సాయంకాలం కబుర్లు
  • my blog…
సాయంకాలం కబుర్లు 4

నేడే చూడండి….

By Srinidhi Yellala · On February 5, 2014

07slide11నేడే చూడండి బాబూ….ఈ ఒక్క మాట చాలు సినిమా బండి లో….అప్పట్లో ఒక సినిమా ప్రజల్లో కి దూసుకెల్లడానికి..ఒక వస్తువు తయారుచెయ్యడం,కనుక్కోవడం గొప్పకాదు..దాన్నిజనాల్లోకి తీసుకెళ్లడం గొప్ప…అదే పబ్లిసిటీ …ఇప్పుడైతే మనకి ప్రపంచం మన చూపుడు వేలు కిందకి వచేసిన్దనుకోండి(అదేనండి టచ్ స్క్రీన్ సిస్టంకదా)…కానీ ఇవన్నీ లేకముందు ఎలా చేసేవారు …ముందైతే మనుషుల్ని పెట్టి చెప్పించేవారు…తరవాత పేపర్ లో ప్రకటనలు…తరవాత రేడియో విప్లవం….తరవాత టీవీ ల విజ్రుంభన..తర్వాత ఇంటర్నెట్ ప్రభంజనం… ఈ మెయిలు…ఫేసుబుక్కు, ట్విటర్…ఇలా ఇప్పటి వాళ్ళకైతే ఎన్నో సాధనాలు..ఒక విషయం చెప్పాలి, అని పక్కింటికి వెళ్ళేలోపు…సప్తసముద్రాల అవతల అమెరికాలో వున్న వాళ్ళకి కూడా వార్త  వెళ్ళిపోతుంది…అవునా?

ఒక్క సారి ఈ ప్రకటనల చరిత్ర కొంచెం చూద్దామా….అసలు ఇవి ఎందుకు గుర్తోచాయంటే మొన్నామధ్య పాత చందమామ పుస్తకం చదువుతుంటే దాంట్లో ఒక ప్రకటన చూసాను భలే త్రిలింగ్ గా అనిపించింది…లక్స్ యాడ్ అది..దాంట్లో గోప్పెంటి? అనుకుంటున్నారా…ఇప్పటి లక్స్ తారలు కాదు , అందులో వున్న స్టార్ ఎవరో తెలుసా?…. అమావాస్య ఎరుగని చందమామ లాగా అందంగా నవ్వే మన సావిత్రి గారు…తర్వాత కొన్ని వివరాలు గూగుల్ మాత ని అడిగితే తెలిసింది లక్స్ సబ్బు వంశపారపర్యం గా ఎప్పటినుంచో సినీ స్టార్స్ ని తమ ప్రకటనలకి పెట్టుకునేదిట…

cFyScటాలివుడ్,బాలివుడ్..ఏ వుడ్లో  వుండే స్టార్ ఐనా లక్స్ యాడ్ లో నటించడం ఒక ప్రెస్టేజ్ లాగా చెప్పుకునేవారట…అంటే  నా సౌందర్య రహస్యం లక్స్ అని కైపు గా మనకి కత్రినా చెప్పినట్టు..మన అమ్మమ్మ కి సావిత్రి….పెద్దమ్మకి జయప్రదా….అమ్మకి శ్రీ దేవి….అక్కకి మాధురి దీక్షిత్ చెప్పారన్నమాట….తమాషాగావుంది కదూ..మన పిల్లలకి …మనవరాళ్ళకి కి కూడా ,అందరికీ తెలిసిన ఈ రహస్యం చెప్పడానికి ఇంకో తరం వారు రెడీగా ఉన్నారేమో…భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదే కాబోలు….

 

old-lux-ad-posters-10old-lux-ad-posters-11

అప్పటి సినిమా పోస్టర్లు…బిస్కెట్లూ చాక్లెట్లు…మందులూ ఇలా చాలా ప్రకటనలు ఉన్నాయ్….తమాషాగా ఉన్నాయ్ అవన్నీ…నేడే చూడండి…తప్పకవాడండి…మీ ఆరోగ్య రహస్యం…ఇలా చక్కటి తెలుగు తో ప్రతి వాళ్ళకి అర్ధం అయ్యేలా భలే ఉన్నాయ్…       196465,xcitefun-india-old-ads-1Dreamflower_Pond's _old_ad

indexఅన్నిటి కన్నానాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే మిస్సమ్మ సినిమా పోస్టరు…దాంట్లో ఎం రాసుందో తెలుసా “తప్పక చూడండి మీ అభిమాన నటులు నటించిన గోప్ప శృంగార చిత్రం “ అని…మిస్సమ్మ లాంటి క్లాసిక్ పిక్చరుని శృంగార చిత్రం అంటే, ఇహ ఇప్పటి సినిమాలని ఏమంటారో??

ఎంతైనా పాత పడే కొద్దీ కొన్ని విషయాలు భలే బాగుంటాయ్..పాత పుస్తకంలో దొరికినన రూపాయ్ నోటు లాగా…బామ్మ ట్రంకు పెట్టె లో దొరికిన కంచి పట్టు చీర లాగా…కొన్ని పాత విషయాలు మనల్ని ఉన్నపళాన టైం మిషన్ ఎక్కించి ఎక్కడికో తీస్కేల్లిపోతుంటాయ్..

gemsbond2Telugu_film_poster_C.I.D.

పేపర్ ల వరకు అంటే నాకది చరిత్ర ,అంటే గతం …ఎందుకంటే నేను టీవీ యుగం కి చెందినదాన్నిఅనమాట….అప్పుడప్పుడూ నాకు వింత ఆలోచనలు వస్తుంటాయ్….త్రేతాయుగం, ద్వాపరయుగం లాగా…ముందుముందు పేపర్ యుగం…టీవీ యుగం…ఈమెయిల్ యుగం…ఫేస్బుక్ యుగం వస్తాయేమో అని…..చెప్పలేం.

Doordarshanఇహ పోతే నా యుగం గురించి చెప్పాలంటే మాకదో అద్భుతాల పెట్టి.అందులో వచ్చే ప్రకటనలు ఒక విప్లవం సృష్టించయనే చెప్పొచు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన నిర్మా యాడు…వాషింగ్ పవ్దర్ నిర్మా…పాట రాని వాళ్ళు ఉంటారా మీరె చెప్పండి…నాకింకా గుర్తు, బాగా నురుగ వచ్చేలా చేసి నేను ఆ పాటపాడితే, చివరగా మా అమ్మ ఆ నురగ ని నా ముక్కుకి రాయాలనమాట..అదో ఆట నాకు..nirma-girl

ఆదివారం అయితే చక్కగా ఈ య్యాడ్ల పాటలతో నే అంతాక్షరి అని ఇంకా సంతూర్ ఆట అని ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం….ఐ లవ్యూ రస్నా అని రస్నాతాగాక అనడం…ఏమైంది? అంటే పాప ఏడ్చింది అని అనడం …హార్లిక్స్ ని కావాలని తినేసి నేను హార్లిక్స్ తాగను, తింటాను అనడం…తలచుకుంటే భలే నవ్వొస్తుంది….1047400011_1bc118ad0b

దూరదర్శన్లో శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం హోం వర్కు త్వరగా చేసెయ్యడం …ఆదివారం సాయంత్రం  4గంటలకి వచ్చేసినిమా గురించి పొద్దున్నించి ఎదురు చూడడం …అన్నయ్యకి ప్యాంటు మీద చెడ్డి వేసి టవల్ మెడకి చుట్టి శక్తిమాన్ చెయ్యడం…..అన్నీ స్వీట్ మెమోరీస్….అమాయకమైన రోజులు.

పల్లెల్లో అయితే ఆదివారం టీవీ ఉన్నవాళ్ళ ఇల్లు మినీ ధియేటర్ అయిపోయేది.

lifebuoy -oldcadbury_52

మొత్తానికి టీవీ, టీవీ లో వచ్చేయాడ్లు కూడా  1980-90s  పిల్లలపై చాలా ప్రభావమే చుపించాయ్ అని చెప్పొచు.

