నవ్వుల్ పువ్వుల్ – 4

 

Learning to perfect the art of aging gracefully 😍😛🤪

నల్లటి మేఘాలతో ఆకాశం బరువెక్కింది ! అచ్చం బాధతో మూగగా రోదిస్తున్న నా మనసులాగా !

ఇప్పుడు అంత భారమైన బాధ ఏమొచ్చింది?

నా పిల్లకి మాటలొచ్చాయి !

అయితే ఇంకేం .. పంచదార చిలకలు పంచిపెట్టు ఎంచక్కా ! సమస్య ఏంటి దాంట్లో ?

అది కాదు సమస్య ..దానితో పాటు తన ఫ్రెండ్స్ కి కూడా మాటలు వచ్చేశాయ్ !

It’s natural ! సో ?

ప్లే డేట్ కి తీసుకెళ్తే అంతా కలిసి “ఆంటీ ” “ ఆంటీ ” అని ఒకటే రొద! ప్రపంచంలోని పిల్లలంతా కలిసి కాళకేయ సైన్యం లాగ “ఆంటీ, ఆంటీ” అని దండెత్తి వస్తున్నట్టు కలలు.

If so, then you have officially received the title of “auntie “👑.

*************************************************************************

Dedication levels 🙏🙏

హలో! ససస సా…ర్ ర్ ర్ ! What a pleasant surprise!
యా యా బాగున్నా సర్ .. మీరు బాగున్నారా? ఓ యస్ ! Definitely . మీరు అడగడం నేను కాదనడమూ నా! మీకెందుకు, నే కనుక్కుంటా! నే జూస్కుంటాగా ! bye సర్ !

ఎవరు? మీ స్కూల్ టీచర్ ఆ ?

కాదు !

విజయవాడ కోచ్ ఆ ?

కాదు

కాలేజీ లెక్చరర్ ఆ ?

కాదెహే !

మరి?

కాలేజ్ లో మా సీనియర్ !

ఏంటి ఇన్నేళ్ల తర్వాత కూడా సర్ అంటున్నావా ?

1st ఇయర్ లో ఈడు చేసిన ర్యాగింగ్ కి చచ్చేముందు వచ్చినా “ఎస్ సర్” అనే అంటానేమో ! గుడ్ morning కి తర్వాత “సార్” అని చెప్పలేదని B.N. రెడ్డి నగర్ నుండి శేరిగూడ బస్టాప్ వరకు ఎన్ని బస్టాపులు ఉన్నాయో వరసగా ..” In order I Say”, చెప్పించాడు. అదికూడా చెవులు పట్టుకుని !

ఓహ్ ! ఇప్పుడేం పనటా నీతో ?

మా క్లాస్ దివ్యకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసిందంట ! నెంబర్ కావాలని చేసాడు !

ఓహ్ ! నీ దగ్గర ఉంది కదా , కనుక్కోవడం ఎందుకు ? దివ్యని అడిగి పంపిస్తావా ?

ఆ … అడగ్గానే పంపిస్తారు పాపం ! ఎంతెంత హింస పెట్టాడూ ! dairy milk ఇస్తానని organic chemistry రికార్డు మొత్తం రాయించుకుని, dairy milk shots చేతిలో పెట్టాడు ! వీడికి దివ్య నెంబర్ ఎట్టా దొరుకుతుందో చూస్తా !నేనివ్వను, ఎవ్వరినీ ఇవ్వనివ్వను .

హౌ ? ఎలా ?

ఆ … వాట్స్ ఆప్ గ్రూపులు ఉన్నది ఇందుకు కాదేటి .. ఇల్లాంటి విషయాల్లో మా ఐకమత్యం చూసి ఐక్య రాజ్య సమితి కూడా అవాక్కయి పోవాలా …అ ..అ .. ఆ !!

*************************************************************************************************

To the efforts of photographers 🙏 on world photography day

ఇందుమూలంగా పుర ప్రజలకి చెప్పొచ్చేదేంటంటే … పిల్లి కూతలు కూయకుండా, సర్కస్ ఫీట్లు చెయ్యకుండా , రెడీ ష్టెడీ 1 — 2 — 3 అనేలోపు బులి రాణీ గారి చూపు కెమెరా వైపు పడేట్టు చేసి ఫుటో తీయగలినోడ్ని … అగ్గి బరాటా బిరుదుతో సన్మానించి, అర్ధరాజ్యాన్ని ఇస్తానని మారాజు గోరు చెప్పమనారహో ఓఓఓఓ …

***********************************************************************************************

The moment you realize the key force behind living 🤗🤩

గురు శ్రీ : తల్లీ ! ఏమిటి ఇలా వచ్చావు ? దేనికీ తీరిక లేదు అంటావు కదా ?

శిష్య శ్రీ : ఒక ధర్మ సందేహం వస్తే , ఎదో కాస్త తీరిక చేసుకు,చూసుకుని వచ్చా స్వామి !

గురు శ్రీ : అడుగు బిడ్డా !

శిష్య శ్రీ : జీవితం అనగా ఏమిటి స్వామి ?

