మహాశివరాత్రి

5505643_origమాఘ మాసం లో (కృష్ణ పక్షం)14వ రోజు శివునికి ఎంతో ప్రీతీ దాయకమైనది.ఈ రోజునే మహా శివరాత్రి పేరున శివున్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.శివ రాత్రి పండుగ వెనుక ఎన్నో పురాణ గాధలు వున్నాయని ప్రతీతి.ఈ రోజే ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడని,క్షీరసాగర మథనం జరిగింది అని, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని,గంగ దివి నుండి భువికి వచ్చింది ఈ రోజే అని చాలా విశేషంగా చెప్పుకుంటారు.

శివ అంటే శుభం అని అర్ధం.లోకాలన్నిటికి శుభం కలిగించేవాడు శివుడు.శివుడు భోళా శంకరుడు.అడిగిన వెంటనే లేదనక వరాలు ఇచ్చే దేవుడు.ఈ అనంత సృష్టి కి లయకారకుడు,ఆదిగురువు.యోగ విద్య, నాట్య వేదం అన్ని అయన నుండి పుట్టినవే.పార్వతికి అర్ధ శరీరం ఇచ్చి స్త్రీ పురుషులు సమానమని చాటి చెప్పిన వాడు.

శివ రూపం విజ్ఞానానికి,మనో తేజస్సుకు ప్రతీక.అయన విశ్వమంతా వ్యాపించి వున్నాడు.అదే శివ తత్వం.

అటువంటి శివునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

లింగోద్భవం:ఒక నాడు బ్రహ్మ, విష్ణువులకి తమలో ఎవరు గొప్ప అనే విషయం పై వాదనవచ్చింది.ఆ విషయం శివున్ని అడుగగా,మహా శివుడు జ్యోతిర్లింగంగా అవతరించి నా ఆది ,అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు .జ్యోతిర్లింగానికి ఆది, అంతం ఉండదు.శివుడు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడని జ్యోతిర్లింగం సూచిస్తోంది.చివరికి విష్ణు, బ్రహ్మ లు శివలింగం యొక్క ఆది, అంతాలు కనుక్కోలేక తమ అహంకారాలని పక్కనపెడతారు.శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజు కనుక ఈ రోజు ని మహా శివరాత్రి గా జరుపుకుంటారు.

samudra-manthan-CU09_lక్షీరసాగర మధనం:అమృతం కోసం , అమరత్వం కోసం దేవతలు , రాక్షసులు పాల సముద్రాన్ని చిలకాలని నిశ్చయించుకున్నారు.మేరు పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి ని తాడు లా చేసి పాలసంద్రాన్ని మధించగా, అందులో నుండి ఎన్నో విలువైనవి వచ్చాయంట.తరువాత అత్యంత ప్రమాదకరమైన హలాహల విషం పుట్టుకొచ్చింది.దాని వలన ప్రపంచం అంతమైపోతుంది.దాన్ని భరించే శక్తి ఒక్క శివునికే వున్నదని, దేవతలంతా శివున్ని కోరగా, అయన ఆ విషాన్ని తాగుతాడు.అది కడుపులో కి చేరితే ప్రమాదమని, పార్వతి దేవి తన చేతిని శివుని గొంతుకి అడ్డుపెట్టిందట.అప్పుడా విషం అక్కడే నిలచిపోయి శివుని కంఠం నీలం గా మారిపోయింది.అందుకే శివునికి నీలకంటుడని మరో పేరు.ఆ విష ప్రభావం నుండి శాంతి పొందాలంటే శివున్ని ఆ రాత్రి మొత్తం నిదురించరాదని వైద్యులు సూచించారు.అందుకని దేవతలంతా ఆ రోజు రాత్రి శివుని కోసం జాగరణ వుండి తమ భక్తి ని చాటుకున్నారట.మరుసటి దినం శివునికి ఆ విషం యొక్క ప్రభావం నుండి విముక్తి లభించింది.అందరి శ్రేయస్సు కోరి విషాన్ని మింగిన శివుని  కోసం ఎటేటా శివరాత్రి నాడు మనం జాగరణ ఉండి అయన పట్ల మనకున్న భక్తిని చాటుకుంటున్నాం.

శివతాండవం: శివుడు తాండవ నృత్యం చేసిన రోజు కూడాఈ రోజే అని చెప్తారు.శివ తాండవం సృష్టి లో చావు_పుట్టుకలకి ,సృష్టి కి_వినాశనానికి ప్రతీకఅని చెప్తారు.

శివ పూజ:శివుడు  అభిషేక ప్రియుడు.పంచామృతాలతో శివాభిషేకం చేస్తే ఎంతో మంచిది.బిల్వ ఆకులు కూడా శివునికి ఎంతో ఇష్టం.ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఈరోజంతా మనసులో అనుకుంటే చాలా మంచింది.శివ ధ్యానంలో ఈరోజంతా ప్రశాంతంగా గడపాలి.మనసు , శరీరం దైవం మీద లగ్నం చేసి,చెడు ఆలోచనలకు, పనులకూ దూరం గా వుంటే అదే మీరు చెయ్యగలిగిన విశిష్టమైన శివ పూజ.అంతేకాని శివునికి అభిషేకం చేసి పాపాలన్నీపోయాయని మళ్ళి కొత్తగా పాపాలను మొదలుపెట్టకండి.shiva-linga

ఉపవాసం: శివునికై ఈ రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. వైజ్ఞానికంగా కూడా ఉపవాస దీక్ష ఎన్నో మంచి ఫలితాలని ఇస్తుందని నిరూపిన్చబడినది. అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం వల్ల మన శరీరంలో వుండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, శరీరానికి ముఖ్యంగా ,లివరుకి మన శరీరంలో చెడు పదార్ధాలను తొలగించడానికి కొంత సమయం చిక్కుతుంది.అందుకే మన పెద్దలు ఉపవాస దీక్ష పెట్టారు.కాకపోతే షుగరు, బి.పి వంటి ఆరోగ్య సమస్యలు వున్న వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి.

సైంటిఫిక్ రీజనింగ్:మన పూర్వీకులు ఏది చేసినా ఒక పరమార్ధం వుంటుంది.శివరాత్రి ప్రతి ఏటా మాఘ మాసం లో 14రోజు వస్తుంది.ఈ రోజు గ్రహాల కదలిక అంటే planetary movement  వల్ల మానవ శరీరంలో శక్తి ప్రసరిస్తుందట, అందుకని మానవులని మేల్కొల్పి ఆ శక్తిని  గ్రహించేందుకు వీలుగా జాగరణని ఏర్పాటు చేసారని తెలుస్తోంది.

కాబట్టి ఈసారి శివరాత్రి కి అందరితోపాటూ నేనూ, అని కాకుండా….ఈ రోజు యొక్క ప్రత్యేకతని తెలుసుకుని జరుపుకుందాం.ఆధ్యాత్మికంగానూ,వైజ్ఞానికంగాను శివరాత్రి పూజ,ఉపవాసం ఇంకా జాగరణ ఎంత మేలో తెలిసింది కదా.ఏ కారణం లేకుండా మన పెద్దలు పండుగలను జరపరని మరొక్కసారి తెలిసింది.

అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు….

shiva

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *