Author: Srinidhi Yellala
-
వరలక్ష్మీ వ్రతం
అందరికీ వర లక్ష్మీ వ్రత శుక్రవారం శుభాకాంక్షలు.శ్రావణ మాసం లో అందరు ఎదురు చూసె వరలక్ష్మి వ్రతం వచ్చేసింది.మన తెలుగు మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ వ్రతాన్ని అందరు ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వర లక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితి.ఆ రోజు కుదరని వారు శ్రావణ మాసం లోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు.తెలుగు వారే కాకుండా, కన్నడ మరియు…
-
ఆలోచనలు …
శ్రావణ మాసం వచ్చేసింది ,అందులో మొదటి శుక్రవారం వచ్చేసింది అని సంబరంగా వుంది కానీ , ఏంటో ఒకవైపు చెప్పలేని బాధ . మనిషిగా పుట్టినందుకు,సమాజం పట్ల,పుట్టిన ఊరు పట్ల , పెరిగిన వాతావరణం పట్ల ,మాట్లాడే బాష పట్ల మమకారం పెంచుకుంటాం . అది మానవ నైజం. అలాంటి భావాలు లేని వాడు అసలు మనిషే కాడు , ఒత్తి రాయి . కాని ఏ విషయానికైనా మితం అనేది ఉంటుంది .ఉండాలి కూడా . హద్దు మీరిన అభిమానం…
-
ఆషాడం లో….
ఉగాది పండుగ నుండి అన్నీ డ్రై డేసే అమ్మాయిలకి.ఒక పండుగ ఉండదు,ఏమి ఉండదు.ఆషాడం వచ్చింది తన తర్వాత శ్రావణ మాసం తో వచ్చ్చే పండుగలను మోసుకొచ్చింది.ఆషాడం వచ్చిందనగానే ఎంతో సంతోషంగా అనిపించింది..నాకు మాత్రం ఇంక రాబోయే కాలమంతా పండుగలు,కొత్త బట్టలు,విందు భోజనాలు అని తలచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఆషాడం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు.ఈ నెలలో తప్పకుండా చందమామని,చుక్కలని ఆకాశం నుండి కోసి అమ్మాయిల చేతిలో పెడతారు.రోటిలో కాని మిక్సిలో కాని రుబ్బిన గోరింటాకు ని చేతికి…
-
సీతారామ కళ్యాణం
1998 ఈ రోజు ఇంగ్లీష్ పరిక్ష అయిపోయింది.తర్వాత మాథ్స్ ఎగ్జాం.దేవుడా అసలు ఈ లెక్కలు ఎందుకు కనుక్కున్నావు, ఒకవేళ కనుక్కున్నా అందులో పరీక్షలు ఎందుకు కనుక్కున్నావు స్వామీ.ఏంటో ఈ మాథ్స్ ఎగ్జాం అంటేనే జ్వరం వచ్చేస్తుంది.తప్పదు కదా, అన్నిటి తో పాటూ ఈ లెక్కలు కూడా ప్యాస్ అయితే కానీ ఫోర్త్ క్లాసుకి పంపరంట.ఇంత చిన్న బుర్రలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మీరే చెప్పండి.అడిషన్లు, మైనస్సులే కాక 3rd క్లాసులో మల్టిప్లికేషన్లు,దివిషన్లు కూడా వచ్చి చేరాయి.ఇంకా 4త్ క్లాసుకి…
-
రాగి చెంబు….
అమెరికా ప్రయాణానికి సామాన్లు సర్దటం అంటే పి.హెచ్.డి కి థీసిస్ ప్రిపేర్ చేసినంత పనితో సమానం. ఎన్నిపెట్టుకున్నాఇంకాఎదో ఒకటి మర్చిపోయామనే వుంటుంది.కనిపించిన ప్రతి వస్తువు బ్యాగులోదూర్చెయ్యాలి అనిపిస్తుంది.వీలైతే ఇక్కడ వున్నఇల్లుని మొత్తం ప్యాక్ చేసేసి వెంట తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది.కానిఎం చేస్తాం. సర్దిన వాటిని మళ్ళి మళ్ళి సర్ది ఫైనల్ గా బరువు చూస్కుని ఇంకెక్కడన్నా కాస్త ఖాళీవుంటే అందులోకొన్నికుక్కి ఎలాగో అలా సామాను సర్దుకున్నాం.అమ్మఇంత హడావిడిలోకూడా రాగి చెంబు సర్దడం మరిచి పోలేదు .అమెరికా వెళ్తూ కూడా…
-
మన తొలి పండుగ – ఉగాది
తెలుగు ప్రజలందరికీ “జయ” నామ సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది మన తొలి పండుగ.తెలుగు వారి కొత్త సంవత్సరం.ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము.చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది, అలాగే ఇది వసంత ఋతువు.ఈ రోజు ప్రకృతి లో వున్న అందాలన్నీకొత్త చిగుర్లు తొడిగే వేళ . ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం.. తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై(60).ప్రభవ నామ సంవత్సరం మొదటిది. క్షయ నామ సంవత్సరం చివరిది.ఈ రోజు…