అందరికీ వర లక్ష్మీ వ్రత శుక్రవారం శుభాకాంక్షలు.శ్రావణ మాసం లో అందరు ఎదురు చూసె వరలక్ష్మి వ్రతం వచ్చేసింది.మన తెలుగు మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ వ్రతాన్ని అందరు ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వర లక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి.ఆ రోజు కుదరని వారు శ్రావణ మాసం లోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు.తెలుగు వారే కాకుండా, కన్నడ మరియు తమిళ్ నాడు ప్రాంతం వారు కూడా ఈ వ్రతాన్ని వైభవంగా చేసుకుంటారు.
కులాలకి వర్నాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వ్రతం చేసుకోవచ్చు.ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు ఈ వ్రతాన్ని వైభవంగా జరుపుకుంటారు.
అష్ట ఐశ్వర్యాలకు,సిరి సంపదలకు నెలవైన అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.
ఈ వ్రతానికి కావలసినవి ముఖ్యంగా భక్తి,నమ్మకం.
ముందుగా పూజ స్థలం శుబ్రం చేసుకుని,అష్టదల పద్మం ముగ్గు వెసుకుని,దాని పై తమలపాకు,వక్క వుంచి పచ్చి బియ్యం పోసి అమ్మవారిని దానిపై కుర్చోపెట్టాలి.
అమ్మవారి రూపు లేదా,కొబ్బరికాయతో కాని అమ్మవారిని సిద్ధం చేసుకుని అలంకరించుకోవాలి.కలశం మన వీలుని బట్టి రాగి లేదా వెండి తెసుకుని,అందులో పసుపు,నాణేలు,తమలపాకు,వక్క వేసుకుని,దాని పై పసుపు కుంకుమ పూసిన కొబ్బరికాయని పెట్టాలి. కొబ్బరికాయకి అమ్మవారి రూపుని దారంతో జారిపోకుండా కట్టాలి.జాకెట్టు ముక్కతో కాని ఏదైనా కొత్త వస్త్రం తో కాని కుచ్చిల్లు పోసి కలసానికి చీరలాగా కట్టాలి.నగలు,పూలు పెట్టి చక్కగా అలంకరించుకోవచ్చు.
పూలు:
అమ్మవారి పూజలో పూలది ముఖ్యమైన స్థానం.అమ్మవారి పూలలోఎరుపు రంగు పూలు ఉండేటట్లు చూసుకోండి.లక్ష్మి దేవికి ఎరుపు రంగు పూలంటే చాల ఇష్టమంట.కలువలు కుడా ఉండి తీరాలి.
నైవేద్యం:
శుచిగా స్నానం చేసి ముందే నైవేద్యం చేసుకుని వుంచుకోవాలి.అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే ప్రీతి.పులిహోర,చక్కర పొంగలి,పరమాన్నం,గారెలు.ఇలా ఎవరి శక్తికి తగ్గట్టు వారు నైవేద్యం చేసుకోవచ్చు.
ఈ శుక్రవారం బంగారం కొని అమ్మవారికి పెడితే మంచిది.పాత రోజుల్లో ప్రతి వరలక్ష్మి వ్రతానికి లక్ష్మి కాసులు కొన్ని కొని,కొన్ని సంవత్సరాల తర్వాత అలా కొన్నవాటితో వాటితో కాసుల పేరు చేయించుకునే వారట.
తరువాత పసుపు తో చిన్ని కొండలాగా చేసి కుంకుమ పెట్టి గణపతిని చేసుకోవాలి.అమ్మవారి ముందు తమలపాకు,వక్క పెట్టి గణపతిని అందులో పెట్టాలి.
ముందు గణపతి పూజ చేసుకుని తర్వతః వ్రతం మొదలు పెట్టాలి.
వ్రత విధానం వ్రత కధ మనకి అందుబాటులో దొరుకుతాయి.అందులో చెప్పినట్టు చేసి.కథ చదువుకుని,అక్షితలు తలపై చల్లుకుని,అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముంగించవచ్చు.
సాయంత్రం స్నేహితులని పిలిచి ప్రసాదం,తాంబూలం,పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి.ముందుగానే చిన్ని బ్యాగుల్లో జాకెట్టు పిసు,రెండు మట్టి గాజులు,పసుపు కుంకుమ,రెండు పళ్ళు,పూలు ఆకు వక్క పెట్టి ఉంచుకుంటే,వచ్చిన వారికి సులువుగా ఇవ్వడానికి వీలుంటుంది.
ఈ వ్రతాన్ని మీరు కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను.
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
Leave a Reply