స్నేహితుని పెళ్ళి వస్తోంది, ఏదైనా కానుక ఇవ్వాలి కదామరి.కానుక అంటే మనం అవతలవారి సంతోషం కోరి, వారికి మంచి జరిగిందని , లేక జరగాలని,మనం మనస్ఫూర్తి గా ఇచ్చేది కదా.మనం ఇచ్చే కానుకలో మన అభిరుచి తెలుస్తుందంటారు.మనకి కొన్నిబ్రాండెడ్ కానుకలు ఉన్నాయండి,అదే మాటవరసకి వాచీ. నిజం అండి జనాల్లోఒక టాక్ కూడా ఉంది , ఆంధ్రావాళ్ళు ఎవరికైనా కానుక ఇవ్వాలంటే 90 % మంది వాచీ నే కొంటారంట.నమ్మరా?నిజమండీ బాబు.మీరే చూస్కోండి కచ్చితంగా ఇప్పటికీ మీ దగ్గర ఒక్క వాచీ ఐనా గిఫ్ట్ గా వచ్చింది ఉండి ఉంటుంది.ఇక పెళ్ళిళ్ళకైతే కచ్చ్చితంగా వెంకటేశ్వరస్వామి పటం లేదా సాయిబాబా ఫోటో.అదే మిత్రులైతే డిన్నర్ సెట్టు లేదా అబ్బాయ్ అమ్మాయ్ బొమ్మ.నా వరకు నా పెళ్లికే నాకు ముగ్గురు వెంకటేశ్వరస్వాములు, ఇద్దరు సాయిబాబా గార్లు,నాలుగు డిన్నర్ సెట్లు వచ్చాయ్. కొన్నైతే కవలపిల్లలు అండి అదేనండి సేమ్ టు సేమ్ అనమాట.
గిఫ్ట్ సెలక్షన్ కూడా పెద్ద ఆర్ట్ అండి బాబు, అవతల వారికి నచ్చింది కొనాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది.కాకపోతే కొన్నిప్రోటోకాల్ ప్రకారం ఇయ్యాలి.అందుకే ఆ విషయం మా ఆయనకి వదిలేసా .నేను నా తరపున వాళ్ళకి సొంతంగా ఏదైనా చేసిద్దామని డిసైడ్ అయ్యా . ఏమిద్దామా…అనుకుంటే మొఘల్ పెయింటింగ్స్ గుర్తుకొచ్చాయ్.
నా వరకు నేను సొంతంగా ఏమైనా చేసి ఇవ్వడానికే ఇష్టపడతాను, అందులో మన ఇష్టం, ఆప్యాయత కనిపిస్తాయ్ అని నా ఉద్దేశం.
మీరు వేయొచ్చు అండి ఇది.కావలసిందల్లా కాన్వాస్ బోర్డు, పెయింట్లు, బ్రషులు ఇంకా కాస్తంత మీ “అమూల్యమైన సమయం’. నేను వేద్దామనుకున్న బొమ్మ ఇది. మీరు, మీకు నచ్చింది, మీ సంధర్భానికి తగినది సెలెక్ట్ చేస్కోండి.
ఇది మొఘల్ కాలం నాటిది.రాజ కన్య, తామరపువ్వుతో ఉంది, మంచిది , శుభ సూచకం అని తీస్కున్నాను.
కాన్వాస్ బోర్డు తీస్కుని ముందుగా బ్రుష్షుతో మొత్తం ఒకసారి ఉత్తి నీటితో ఒక లేయర్ కోటింగ్ ఇవ్వండి.
తర్వాత ఆరిన వెంటనే పెన్సిల్ తో ఔట్ లైను వేస్కుని , జాగ్రత్త గా రంగులు నింపాలి.
రంగుల విషయంలోప్రయోగాలూ చెయ్యకుండా అవే వేసానునేను, మీకు కావలిసి వస్తే మీకు నచ్చినవి వేస్కోవచ్చు.
రంగులు కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రతగా వుండాలి.చాలాకొంచం కొని చుక్కలు సరిపోతాయి. మీకు షేడ్స్ కావాలంటే రెండు మూడురంగులు కలిపి ట్రై చెయ్యవచ్చు.
కాస్తదూది పక్కన వుంటే తప్పైతే వెంటనే కరక్టు చేస్కోవచ్చు.శరీరం కోసం నేను తెలుపు, పసుపు రంగులు మిక్స్ చేసి వాడాను.
చివరికి ఇలా వచ్చింది అనమాట బాగుందో లేదో తర్వాత సంగతి అదో తృప్తి అంతే.
మీరు కూడా ప్రయత్నించి చూడండి ఒక సారి….నేనే చెయ్యగాలిగానంటే మీరు కూడా తప్పక ఇంకా బాగా చెయ్యగలరు.
Leave a Reply