రాష్ట్ర విభజన సెగలు రాష్ట్రాన్నివేడేక్కిస్తున్నాయ్.నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది సవాల్ ..రాష్ట్రం విడిపోతోంది అంటే ఏంతో బాధ గా వుంది.ఎంతో కష్టపడి కట్టుకున్న పొదరిల్లు ని పిల్లలు రెండు భాగాలూ చెయ్యబోతున్నారు…ఇందులో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలీదు కాని తల్లి కి మాత్రం కడుపు కోతే మిగులుతుంది.
1953 శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి తో మద్రాస్ సంయుక్త రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది.తరువాత 1956లో తెలంగాణా ప్రాంతం నిజాం పాలన నుండి విడివడి ఆంధ్రరాష్ట్రం తో కలిసి, తెలుగు మాట్లాడే జాతి గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది.
ఇన్నాళ్లకు మళ్ళి రాష్ట్రం విడిపోతోంది…ఈ విషయం శోచనీయం.స్వార్ధ రాజకీయాలకు మళ్ళి ప్రజానీకం బలి కాబోతోందా?
“ఏ జాతి చరిత చూసినా ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత సమస్తం పరపిడన పరాయణత్వం”అన్న శ్రీ శ్రీ మాటలు మళ్ళి నిజం కాబోతున్నాయా???
సరే హక్కుల గురించి , ఆస్తుల గురించి, ఉద్యోగాల గురించి వనరుల గురించి ఒక ప్రాంతం వారికి న్యాయం చేకుర్చాలంటే విడిపోయ్యే చెయ్యాలా? కలిసి వుండి కూడా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా?విడివడి సాధించేదేముంది?
కేంద్రం కూడా ఆమోదముద్ర తెలియజేస్తోంది.అయితే ఇరు పక్షాల వాదనలు వినాలి కదా?విభజించాక వచ్చే సమస్యల గురించి ఆలోచించారా అసలు.
ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్ర రాజధాని ఏర్పడడానికి జీవితకాలం పడుతుంది.అందుకు ఎంత భారం ఖజానా పై పడుతుంది.?ఈ భారమంతా మళ్ళి ప్రలపైనే కదా పడేది?ఇప్పుడు నిర్మాణం లో వున్న ప్రాజక్టుల గతేంటి? అసలు వీటి గురించి ఆలోచించకుండా ఎలా ప్రతిపాదించారు బిల్లు ని?
ఒకసారి ఆలోచిస్తే, చిన్న చిన్న ఆశలను ఎరగా వేసి, అమాయక ప్రజల వ్యక్తిత్వాలతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తోంది. దుష్ట రాజకీయ కుట్రలకి ఇంకో జాతి విచ్చిన్నం కాబోతోంది.
ఒకసారి మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి ఆలోచిస్తే ..చివరగా మోసపోయేది ఎవరో?..లాభపడేది ఎవరో తెలిసిపోతుంది?
తెలుగుతనానికి ఇన్ని రోజులు చిహ్నాలుగా వున్న అన్ని ప్రదేశాలు,గుళ్ళు ,గోపురాలు,కళలు,సాంప్రదాయాలు ,మనకే ప్రత్యేకమైనటువంటి రుచులు అన్ని కూడా మూగగా రోదిస్తున్నాయి…ఒకసారి వినండి.
చరిత్ర లో ఎన్నో గొప్ప రాజ్యాలు వచ్చాయ్ ..కాలగర్భం లో అన్ని కలిసిపోయాయి.రాజ్యాలు,రాజ్యాంగాలు ఎన్ని వచ్చినా కూడా ప్రజలకి ఒరిగినది ఏంటి?..
ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం గొప్ప కాదు.సరైన పాలనా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం గొప్ప.మార్పు తీస్కురావలసింది మన రాజ్యాంగ వ్యవస్థలో.విడివడ్డా కూడా రాష్ట్ర భవిష్యత్తు అనేది పాలకుల చేతిలోఉంది అన్న విషయం మరువ వద్దు.సరైన పాలకులు లేనప్పుడు న్యాయం అనేది సామాన్య మానవుడికి చేరుతుందా అనేది ప్రశ? ఒక్కసారి ఆత్మవిమర్శ చేస్కోండి?
చిన్న చేపను పెద్ద చేప మింగుట లోక రీతి కదా?
Leave a Reply