సాయంకాలం కబుర్లు
  • my blog…
activity corner 2

ఇండియా విల్ గో ఆన్…

By Srinidhi Yellala · On March 6, 2014

lkoఈ మధ్య రాష్రంలో ఇంకా దేశంలో , రాజకీయ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  చాలా బాధగా, భయంగా, బెంగగా అనిపిస్తోంది.నలుగురు ఒకచోట కలిస్తే ఎక్కడ చూసినా,వీటి గురించి చర్చలే .చివరికి ఆడవాళ్ళు కలిసినా కూడా పిల్లలు, వంటలు, పూల మొక్కలు, మొగలి రేకులు  అని కాకుండా రాష్ట్ర పరిస్థితుల గురించి, దేశం గురించి మాట్లడుకుంటున్నారంటే  చూడండి విషయం ఎంత సీరియస్సో..ఒకందుకు ఇది మంచి పరిణామమే….ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది..నాకెందుకులే, ఎవరైతే ఏంటి? అనే ఆలోచన తగ్గి, విశ్లేషించడం మొదలుపెట్టారు.అందరూ కాకపోయినా కనీసం కొంత మందిఐనా సమాజం గురించి ఆలోచిస్తున్నారు…ఈ మార్పు ఇలాగె కొనసాగితే ఎంత బాగుండు..ఆశపడటంలో తప్పు లేదు కదా?

ఈ మధ్య లైబ్రరీ వెళ్ళినప్పుడు ఒక పుస్తకం నన్ను ఆకట్టుకుంది.INDIA: A WOUNDED CIVILIZATION ….ఈ బుక్ రాసింది  1975 లో , భారత దేశం లో ఎమర్జెన్సీ ఉన్న రోజుల్లో.ఈ పుస్తకం లో భారత దేశం గురించి, ఇక్కడి వ్యవస్థ గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు రచయిత.ఎంతో గొప్పవైన మన ప్రాచీన వేద గ్రంథాలను, సనాతన ధర్మాలను పొగుడుతూనే… అదే ధర్మం , కర్మ అనే ముసుగులో ఇక్కడి ప్రజలు మనస్సాక్షిని చంపుకుని ఎలా తమ కష్టాలకు, కర్మ అనే సిద్ధాంతం తో ముడి పెట్టి బతుకుతున్నారో చెప్పారు.pilgrimage-tour-packages

మొదటి సారి మొఘల్ రాజులు ఎలా ఈ దేశం లోకి వచ్చారో మొదలుకుని, పోర్చుగీస్,ఫ్రాన్స్,తర్వాత బ్రిటిష్ వారు ఎలా ఈ సువిశాల దేశాన్ని ఆక్రమించుకుని ఎలా ఇక్కడి ప్రజల మనోభావాలతో  ఆడుకుని రాజ్యం చేసింది వివరించారు.

తరువాత స్వాతంత్రం వచ్చినా కూడా డెమోక్రసీ అనే ముసుగు లో రాజకీయ నాయకుల చేతుల్లో దేశం ఎలా నియంత పాలన కింద నడిచిందో వివరించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది..అప్పటికీ(1975), ఇప్పటికీ(2014)దేశం లో రాజకీయ పరంగా, ఎటువంటి మార్పు లేదు.అవే సమస్యలు.ఎందుకిలా?……మార్పు అనేది మనకి ఇష్టం లేకనా? లేక అదో రకం నిర్లిప్తతా???

నిజంగా మనం ఆత్మవంచన చేసుకుంటున్నామా??”ప్రపంచంలోఎవరూ వేలు ఎత్తి చూపించలేనటువంటి సనాతనధర్మం నీడలో, కళ్ళు మూసుకుని బ్రతికేస్తున్నామా???”అని అనిపించింది..

indian-low casteవిదేశీ దాడులు, బ్రిటిష్ పాలన, స్వాతంత్రం , అధిక జనాభా, నిరక్షరాస్యత,….ఇప్పుడు” రాజకీయాలు” ..ఇలా ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో భారతజాతి పోరాటం కొనసాగిస్తూనే  ఉండాలా???రత్నగర్భ  అవ్వడమే ఈ దేశం చేసిన తప్పా?

ఎవరితోనైనా ఈ విషయాల గురించి మాట్లాడితే , నువ్వేం చెయ్యగలవు ?నీకెందుకు అని ప్రశ్నిస్తారు…నిజమే ఒక పెద్ద మార్పు తీస్కుని రాలేక పోవచ్చు…కాని నా వరకు నేను,నా కుటుంబం వరకు మార్పు తీస్కుని వచ్చే ప్రయత్నం చెయ్య గలను కదా..ఇలా ఎవరికి వారు తమలో తాము మార్పు తీస్కుని వస్తే ఆ చిన్ని చిన్ని మార్పులే రేపు ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు..ఎందుకంటే

“దేశమంటే మట్టి కాదోయ్ , దేశం అంటే మనుషులోయ్”..కాబట్టి

ఆర్.కె.నారాయణ్(మాల్గుడి కథలు రచయిత) గారు అన్నట్టు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అవి చరిత్రలో కలిసిపోవాల్సిందే..ఇండియా విల్ గో ఆన్ ….”INDIA WILL GO ON”…కాకపోతే ఆ ప్రయత్నం లోనే మార్పు రావాలి అని ఆశ.

అది మనందరి చేతుల్లోనే వుంది…20120511044233_Sony Awards 9ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామా?

Use Facebook to Comment on this Post

democracyIndian politicspeople of Indiapoverty
Share Tweet

Srinidhi Yellala

You Might Also Like

  • activity corner

    ఆషాడం లో….

  • activity corner

    రాగి చెంబు….

  • activity corner

    బాటిల్ ఆర్ట్..

2 Comments

  • Kiran says: March 12, 2014 at 1:15 pm

    నిజమే , మార్పు అనేది మన గడప నుండి మొదలు అవ్వాలి , ఎవరికీ వారు మనకెందుకు లే , నీకు ఎందుకు లే అని అనుకోవటం వలెనే కదా మన దేశ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. మార్పు తీసుకొని వస్తా అని మాట ఇచిన ప్రతి రాజకీయ నేత మారిపోతున్నాడు , ఆ నేత ని నమ్మిన ప్రజలు ఎప్పటిలాగే మోసపోతున్నారు. కాని రాబోయే రోజుల్లో భారత దేశం మారుతుంది , అది కూడా సామాన్య భారతీయులే మారుస్తారు , నేత లు కాదు అని నా నమ్మకం.

    ఇంకో మాట , మీ బ్లాగు చాల బాగుంది అండి , ఇలాగే వ్రాస్తూ ఉండండి.

    Reply
    • Srinidhi Yellala says: September 4, 2014 at 9:35 am

      thank you kiran gaaru

      Reply

    Leave a reply Cancel reply

    Categories

    • activity corner
    • Uncategorized
    • ఎందరో మహానుభావులు ..
    • కధలు
    • మన పండుగలు
    • సరదా కబుర్లు
    • సాయంకాలం కబుర్లు

    Tags

    akkineni ANR dasara bullodu india nirbhaya pelli poola jada rahul baba republic day savithri telangana telugu film posters telugujokes tv ads
    • my blog…
    ఉత్తమ తెలుగు బ్లాగులు - బ్లాగిల్లు | Top Telugu Blogs
    మాలిక: Telugu Blogs


    కూడలి

    Blaagulokam logo