Category: activity corner

  • ఆషాడం లో….

    ఆషాడం లో….

    ఉగాది పండుగ నుండి అన్నీ డ్రై డేసే అమ్మాయిలకి.ఒక పండుగ ఉండదు,ఏమి ఉండదు.ఆషాడం వచ్చింది తన తర్వాత శ్రావణ మాసం తో వచ్చ్చే పండుగలను  మోసుకొచ్చింది.ఆషాడం వచ్చిందనగానే ఎంతో సంతోషంగా అనిపించింది..నాకు మాత్రం ఇంక రాబోయే కాలమంతా పండుగలు,కొత్త బట్టలు,విందు భోజనాలు అని తలచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఆషాడం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు.ఈ నెలలో తప్పకుండా  చందమామని,చుక్కలని ఆకాశం నుండి కోసి అమ్మాయిల చేతిలో పెడతారు.రోటిలో కాని మిక్సిలో కాని రుబ్బిన గోరింటాకు ని చేతికి…

  • రాగి చెంబు….

    రాగి చెంబు….

    అమెరికా ప్రయాణానికి సామాన్లు సర్దటం అంటే  పి.హెచ్.డి కి థీసిస్ ప్రిపేర్ చేసినంత పనితో సమానం. ఎన్నిపెట్టుకున్నాఇంకాఎదో ఒకటి మర్చిపోయామనే వుంటుంది.కనిపించిన ప్రతి వస్తువు బ్యాగులోదూర్చెయ్యాలి అనిపిస్తుంది.వీలైతే ఇక్కడ వున్నఇల్లుని మొత్తం ప్యాక్ చేసేసి వెంట తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది.కానిఎం చేస్తాం. సర్దిన వాటిని మళ్ళి మళ్ళి సర్ది ఫైనల్ గా బరువు చూస్కుని ఇంకెక్కడన్నా కాస్త ఖాళీవుంటే అందులోకొన్నికుక్కి ఎలాగో అలా సామాను సర్దుకున్నాం.అమ్మఇంత హడావిడిలోకూడా రాగి చెంబు సర్దడం మరిచి పోలేదు .అమెరికా వెళ్తూ కూడా…

  • బాటిల్ ఆర్ట్..

    బాటిల్ ఆర్ట్..

    ఈ సారి ఆక్టివిటీ కార్నెర్ లో బాటిల్ ఆర్ట్ చూద్దాం…మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయ్..పనికిరాని వాటన్నింటిని అర్జెంటు గా డస్ట్ బిన్ లో పారెయ్యడం మన పని …కానీ ,అలా కాకుండా వాటిల్లో నుంచి కూడా మన క్రియేటివిటీకి పని చెప్పొచ్చు..బాటిల్ ఆర్ట్ అంటే ఎదో కాదు..మన ఇంట్లో అప్పుడప్పుడూ గాజు సీసాలు చూస్తూ వుంటాం…వాటిని పారెయ్యకుండా వాటికి చక్కని పెయింటింగ్స్ వేసి ఫ్లవర్ వాస్ గానో, లేక తోటలోనో ,లేక లోపల లైట్ పెట్టి…

  • ఇండియా విల్ గో ఆన్…

    ఇండియా విల్ గో ఆన్…

    ఈ మధ్య రాష్రంలో ఇంకా దేశంలో , రాజకీయ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  చాలా బాధగా, భయంగా, బెంగగా అనిపిస్తోంది.నలుగురు ఒకచోట కలిస్తే ఎక్కడ చూసినా,వీటి గురించి చర్చలే .చివరికి ఆడవాళ్ళు కలిసినా కూడా పిల్లలు, వంటలు, పూల మొక్కలు, మొగలి రేకులు  అని కాకుండా రాష్ట్ర పరిస్థితుల గురించి, దేశం గురించి మాట్లడుకుంటున్నారంటే  చూడండి విషయం ఎంత సీరియస్సో..ఒకందుకు ఇది మంచి పరిణామమే….ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది..నాకెందుకులే, ఎవరైతే ఏంటి? అనే ఆలోచన…

  • తేనెల మూట..తెలుగు మాట.

    తేనెల మూట..తెలుగు మాట.

    ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అంతా కొత్తే…..భాష రాదు , మన ప్రాంతం కాదు . అప్పుడు ఎక్కడినుంచో ఒక తెలుగు మాట వినిపిస్తే మన కెంత సంతోషంగా వుంటుంది..ఎడారిలో ఒయాసిస్సు చూసినట్టు వుండదూ? అదే నండి ఒక భాష గొప్పతనం..మాతృ భాష అంటే మన ఉనికి, మన వ్యక్తిత్వం.ఫెబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో వారు గుర్తించారు.అందుకని ఈ రోజు ఒకసారి మన తేనెల తేటల తెలుగు బాష గురించి చూద్దాం. “దేశ భాషలందు…

  • కానుక..

    కానుక..

    స్నేహితుని  పెళ్ళి వస్తోంది, ఏదైనా కానుక ఇవ్వాలి కదామరి.కానుక అంటే మనం అవతలవారి సంతోషం కోరి, వారికి మంచి జరిగిందని , లేక జరగాలని,మనం మనస్ఫూర్తి గా ఇచ్చేది కదా.మనం ఇచ్చే కానుకలో మన అభిరుచి తెలుస్తుందంటారు.మనకి కొన్నిబ్రాండెడ్ కానుకలు ఉన్నాయండి,అదే మాటవరసకి వాచీ. నిజం అండి జనాల్లోఒక టాక్ కూడా  ఉంది , ఆంధ్రావాళ్ళు ఎవరికైనా కానుక ఇవ్వాలంటే 90 % మంది వాచీ నే కొంటారంట.నమ్మరా?నిజమండీ బాబు.మీరే చూస్కోండి కచ్చితంగా ఇప్పటికీ మీ దగ్గర…