గురు శ్రీ : చాలా లోతైన ప్రశ్న తల్లీ. ఒకసారి ఒక ఫలానా గొప్ప దేశపు ఫలానా మేధావి ఎం చెప్పాడంటే , “the relationship between జీవితం ….. ”

శిష్య శ్రీ : అబ్బబ్బా ఏం చెప్పినా , తేలిగ్గా తొందరగా చెప్పండి స్వామి… !

గురు శ్రీ : అయితే విను … జీవితం అంటే !

శిష్య శ్రీ : అంటే …

గురు శ్రీ : జీవితం అంటే …

శిష్య శ్రీ : అంటే ఏ ఏ ఏ ఏ ….

గురు శ్రీ : జీవితం అంటే టిఫిన్, లంచ్ మరియు డిన్నర్ తల్లి.

అంటే, మూడు పూటలా ఇంత భోజనం చేసుకోవడం, లేదా చేయించుకోవడం లేదా సంపాదించుకోవడం.

మిగతా క్రియలన్నీ ఈ మూడింటికి సంబంధించి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్లు బిడ్డా .

శిష్య శ్రీ : ఆహా సూక్ష్మంలో మోక్షం చూపారు 🙏.

*********************************************************************************************

Happy Labor day! 

* “అసలు హాలిడే అంటే ఎల్లా ఉండాలీ …. ఈ రోజు వంట నాది ఓకే నా ! యూ జస్ట్ రిలాక్స్ యా !”
# “డబల్ వాకే ! థాంక్స్ ! యే యే యే !”

* “జస్ట్ కొంచం ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటోస్, చిల్లీస్, పుదీనా రెడీ చేసేయ్ , పిచ్చెక్కిస్తా ఇక !”
# “hmm సర్లే … ఓ…… కే !”

* “బిర్యానీ రెడీ ! క్లీనింగ్ నీదే మరి !”
# “ఓ ఓ …. కే ……. !”

పబ్లిక్ టాక్ : బిర్యానీ చేస్తే మనోడే చేయాలోయ్ .. అబ్బోఓ బ్రేహ్మాండం . నువ్ చాలా లక్కీ .

☺️
🤔🤭😦🙄

ప్రపంచంలోని ఎన్నో పనులు సజావుగా సాగడానికి రాళ్ళెత్తిన సోదర సోదరీమణులకి … లాల్ సలాం కామ్రేడ్స్ 🙌🏻

************************************************************************************************

When it is your sister’s birthday, you remember all sort of funny things!😀😀😎
“తాతా ఏమన్నా చెప్పు కదా !”

“కథ చెప్పనా ?”

“వద్దు .. ఎప్పుడూ ‘పుటుక్కు జరజర డుబుక్కు మే’ కథే చెప్తావ్ . వేరే ఏదన్నా చెప్పు.”

“నీకో మాట చెపుతా .. గుర్తు పెట్టుకో అమ్మణ్ణి !”

“ఊఉ .. చెప్పు మరీ.”

“నువ్వేమో … ‘గ జ డ ద బ’ … బడా బడా మాట్లాడుతూనే ఉంటావ్ కదా, అందుకు !
పెద్ద అమ్మణ్ణి ఏమో … ‘క చ ట త ప’… కోపం జాస్తి అందుకు ! హ హా హా !”

“ఏంటో ఏదీ సులువుగా చెప్పవు కదా !పో !”

అప్పుడు అర్ధం కాలేదు మా తాతయ్య చమత్కారం . సో …

డియర్ క చ ట త ప,

Happy Birthday

ఇట్లు,
గ జ డ ద బ .

*************************************************************************************

Probability factor with your kid is always “1”🤪🤪🤪

మీ బుడ్డదానికి తినిపిద్దామని కింద కూర్చోపెట్టి, గిన్నిలో అన్నమేసి, పప్పేసి, చారోసి, నెయ్యేసి సిద్ధం చేసుకున్నారు అనుకోండి.

మాటి మాటికీ లేవకుండా ఉండేట్టు చిన్నిగ్లాసుడు నీళ్ళోసి కూడా తెచ్చిపెట్టుకున్నారనుకోండి! ఇక్కడే జాగ్రత్తగా వినాలి మరి,

a ) బుడ్డది సుమారు ఒక సంవత్సర కాలంలో, గ్లాసుడు నీళ్లు ఎన్ని సార్లు కింద పడేయవచ్చు ?
b ) బుడ్డ దానికి ఏఏ దిశలో పెడితే గ్లాసు పడెయ్యకుండా ఉండును ?

నాన్న : probability = number of favorable outcomes / total number of possible outcomes
అంటే , ఒక 365 రోజుల్లో హాలిడేసు, ఔటింగులు, ట్రిప్పులు!
ఒక 279 ని 365 తో , లేక 298 ని 365 తో… హ్మ్ ! ఒక్క 2 నిముషాలు టైం ఇస్తే చెప్పేస్తానోయ్ !

అమ్మ : a ) 100 కి 100% తన్నేస్తుంది.
8 దిక్కుల్లో ఏ దిశలో పెట్టినా మిస్ అయ్యే అవకాశం లేదు. మిమ్మల్ని నూటొక్క సాకులతో కుర్చోనియ్యదు, నిలబడ నియ్యదు .

**************************************************************************************************

by
Srinidhi Yellala.

 

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *