కోసమే స్టార్ట్ అయ్యాను .
బస్సులో ప్రయాణం . వర్షాకాలం బాగా వర్షాల వల్ల పంట చేలు చాల బాగున్నాయి . పచ్చదనాన్ని చూస్తే కళ్ళకి మనస్సుకి ఎంతో మంచిదని పేపర్ లో చదివాను అది 100% కరెక్ట్ అన్పించింది . ఆఫీసు లో పనిచేసే వాళ్ళకి ఇది చిట్కా. కళ్ళు స్ట్రైన్ అయితే కాసీపు అలా నేచర్ ని చుడండి కొంచం రిలీఫ్ గా అన్పిస్తుంది… హూ … కొద్ది దూరం వెళ్ళాక అన్నీ కాటన్ తోటలు . పచ్చటి చెట్లకి మంచు పువ్వులు కాసినట్లుగా ఉన్నాయ్ ….. ఎంత బాగున్నాయో … ఇప్పటికీ తలచుకుంటే గుర్తే ….
తర్వాత గుడి ఉన్న ఊరు చేరుకున్నాం … ముందు గోదాట్లో స్నానం అన్నారు ….. వెళ్ళాను …. మరీ లోతు లేదు కాని మంచి ఫ్లో లో ఉన్ది… గోదారి చూడగానే భలే సంతోషమేసింది ….. ఎవరో పాత స్నేహితురాలిని చూసినట్లు …. అలా ఎంత ఆడానో …. అమ్మ ఇక రావే నువ్వొచిన్ది దేవుడి కోసమా లేక గోదారి కోసమా అంటే గోదారి కోసమే అన్నాను . చెంపలు వాయించుకోమంది … నేనేం తప్పు చెప్పాను ??
ఇక్కడ మొదలు నా డౌట్లు …. నేను చెప్పింది నిజమే కదా మరి దేవుడికి ఎందుకు కోపం వస్తుంది ???????ఎం చేస్తాను భానుప్రియ లాగా అర్ధం చెస్కొరూ ……………. అని సాగాదీస్కుంటూ గుడికి వచ్చాను . గుడి అంటే కూడా మనకి ఇష్టం అన్నింటికనా పులిహోర ఇంకానూ ….. అదేంటోనండి ఎవరు ఎంత అద్భుతంగా చేసిన అది ప్రసాదంగా ఇచ్చే పులిహోరంత బాగోదు …. అవునంటారా కాదా ………….
ఇలా ఉండగా దణ్ణం పెట్టుకుని దేవుడిని చూస్తున్నాను ,ఏదైనా కోరుకో మంటుంది అమ్మ ,సర్లే అని దణ్ణం పెట్టుకుని అన్న్నీ చూస్తున్నా , అమ్మ సీరియస్ గా ఏదో అప్లికేషన్ పెడ్తోంది దేవుడికి .
అప్పుడు జరిగిందండి ఆ సీను …. ఒకాయన వచ్చాడు ఫామిలీ తో …సఫారీ సూటు లో …. బాగా పేరు ఉన్నదేమో పూజా రి గారు ఎదురెల్లి స్పెషల్ గ తీస్కేల్లారు … నేనేమి అనుకోలేదు అది కామన్ దేశంలో అని… వచ్చిన అతను చాలా పెద్దపెద్ద మంత్రాలు చదివించాడు పూజారి గారి దగ్గర …. అంతా ప్రోటోకాల్ ట్రీట్మెంట్ అన్నమాట ….
ఇంతలో ఇంకొకళ్ళు వచ్చారు అది పల్లెటూరు , చాల సాదా గ ఉన్నారు ,అతను అతని భార్య ఇద్దరు పిల్లలు , పెద్దగ చదువుకున్నట్లు లేరని తెలుస్తోంది …. కాని వాళ్ళ కళ్ళ లో దేవుడిని చూసినప్పుదు కలిగిన ఆనందం ,తృప్తి అమాయకమైన నమ్మకం ,భక్తి ….. భలే ముచ్చటేసింది ….
కానీ వాళ్ళు చాలా సేపు ఎదురుచుసారు పూజారి దగ్గరకు రాలేదు … ఇతను పిలవడానికి భయపడుతున్నాడు ,… మేము కొంచం ముందు లైన్ లో ఉన్నాము మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు … అతను తీర్థం అడిగితే తర్వాత అని సైగ చేసాడు అతను కాసేపు చూసి వెళ్ళిపోయాడు …. ఎమీ తీస్కోకుండా …. ఆ క్షణం నాకు ఎంత భాద వేసిందంటే ….. చెప్పలేను …. అక్కడ ఎక్కువమంది వున్నారా అంటే అది కూడా కాదు . మేం , ఆ సఫారీ అయన అండ్ కో ఇంకా ఈ అబ్బాయ్ వాళ్ళ ఫామిలీ అంతే ….
కానీ ఎందుకు ఆ తేడా …. చాల భాదేసింది ….. దేవుడు అందరకి ఒక్కడే కదా??????
దక్షిణ ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా చూస్తాడా ????
అమ్మ దగ్గరికి పిల్లలు వస్తే బాగా ఉన్న బిడ్డకి పలావు పెట్టి , ఎమీ లేని బిడ్డకి చారన్నం పెడ్తుందా ????అలా చేస్తే తనసలు అమ్మ ఎలా అవుతుంది ????
అమ్మే అలా ఉండలేనప్పుడు .. అమ్మనే చూసుకునే దేవుడు ఎలా తేడా చూపగలడు????
అంటే ఇక్కడ ఉన్నది మనుషులని చేసిన దేవుడా లేక మనిషి చేసిన దేవుడా ????????ఇలా ఎన్ని ప్రశ్న లో నన్ను కన్ఫ్యూజ్ చేసాయి …
అమ్మని అడిగితే చెంపలు ఎర్రబదేలాగా వాయించుకోమని ఆర్డర్ పాస్ చేసింది …. ఏంటో ఎవరికీ చెప్పలేను …. అడగలేను…
ప్లీజ్ మీరైనా అర్ధం చెస్కోరూ … ఒకవేళ తప్పనిపిస్తే వదిలెయ్యండి …. ఎందుకంటే …
మళ్ళీ చెంపలు వాయించుకుని గుంజిళ్ళు తీసే ఓపిక నాకు లేదు కాబట్టి …..
వచేటప్పుడు దూది లాగా తేలిగ్గా వున్న మనసు గోదాట్లో మున్చినట్లు బరువుగా అనిపించిన్ది….
వుంటాను ….బై
Leave a Reply