mnkసోనియా గాంధీ తన రాజకీయ వారసుడు రాహుల్ గాంధీని ప్రజలకి దగ్గర చెయ్యాలనుకునే ప్రయత్నాలన్నీబెడిసికొడుతున్నట్టు ఉన్నాయ్.కాంగ్రెస్ యువరాజు తన చేతులారా తనే తన స్థానాన్ని ఇరకాటం లో పెట్టుకుంటున్నాడు.ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే యువరాజా వారి అయోమయ పరిస్థితి చాలా స్పష్టంగా అర్ధమవుతుంది.

10 ఏళ్ల రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ ఇచ్చిన తొలి ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఇది. అందులో రాహుల్ ప్రవర్తించిన తీరు చూస్తే పదేళ్ళ రాజకీయ అనుభవం వున్న నాయకుడి లక్షణాలు అస్సలు కనిపించవు.ఎదో బలవంతంగా తన కిష్టం లేని పని ఎదో చేస్తున్నట్టు ఇబ్బంది పడిపోయాడు.దేశాన్ని నడుపుతున్నటువంటి ఒక పార్టీ అభ్యర్దికి ఉండవలసిన కనీస లక్షణాలు మచ్చుక్కైనా కనిపించలేదు.ఇక నాయకత్వ లక్షణాల గురించి ఆశపడడం, గగన కుసుమం అవుతుందేమో.తను రాజకీయాల్లో ఇమడలేడు అన్న విషయం పక్కాగా తేటతెల్లం అయిపోఇంది.

1.30గంట పాటు జరిగిన ఇంటర్వ్యూ లో , సదరు జర్నలిస్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా రాహుల్ సూటిగా సమాధానం చెప్పలేదు సరికదా, అసలు ప్రశ్న కి సమాధానానికి కనీసం వెంట్రుకవాసంత సంబంధం కూడా లేదు.ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆ విధంగా సమాధానం చెప్పడాన్ని ప్రజలు అస్సలు జీర్ణించుకోలేక పోయారు.RahulGandhi

అసలు ఏప్రశ్న అడిగినా కూడా తనకు తెలిసిన సమాధానమే చెప్పాడు, ఎదో భట్టీయం వేస్కోచినట్లు.మచ్చుక్కిఒకటి చూడండి…

1ప్రశ్న:”.గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీ హస్తం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది కదా మరి మీరు మోడీ ని ఎందుకు అపరాధి అని చెప్పారు”,అని అడిగిన ప్రశ్న కు మన యువరాజా ఎం చెప్పారంటే…

రాహుల్:”దేశం చాలా ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉంది, ఈ వ్యవస్థనిమార్చాలి, స్త్రీలకి రాజకీయాల్లోప్రాముక్యతని పెంచాలి యువతని రాజకీయాల్లో తీస్కుని రావాలి ” అని చెప్పాడు…నాకైతే ఒక నిమిషం నేనేం విన్నానో అర్ధం కాలేదు

పాపం ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా , “అది కరెక్టే గాంధీ గారు అలాగే చేద్దురు గాని ముందు మోడీ గురించి మీ అభిప్రాయం చెప్పండి“, అని మళ్ళి అడిగాడు

దీనికి జూ.గాంధీ గారు, “దేశం లో పారిశ్రామిక అభివృద్ది ని పెంచాలి, డెమోక్రసీని మూల మూలాల్లోకి వ్యాపించాలి”, అన్నారు

అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళి అదే ప్రశ్న ని వేరే విధంగా అడిగాడు  ఇంటర్వ్యూ అతను

ఈ సారి గాంధీ గారు కూడా,ఏ మాత్రం సిగ్గు పడకుండా , “గ్రీన్ రెవల్యూషన్ మళ్ళి తీస్కోస్తానని , టెలివిజన్ రెవల్యూషన్ తీస్కోస్తానని , లంచాన్ని ఒంటి చేత్తో అరికట్టేస్తానని” గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు.

నువ్వు మొండి అయితే నేను జగ మొండి అనే టైపు లో ఇంటర్వ్యూ అతను మళ్ళి చివరిగా నాలుగోస్సారి  ఇటు అటూ మడతేసి మళ్ళి అదే ప్రశ్న ని మన పప్పు  బాబు గారికి వేసారు

నేను మొనార్కు ని అనే టైపు లో మన కాంగ్రెస్ అధిపతి గారు మళ్ళి “స్త్రీ లని ఉన్నత పదవుల్లోకి తీసుకెళ్తామని , డెమోక్రసీ గురించి, దేశ యువత గురించి, లంచగొండి తనం గురించి, వ్యవస్థపై  యుద్దం గురించి చెప్పాడు”.

ఇక ఇంటర్వ్యూ చేసే అయన కి విసుగొచ్చి వేరే ప్రశ్న వేసాడు.

ఇలా సా….గిందండి మన రాహుల్ బాబా ఇంటర్వ్యూ.తరువాత అయన వేసిన ప్రశ్నలు అన్నిటికీ పైన చెప్పిన సమాధానాలే మళ్ళి, మళ్ళి మళ్ళి, ఏ మాత్రం సిగ్గులేకుండా, చెప్పాడనమాట.

