అమెరికా ప్రయాణానికి సామాన్లు సర్దటం అంటే పి.హెచ్.డి కి థీసిస్ ప్రిపేర్ చేసినంత పనితో సమానం. ఎన్నిపెట్టుకున్నాఇంకాఎదో ఒకటి మర్చిపోయామనే వుంటుంది.కనిపించిన ప్రతి వస్తువు బ్యాగులోదూర్చెయ్యాలి అనిపిస్తుంది.వీలైతే ఇక్కడ వున్నఇల్లుని మొత్తం ప్యాక్ చేసేసి వెంట తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది.కానిఎం చేస్తాం. సర్దిన వాటిని మళ్ళి మళ్ళి సర్ది ఫైనల్ గా బరువు చూస్కుని ఇంకెక్కడన్నా కాస్త ఖాళీవుంటే అందులోకొన్నికుక్కి ఎలాగో అలా సామాను సర్దుకున్నాం.అమ్మఇంత హడావిడిలోకూడా రాగి చెంబు సర్దడం మరిచి పోలేదు .అమెరికా వెళ్తూ కూడా రాగి చెంబు ఎందుకె? అంటే వినదు.రొజూ రాత్రి రాగిచెంబులో నీళ్ళు ఉంచుకుని పొద్దునే లేచి తాగమని చెప్పింది.పెద్దవాళ్ళు చెప్తే మనకన్ని నస రామాయణం అని అనిపిస్తుంటుంది.సరేలేఅమ్మని బాధపెట్టడం ఎందుకని తెచ్చుకున్నాను.కాని ఎప్పుడూ దాన్నివాడిందిలేదు.
ఈమధ్య ఆన్ లైన్ లో ఒక ఆర్టికల్ చదవడం జరిగింది.ప్రస్తుతం జనరేషన్ కి వున్నఅనారోగ్య సమస్యల గురించీ,ఈ రోజుల్లో మన డైలీలైఫ్ ని మన పెద్దల డైలీలైఫ్ తో పోల్చి ,కొన్నిసలహాలు,సూచనలూ చెప్పారు.అందులో రాగి పాత్రల గురించి, వాటి మెడికల్ వాల్యూస్ గురించి చెప్పారు.అది చదివాక రాగి పాత్రల గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.
రాగి కి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుందట.రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు.కాబట్టి ఇందులో వున్నపధార్దాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.
మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం.రాగి పాత్రలలో నీళ్ళు కనుక ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు.అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు.మనం ఎప్పుడైనా ఎక్కడైనా నదిని దాటేటప్పుడు అందులో నాణేలు వేస్తుంటాము , గుర్తుందా.ఎందుకోతెలుసా?
పాతకాలం లో ప్రజలకి నీళ్ళు కావాలంటే ఆధారం నదులే.అప్పట్లో రాగినాణేలు వాడేవాళ్ళు.ఇలా నదిలో రాగి నాణేలు వేసినప్పుడు నీరు శుద్ధి చెంది మనుషులకి మేలు కలుగుతుందని పెద్దల ఆలోచన.ఆ అలవాటు ప్రకారమే ఇప్పటికీ ఏదైనా నది దాటుతుంటే మనం అందులో నాణేలు వేస్తుంటాము.
గంగాజలాన్నిచిన్న చిన్నరాగి చెంబుల్లోఅమ్ముతుంటారు.రాగి పాత్రలలో నీరు ఎక్కువ రోజులు చెడకుండా ఉంటాయని అలా చేస్తారంట.
చెవులు కుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలకి కొన్నిచోట్ల మొదటిసారి రాగి తీగలు చుడుతారు.పుండుపడకుండా ఉండటానికి. రాగికి వున్న ఆంటిబ్యాక్టిరియల్ లక్షణం దీనికి కారణం.
రాగి చెంబులో నీళ్ళు:
మనకి నీళ్ళు వేడి చేసుకోవడానికి రాగి తో చేసిన బాయిలర్లు వాడే వాళ్ళు అప్పట్లో.ఇందులో వేడి చేసిన నీరు వాడడం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చెయ్యబడినది.
రాగి చెంబులో రాత్రి నీరు వుంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలాచాలా మంచిదని చెప్పారు.అలా తాగితే కడుపులో వున్నచెడు అంతా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుందని చెప్పారు.ఈ అలవాటు వల్ల గ్యాస్ ప్రాబ్లెమ్స్,కిడ్నీప్రాబ్లంస్, లివర్ ప్రొబ్లెంస్ కూడా తగ్గిపోతాయని చెప్పారు.
బ్రిటిష్ కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్లు కూడా రాగిపాత్రలలో ఉంచిన నీటిపై పరిశోధన జరిపి పైన పేర్కొన్న విషయాలు నిజమని నిరూపించారు కూడా.
ఏ విషయం కూడా తన దాకా వస్తే కానీ మనిషికి విలువ తెలియదు అంటుంటారు.ఇది నూటికి నూరుపాళ్ళు కరెక్టు.పెద్దవాళ్ళుఎన్నోవిషయాలు చెప్తుంటారు అవన్నీనాన్సెన్స్, చాదస్తం,మూఢనమ్మకాలు, అని చెప్పుకుని మనం అంతగా పట్టించుకోము.కాకపోతే ఎంతో అడ్వాన్సుడు జనరేషన్ అని చెప్పుకునే మనం ఆరోగ్యం విషయంలో చాలా వెనుకబడి వున్నాము.ఈ రోజుల్లో సగటున ప్రతి ఇంటికి వచ్చే మెడికల్ బిల్లులు చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.
ఇన్నిచదివి కూడా అమ్మ చెప్పిన మాట వినకపొతే ఫూల్ అయ్యేది నేనే అనుకుని వెంటనే రాగిచెంబుని బయటికితీసాను.మీరుకూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.ఎందుకంటే శరీరాన్ని ప్రేమించకలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం.
Leave a Reply