Author: Srinidhi Yellala

  • అనగనగా ఒక రాజ కుమారి

    అనగనగా ఒక రాజ కుమారి

    అనగనగా ఒక రాజ కుమారి మనుషులైనా, వస్తువైనా ఉన్నప్పుడు వాటి విలువ ఎవరూ గుర్తించరు. గడిచిన చరిత్ర మీద ఉన్న ఆసక్తి, కుతూహలం జరుగుతున్న వాస్తవాల గురించి అంతగా ఉండదు. ఇక ప్రముఖుల సంగతి సరే సరి. ఏ మనిషి నుండైనా నేర్చుకోవలసిన మంచో, చెడో కొంచం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పే రాకుమారి జీవితం మొత్తం స్ఫూర్తిదాయకమే. తన విజయాల నుండి తెలుసుకోవలసినవి, తప్పులనుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఎన్నెన్నో. జయలలిత, పేరు వినగానే గంభీరమైన భారీ…

  • ఆనందో బ్రహ్మ

    ఆనందో బ్రహ్మ

    మనుషులు పలు రకాలు. కాకపోతే , ఈ రోజు నేను మొదలు పెట్టిన అంశం కోసం, మనుషులని రెండు రకాలుగా విభజిస్తున్నాను. ఆ హక్కు నాకెవరు ఇచ్చారని మీరు అడగకూడదు. పవిత్ర భారత దేశంలో పుట్టిన ప్రజాస్వామ్య బిడ్డగా, ఏ  విషయాన్నయినా నా ఇష్టం వచ్చి చీల్చి చెండాడి, నా వాదనలని అవతలి వారిపై బలవంతంగా రుద్దగలిగే హక్కుని పొందాను కాబట్టి. అంచేత  నే  చెప్పొచ్చేదేంటంటే మనుషులు రెండు రకాలు: 1.తినడానికి కోసం బ్రతికేవాళ్ళు 2.బ్రతకడం కోసం…

  • Political satire

    Political satire

    పిట్ట కధ అప్పుడు: “ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్ళతో దున్నిస్తా. పంట భూములని తిరిగి సాగులోకి తెస్త.” ఇప్పుడు: “ఫిల్మ్ సిటి ఒక అద్భుత కళా ఖండం. మా నగరానికే కాదు,  రాష్ట్రానికే కాదు మొత్తందేశానికే  గర్వకారణం.” ఎప్పుడూ: అక్కా ఈ వార్త విన్నావా? మరీ ఇంతలా…. మనకెందుకులే అక్కా, దొంగోడు దొంగోడు కలిసి ఊర్లు పంచుకున్నారట. రేపు పండక్కి నువ్వు ఎన్ని చుక్కల ముగ్గు పెడుతున్నావ్? రమ షకినాలు చుట్టడానికి మధ్యాహ్నం రమ్మంది, గోంగూర పచ్చడి…

  • దీపావళి

    దీపావళి

    దీపానికి, భారతీయతకు విడదీయని బంధం వుంది.దేవుని ముందు దీపం వెలిగించి నమ్మకంతో ప్రార్ధిస్తే అది మనకి ఎంతో మనో ధైర్యాన్ని,శాంతిని ఇస్తుంది.మన మనసులో వుండే భయం,అజ్హ్ఞానం అనే చీకట్లను తొలగించి మనలో వెలుగుని నింపుతుంది. అటువంటి దీపాల పండుగ మన దీపావళి.చెడుపై మంచి గెలుపుని,చీకటి పై వెలుగు యొక్క గెలుపుని తెలియజేసే పండుగ.అమావాస్య చీకట్లలాంటి మన చెడు ఆలోచనలని తన వెలుగులలో అంతం చెయ్యమని చెప్పే పండుగ.   దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |…

  • శ్రీ బాపు గారు

    శ్రీ బాపు గారు

    ఈ వార్త వినాల్సివస్తుందని తెలిస్తే అసలు ఈ రోజు లేచేదాన్నే కాను.అయినా నా పిచ్చి కాకపోతే బాపు గారు చనిపోవడమేంటి?.తెలుగుతనం,బాపూ బొమ్మ,బాపు చలన చిత్ర కావ్యాలు,బుడుగు, జ్ఞాన ప్రసూనాంబ వీళ్ళంతా చనిపోతారా ఏంటి?.వీళ్ళు ఉన్నంత కాలం ఆయనా ఉంటారు.కులాసాగా,చిలిపిగా తన ట్రేడ్ మార్కు స్టైలు లో నవ్వుతూ,అంతే.ఏదో బోరు కొట్టి భౌతికంగా మనకి దూరం అయ్యారంతే.శాశ్వతంగా తెలుగు వెలుగుల్లో అయన కుడా ఒక జ్యోతిగా వెలుగుతూనే వుంటారు. పది పేజీలలో చెప్పగలిగే భావాన్ని ఒక చిన్న బొమ్మలో…

  • GO GREEN ON THIS GANESH CHATURTHI

    GO GREEN ON THIS GANESH CHATURTHI

    ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం ఆచరించడం మన సాంప్రదాయం.గజ ముఖం తో, చిరు బొజ్జ తో,వుండే వినాయకుడంటే అందరికి ఎంతో ప్రీతి.వినాయక రూపం జ్ఞానానికి ,సంపదకి,విజయానికి చిహ్నం.విఘ్నరాజాదిపతి అయిన వినాయకుడిని పూజిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనందరికీ తెలిసిందే.కాని వినాయక రూపం మనకి ఏమి చెప్తోంది? ఆ రూపం వెనుక గల అతరార్ధం ఏమిటి? చాటల్లాంటి చెవులు ,తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని చెప్తున్నాయి ,సూదంటు చూపులు ఎ విషయాన్నయినా…