35076735నాకైతే ఆ ఇంటర్వ్యూ చేసిన అతని ఓపికకి సాష్టాంగనమస్కారం చెయ్యాలనిపించింది.అయన పాపం ఎంతో కష్టపడి హోంవర్క్ చేసి తయారు చేస్కున్న ఇంటర్వ్యూ మాటర్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.ఇంటర్వ్యూ జరిగేటప్పుడు చాలా ఓపిక పట్టినట్టు, నవ్వు ఆపుకున్నట్టు మనకి కనిపిస్తుంది.

ఏమాట కి ఆ మాట చెప్పుకోవాలి…ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు అర్నవ్  గోస్వామి,చాలా చక్కగా మంచి  పదునైన బాణం లాంటి ప్రశ్నలు తయారు చేసాడు.ఆయన వైపు నుండి అసలు  ఏ లోపం లేదు.దేశం లో అప్పుడు, ఇప్పుడు వున్న సమస్యలన్నిటిని బయటికి తీసాడు. ఇందిరా గాంధీహత్యా, రాజీవ్ గాంధీ బలవంతపు రాజకీయ ప్రవేశం, కాంగ్రెస్ పార్టీ లో పాతుకుపోయిన లంచగొండి తనం,పక్షపాత బుద్ధి, 1984 డిల్లీ అల్లర్లు, 2 జి కుంభకోణం ,విదేశీ పెట్టుబడులు, ఆర్ధిక మాంద్యం,DMK,AAP పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడానికి కారణం….ఇలా చాలా సున్నితమైన విషయాల గురించి చక్కని ప్రశ్నలను సంధించారు అర్నవ్ గోస్వామి…

“వీటికి గనుక రాహుల్ చక్కని సమాధానాలు చెప్పి వుంటే …ఈ ఇంటర్వ్యూ రాజకీయంగా అతనికి ఎంతో మేలు చేసేది.కాని తన అసమర్ధతతో తన వేలితో తన కన్నే పొడుచుకున్నాడు.”

మన దేశ యువ జన నాయకుడి ని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు…నాకైతే నా కాలేజి రోజుల్లో వైవా గుర్తోచించి.కానీ ఒక శక్తివంతమైన పార్టీ నాయకుడు అంత మూర్ఖంగా, అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడం ఏమీ బావోలేదు. పైగా నేడు సాంకేతికంగా దేశం ఎంతో ముందు ఉంది, ప్రజలను అంత తేలిగ్గా ఎవరూ నమ్మించలేరు.ఇంటర్వ్యూ చూసిన ప్రతి పౌరుడూ ఇతనా దేశాన్ని నడిపించబోయే నాయకుడు అని ఆశ్చర్యపడి ఆ తరువాత భాద పడక మానడు.

Sonia-Gandhi-Rahul-Gandhi-accused-in-Land-Acquisition-Scam-in-Gurgaon-Ullawas-village-Haryanaఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా చక్కగా చెప్పగలిగే ప్రశ్నలకి, ఒక m.phil చేసి,  43ఏళ్ల రాజకీయ సంబంధం ,10 ఏళ్ల రాజకీయ అనుభవం, పేరుకి వెనుక గాంధీ అనబడే గౌరవం కలిగిన ఒక వ్యక్తిఎందుకు చెప్పలేకపోయాడు?????

ఏమైతేనేమి కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ కొట్టాడు రాహుల్ బాబా.కొండ నాలుక కి మందు వేస్తే వున్న నాలుక ఊడిందిట అలాగైంది కాంగ్రెస్ పని.అటు ప్రతిపక్షంలో వున్న మోడీ తన వాక్చాతుర్యం తో ప్రజల్నిఆకట్టుకుంటుంటే ఇక్కడ రాహుల్  కి కనీసం తన సొంత భావాలను వ్యక్తం చేసే దైర్యం కూడా లేనట్టు కనిపిస్తోంది.చాలా సులువైన ప్రశ్నలకు కూడా అతను ఎందుకు అంత తత్తరపడ్డాడో అర్ధం కాలేదు.

కొసమెరుపు: అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే “నేను ఎన్నో గొప్ప విషయాల గురించి చర్చిద్దామని వచ్చాను….కానీ మీరు అవేమీ నన్ను అడగడం లేదు “అని రాహుల్  బాధపడ్డాడు….

అయ్యో రాహుల్ బాబు, నీకు నచ్చిన , నువ్వు నేర్చుకుని వచ్చిన ప్రశ్నలు అడిగితే  అది ఉపన్యాసం అవుతుంది కాని ఇంటర్వ్యూ ఎలా అవుతుందయ్యా బాబూ…..

మొత్తానికి గుర్రాన్ని బలవంతంగా చెరువు దగ్గరికి తీస్కురావడమే కాకుండా నీళ్లు కూడా తాగించేటట్లు ఉన్నారు సదరు హై కమాండు వారు…

rahul_gandhi_5కానీ తన శక్తికి మించిన బరువు భాద్యతలని ఈరాకుమారుడు ఎలా మోస్తాడో మరి  చూడాలి …..ఎంతైనా భారత ప్రజానీకానికి  ఓపిక ఎక్కువే కదా….

అనుకున్నదొక్కటి ఐనదోక్కటి బోల్తా కొట్టిందిలే కాంగ్రెస్ పిట్టా….

Use Facebook to Comment on this Post


Comments

One response to “హై హై నాయకా…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *