తెలుగు సినీ రంగంలో ఒక శకం ముగిసింది. అదే అక్కినేని నాగేశ్వరరావు శకం. 75 సంవత్సరాలుగా సినీ ప్రేక్షకులను అలరించించిన మన నాగేశ్వరరావు గారు స్వర్గస్తులైనారు.ఆయన గురించి రాయడానికి ఆయనకి వచ్చినన్ని అవార్డులంత లేదు నా వయసు.నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు..అంతే. ఆయనో తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు.
సినిమా అంటే నే మాయ, ఎన్నికొత్త మాధ్యమాలు వచ్చినా ఎన్నటికీ వన్నెతగ్గని రంగం ఏంటంటే సినీరంగం.అటువంటి రంగం లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ని , తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ని వేసిన వ్యక్తి ఏఎన్ఆరు గారు.
అయన గురించి రాసేదేముందండి, అయన జీవితం తెరిచిన పుస్తకం.అయన చేసిన సినిమాలు,వచ్చిన అవార్డులు,రివార్డులు అందరికీ తెలిసిందే.కాకపోతే మనల్నిఇంతకాలంగా అలరించి, భౌతికంగా మనకి దూరమైన ఆ గొప్ప వ్యక్తి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం.
కళ అనేది దేవుడిచ్చిన వరం,ఎందుకంటే మనిషికి చావు సహజం, కాని కళకు చావనేది లేనేలేదు.ప్రేక్షకులలో రసహృదయం ఉన్నన్నిరోజులూ కళాకారులు బ్రతికే ఉంటారు,చావువారి శరీరానికేకానీ ,వారి కళకు కాదు.
ప్రతిభకు, కృషి,పట్టుదల,ఓర్పు,తెలివి, అదృష్టం తోడైతే మనిషి ఎంత సాధించగలడు అనే దానికి ఏఎన్ఆర్ ఒక ఉదాహరణ. 1924 లో జన్మించిన అక్కినేని గారిది గుడివాడ తాలుకా కృష్ణాపురం.చిన్నతనంలోనే నాటకాలు వేసేవాడు.నాటకాలలో అడపాత్రలకు అయన పెట్టింది పేరు.17 ఏళ్ల ప్రాయం లో సినీరంగం ప్రవేశించారు.చక్కని ముఖ వర్చస్సు, వాక్చాతుర్యం గల వాడవడంవల్ల వెంటనే మంచి పేరు తెచ్చుకున్నారు.
ఏ ఒక్క పాత్రకీ పరిమితం కాకుండా జానపద,సాంఘిక,పౌరాణిక,భక్తి పాత్రలన్నీ ధరించి మెప్పించాడు.తనకంటూ ప్రత్యేకమైన ఒక శైలిని ఏర్పరచుకున్నారు.మన తెలుగు సినిమాల్లో డాన్సు చేసిన మొదట హీరో ఏఎన్ఆర్ గారేనట.అయన డైలాగ్డెలివరీ, ద్రెస్స్సింగ్, హెయిర్ స్టైల్ అన్ని ఒక ట్రెండ్ సెట్ చేసాయనే చెపొచ్చు.
తెలుగుసినీరంగం హైదరాబాదు రావడానికి అయన చేసిన కృషి మరువలేనిది.”డబ్బుకి నేను బాగా విలువఇస్తాను నాది అనుకున్నది నేను ఒక్క రూపాయ్ కూడా పోగొట్టుకోను”అని కచ్చితంగా నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి.ఎవరు ఏమనుకున్నాఎన్నిమాటలు అన్నా తను అనుకున్ననియమాల ప్రకారం జీవించిన మనిషి.
ఆయన నటించిన సినిమాల్లో నచ్చినవి పెర్కొందామంటే అయన నటించిన 257 సినిమాల గురించీ రాయవలసి వస్తుందేమో.అన్నీ ఆణిముత్యాలే ఏదిగొప్పదని ఏరగలం.
ఏమైతేనేమిపంచెకట్టులో హుందాగా నడుస్తూ,హాయిగా నవ్వేసే మన ఏఎన్ఆర్ గారు ఇకలేరు, కళారంగానికి తను చేయవలసిన సేవ ఇక ఐపోయిన్దంటూ సెలవు తీస్కున్నారు.
చివరిగా ఒక పరిపూర్ణమైన,అర్ధవంతమైన జీవితాన్ని మనకి ఆదర్శంగా వుంచి “కేవలం భౌతికంగా” మాత్రమే మనల్నివిడిచిన మన దసరాబుల్లోడు,ఎవర్ గ్రీన్ పూల రంగడు ఏఎన్ఆర్ గారికి అంజలి ఘటిస్తూ ……
Leave a Reply