ఇప్పటి జనరేషన్ ఫాస్ట్ అని పేరెంట్స్ అంటుంటారు కానీ…ఒకోసారి వీళ్ళు అమాయకత్వం లో వుండే సంతోషాలని, ఆనందాలని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది….బహుశా ఏది వెతక్కుండా, కష్టపడకుండా అన్ని చేతికి అందడం వల్లేమో…

ఏమో ఏమి చెప్పలేం..ఎందుకంటే ఈ జెనరేషన్ వాళ్ళు వాళ్ళ జూనియర్సుని చూసి మనలాగే అనుకుంటారేమో…చెప్పాను కదా భూమి గుండ్రంగా ఉంటుందని.

మీ చిన్ననాటి సంగతులు మీచిన్నారులతో పంచుకోండి…ఒకసారి మీ పాతరోజులు మీకు గుర్తొస్తాయి..వాళ్ళకి కూడా కాస్త కాలాన్ని విశ్లేషణ చెయ్యడం వస్తుంది…

Use Facebook to Comment on this Post

savithritelugu film posterstv ads
Share Tweet

Srinidhi Yellala

You Might Also Like

  • సాయంకాలం కబుర్లు

    ఆనందో బ్రహ్మ

  • సాయంకాలం కబుర్లు

    Political satire

  • సాయంకాలం కబుర్లు

    ఆలోచనలు …

4 Comments

  • Bukya Sridhar says: March 30, 2014 at 11:51 am

    శ్రీనిధి గారు,
    జస్ట్ ఇప్పుడే మీరు రచించిన ‘నేడే చూడండి’ టపా చదివాను ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నన్ను నేనే నా చిన్నతనానికి వెళ్లి వచ్చినట్టనిపించింది. మీరన్నట్టుగా ఆ రోజులే వేరు. 1990 కాలం లో మా నాన్న దగ్గర బుల్లి రేడియో ఉండేది, అప్పుడు నాకు ఐదేళ్ళు, పాటలు, యాడ్ లు చక్కగా వినేవాడినట. ఇక నేను టీవీ ని చూసింది 1991 లో బ్లాకు అండ్ వైట్ (ఒప్టోనికా ఇప్పుడది షార్ప్ అయ్యింది), కలర్ టీవీ ని 1996 లో మొట్టమొదట చూసాను, కంప్యూటర్ ను 1998 లో DOS విండోస్ 98 ఉన్న PC ని 1999 లో.. ఇంటర్నెట్ అంటే ఏమిటో కూడా తెలియదు నాకు 2002 వరకు.

    ఇలా మీ టపా ద్వారా గతం లోని కొన్ని కబుర్లు తెప్పించినారు. నాకు పదేల్లున్నప్పుడు మీరన్నట్టు మధురి దిక్షిత్ ఉన్నారు లక్స్ యడ్ కు.

    Reply
  • వేంపల్లె షరీఫ్ says: May 17, 2014 at 11:47 am

    చాలా మంచి వ్యాసం.. అభినందనలు.

    Reply
  • Shiva says: September 7, 2014 at 1:52 pm

    Super madam garu malli nannu gatham lo ki pamparu

    Reply
    • Srinidhi Yellala says: September 7, 2014 at 9:13 pm

      thank you siva gaaru

      Reply

    Leave a reply Cancel reply

    Categories

    • activity corner
    • Uncategorized
    • ఎందరో మహానుభావులు ..
    • కధలు
    • మన పండుగలు
    • సరదా కబుర్లు
    • సాయంకాలం కబుర్లు

    Tags

    akkineni ANR dasara bullodu india nirbhaya pelli poola jada rahul baba republic day savithri telangana telugu film posters telugujokes tv ads
    • my blog…
    ఉత్తమ తెలుగు బ్లాగులు - బ్లాగిల్లు | Top Telugu Blogs
    మాలిక: Telugu Blogs


    కూడలి

    Blaagulokam logo