ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో పౌర్ణిమ రోజు హోలీ పండుగ జరుపుకుంటాం.వసంత ఋతువు ప్రారంభాన్నిహోలీ పండుగ సూచిస్తుంది.ఇది రంగుల పండుగ.తమ కిష్టమైన వారిపై రంగులు చల్లుకుని ప్రజలు తమ ఆనందాన్ని పంచుకుంటారు.భారత దేశం తో పాటు నేపాల్ వారు కూడా హోలీ పండుగ జరుపుకుంటారు.ఉత్తర భారత దేశంలో ఈ పండుగ చాలా విశిష్టమైనది.
హిరణ్యకశిపుని చెల్లలు హోలిక రాక్షసి.హిరణ్యకశిపుడు హరి భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చేత హరినామం మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమౌతాడు.అప్పుడు హోలిక ప్రహ్లాదుని తీసుకు మంటల్లో కూర్చుంటుంది. మంటలనుండి గాయాలు అవ్వకుండా ఒక మాయా వస్త్రం కప్పుకుంటుంది.కాని ప్రహ్లాదుడు హరి నామస్మరణ చెయ్యగానే ఆ వస్త్రం బాలుని చేరి అతన్ని కాపాడుతుంది.హోలిక ఆ మంటల్లో చనిపోతుంది.తమను ఎన్నో రోజుల నుంచి వేధిస్తోన్న రాక్షసి హోలిక చనిపోవడం తో ప్రజలు ఆనందంగా రంగుల చల్లుకుని ఆనందిస్తారు.అదే హోలీ పౌర్ణమి అయింది.
గుజరాత్ లోని మధుర మరియు బృందావనం పరిసర ప్రాంతాల్లో కృష్ణున్నివిశేషంగా పూజిస్తారు.ఇక్కడి ప్రజలు కృష్ణుడు గోపికలతో కలిసి వసంత ఋతువులో రాసలీలలు మరియు రంగులు చల్లుకుంటూ బృందావనం లో ఆడుకునేవాడని అదే హోలీ గా ప్రజులు జరుపుకుంటున్నారని భావిస్తారు.ఈ ప్రాంత నమ్మకం ప్రకారం కృష్ణుడు తన నల్లని శరీరం వల్ల ఎంతో చక్కని రంగు గల రాధ తనను ఇష్టపడదేమో అని యశోద దగ్గర బాధపడతాడు.అప్పుడు యశోద రాధ కి రంగులు పూయమని చెప్తుంది .అలా రాధ కి రంగులు పూసి తర్వాత గోపికలతో కూడా కలిసి రంగులు చల్లుకుని ఆనందించారని ఈ ప్రాంతపు నమ్మకం.
తెలుగు ప్రాంతం:
తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కాముని దహనం గా హోలీ రోజుని జరుపుకుంటారు.పార్వతి శివుని సేవించడానికై వచ్చినప్పుడు శివుని పై బాణం వేసి శివుని కోపానికి మన్మధుడు దహనం అవుతాడు.తన బాహ్య శరీరం పోగొట్టుకుని కామరూపం పొందుతాడు.అదే కాముని పున్నమి గా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.
ప్రతి ప్రాంతంలో జరుపుకోవడానికి వేరు వేరు కారణాలు ఉన్నప్పటికీ,హోలీ ఆనందాలని పంచుకునే రోజు.చిన్న పెద్దా అందరూ తమ మనసు లోని కష్టాలు మరిచి హాయిగా ఆనందంగా గడిపే రోజు.
ఈ హోలీ అందరి జీవితాల్లో కి కొత్త రంగులు నింపాలి అని , పర్యావరణ సురక్షితమైనటువంటి రంగులతో హోలీ జరుపుకుని పర్యావరణం మరియు మీరు కూడా క్షేమంగా వుండాలని కోరుకుంటూ ….
అందరికీ హోలీ శుభాకాంక్షలు.
Leave a Reply