unnamedఇండియా టైం బాంబు మీద కూర్చుని వుంది.ఈ మాట చెప్పింది ఎవరో కాదు, సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా…ఆ టైం బాంబు పేరు ప్లాస్టిక్.నిజం..ఈ ప్లాస్టిక్ చెత్త వల్ల కలిగే నష్టాలు న్యూక్లియర్ ఆయుధాల కన్నాఎక్కువని చెప్తున్నారు  సెంట్రల్ బోర్డ్ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్  వాళ్ళు.

ప్లాస్టిక్ లేని మన జీవితం ఈ రోజుల్లో వూహించడం చాలా కష్టం.మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుంచి,వంటింట్లో వెజిటబుల్ బోర్డు వరకు అన్నిప్లాస్టిక్ తో తయారు చెయ్యబడినవే.వీటివల్ల వల్ల కాదు సమస్య.అసలు సమస్య మొత్తం వాడేసిన ప్లాస్టిక్ ని ఎలా డిస్పోస్ (dispose)చెయ్యాలనేదే.ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మరీ ఎక్కువైపోతున్న ఈ రోజుల్లోవాటిని ఎలా డిస్పోస్ చెయ్యాలనేది  పెద్ద ప్రశ్న.

nmfమీకు తెలుసా మన దేశంలో  ప్రతి ఏటా 56 లక్షల  టన్నుల ప్లాస్టిక్ చెత్త విడుదల అవుతోంది.ఇందులో 60% మాత్రమే రీసైకిల్ చెయ్యబడుతోంది.మిగతాదంతా అలాగే ఉండిపోతోంది.ఏటేటా ఇది ఇలాగే పేరుకుంటూవస్తోంది.దీని వల్ల మనం ఊహించలేని విధంగా పర్యావరణం దెబ్బ తింటోంది.

మనకి షాపుల్లో ఇచ్చే ప్లాస్టిక్ సంచుల మందం 40 మైక్రాన్ల కన్నాతక్కువ ఉండకూడదు.కాని మన దేశం లో అన్ని దుకాణాల్లో ముఖ్యంగా కూరగాయలు,పండ్ల దుకాణాల్లో ఇచ్చే కవర్లు మరీ20 మైక్రాన్ల మందం మాత్రమే ఉంటున్నాయి.ఇవి చాలా ప్రమాదకరం.వీటి వల్ల కాన్సర్ కూడా రావచ్చుఅని తెలుస్తోంది.

చట్ట ప్రకారం 40 మైక్రాన్ల కన్నాతక్కువ మందం కల ప్లాస్టిక్ బ్యాగులు అమ్మితే ఒక నెల జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా కట్టాలని కోర్టు చెప్తోంది.ఐనా కూడా ఈ కవర్ల వాడకం ఇంకా పెరుగుతూనే ఉంటోంది.వీటివల్ల నష్టాలు ఇప్పుడు తెలీకపోయినా రానున్న కాలంలో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అవి ఏంటంటేmkdg

1.ఈ కవర్లు భూమిలోఎట్టి పరిస్తుతుల్లో కలసిపోవు.వర్షం నీరు భూమి లోకి వెళ్ళకుండా చేసి..భూగర్భజలాలను తగ్గించేస్తాయ్.ఈ సమస్య ఇప్పటికే ఎక్కువగా వుంది మనకి.దీని వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడవు.

2.ఆవులు వీటిని తినడం వల్ల అవి పాలు ఇతర పాల పదార్ధాల రూపం లో మనకి చేరుకుంటాయి.పాలల్లో ప్లాస్టిక్ అవశేషాలని ఇటీవల కనుకున్నారు కూడా.

౩.సముద్రాలలో , నీటి చెరువుల్లో వీటిని పారెయ్యడం వల్ల సముద్ర జీవులు ఎన్నో చనిపోతున్నాయ్.వీటివల్ల పర్యావరణ సమతుల్యత(ecological balance)ఘోరంగా దెబ్బతింటోంది.ప్లాస్టిక్ వేస్ట్ వల్ల 267 సముద్ర జీవులు కనుమరుగైపోయాయని(extinct) ఈ మద్య ఒక నివేదికలో తెలిపారు.BL20_ACC_GREEN4_1182137f

4.వీటిని కాల్చడం వల్ల విషవాయువులు మనం పీల్చే గాలిలోకి విడుదల అవుతాయి.అవి కాన్సర్ కి కూడా దారి తీయవచ్చు.

1609986_10201317888849094_690009768_n

 

“ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాలకు ప్లాస్టిక్ పొరల కింద బయటపడ్డ ఒక కొత్త గ్రహం అని వేరే గ్రహాల వాళ్ళు వార్తలురాసుకోవలసి వస్తుందేమో.”

 ఇన్ని దరిద్రపు లక్షణాలు వున్న ఈ ప్లాస్టిక్ కవర్లని వాడడం        అవసరమా????.తప్పదు అన్న పరిస్థితుల్లో తప్పించి మిగతా పనులకి వీటి వాడకం తగ్గించడం మంచిది.రానున్న ప్రమాదాల్ని గమనించి వీటి ఉపయోగం కాస్త తగ్గించండి..గుడికి వెళ్ళేటప్పుడు, కూరగాయలకివెళ్ళేటప్పుడు మీ బాగ్ మీరే తీసుకెళ్ళండి..మిమ్మల్ని చూసి ఇంకొందరు మొదలు పెడతారు…ఎక్కడ పడితే అక్కడ పారెయ్యకుండా రీసైకిల్ చేసే వారికి ఇస్తే కొంత సమస్య తీరుతుంది.అంతా మన చేతుల్లోనే వుందండి…కాస్త….నేను , నా, అనేది వదిలి… మనం , మనది  అనే భావన పెంచుకుందాం..చీపు గా వస్తున్నాయని కొనేస్తే..తర్వాత భారీగా సమర్పించుకోవాలి హాస్పిటల్ వాళ్ళకి.

మన అసెంబ్లీ లో ప్లాస్టిక్ చెత్త:

హైదరబాద్ మున్సిపాలిటీ పరిధి లో రోజు రోజుకీ ఈ ప్లాస్టిక్ చెత్త ఎక్కువై పోతోందట.అసెంబ్లీ లో కూడా ఈ విషయం చర్చకు                          వచ్చిందంటే…చూడండి..విషయం ఎంత సీరియస్సో…28TH_SANGAM_DIRT_1441979f

పూణే ప్రభుత్వం వారు జపాన్ కి చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్లాస్టిక్ చెత్త నుండి డీజిల్ ఉత్పత్తి చేసే మిషన్లు ఏర్పాటుచేస్కున్నారు.దీనికి మొత్తం పెట్టుబడి 5 కోట్లు మాత్రమే.జపాన్ సంస్థకూడామన రాష్ట్రం లో ఈమిషన్లని ప్రవేశపెట్టడానికి ముందుకి వచ్చింది.అందుకు ఫండ్సు మంజూరు చెయ్యమని అసెంబ్లీలో ఎప్పుడో చెప్పారట ..కాని ఆ బిల్లు పట్టించుకునే ఓపిక ,తీరిక ఎవరికీ లేకపోయింది..

“అవున్లే ఈ నేల నాది…ఆ ఊరు మాది అని కొట్టుకుని చావడానికే సరిపోతోంది మన వాళ్ళకి…ఈ విధంగా వుంటే ఎదో ఒక రోజు  ఏ నేల కోసం కొట్టుకుంటున్నామో ఆ నేల ఎందుకూ పనికిరాకుండాపోతుంది.”

కాబట్టి మనమైనా మన వరకు మనం ఈ చెత్త ని తగ్గించే ప్రయత్నం చేద్దాం.మన నుండి ఏమీ ఆశించకుండా మనకన్నీఇచ్చే ఈ ప్రకృతికి ఈ మాత్రం మనవంతు  గా కృషి చెయ్యడం గొప్పేం కాదు…ఏమంటారు?

(ఈ సమస్య కి పరిష్కారం మీరు కూడా తెలపవచ్చు…)mkgf

Use Facebook to Comment on this Post


Comments

One response to “టైం బాంబ్……”

  1. మీ టపాలు బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *