ఆషాడం లో….

rffఉగాది పండుగ నుండి అన్నీ డ్రై డేసే అమ్మాయిలకి.ఒక పండుగ ఉండదు,ఏమి ఉండదు.ఆషాడం వచ్చింది తన తర్వాత శ్రావణ మాసం తో వచ్చ్చే పండుగలను  మోసుకొచ్చింది.ఆషాడం వచ్చిందనగానే ఎంతో సంతోషంగా అనిపించింది..నాకు మాత్రం ఇంక రాబోయే కాలమంతా పండుగలు,కొత్త బట్టలు,విందు భోజనాలు అని తలచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది.

ఆషాడం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు.ఈ నెలలో తప్పకుండా  చందమామని,చుక్కలని ఆకాశం నుండి కోసి అమ్మాయిల చేతిలో పెడతారు.రోటిలో కాని మిక్సిలో కాని రుబ్బిన గోరింటాకు ని చేతికి పెట్టుకుని ఓపిగ్గా,విసుగు లేకుండా రాత్రంతా ఉంచుకుని తెల్లారగానే చేతిలో పూసిన మందార పువ్వుల్ని చూసుకుని మురిసిపోవడం ఒక మంచి అనుభూతి.ఎర్రగా పండితే మంచి మొగుడోస్తాడని,ఎవరికీ ఎక్కువ పండిందో అని పోటీలూ పెట్టుకుని మరీ చూసుకునే వాళ్ళం.ఇది ఉత్తి పిచ్చి నమ్మకం అని అందరికీ తెలుసు కాని తెలిసి తెలీని వయసులో అమాయకంగా పెద్దాళ్ళు చెప్పే మాటలు నమ్మేసి చేతులతో పాటు సిగ్గుతో ఎర్రగా పండిన చిన్నారి బుగ్గలను చూడాలంటే ఇలాంటి అందమైన అబద్ధాలు ఎన్నైనా చెప్పొచు,ఎన్నైనా ఉత్తుత్తినే నమ్మేయ్యొచ్చు..gghg

సైబర్ అమ్మాయిలూ..వాట్ ది హెల్? అని మాత్రం అనకండి.ఎందుకంటే అందమైన చేతులకి గోరింటాకు పెట్టుకుని వాటిని కంప్యూటర్ కీ బోర్డు పై టకటక ఆడిస్తుంటే ఎంత బాగుంటుంది కదా.ఆ రోజు ఆఫీస్ లో మీరే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు..డెఫినిట్లీ.ఎత్నిక్ లుక్ అని స్టైల్ గా చెప్పొచ్చు.

సైంటిఫిక్ రీసన్: సాంప్రదాయాలు అంటూ ఏదోటి చెప్పేస్తే ఈ రోజుల్లో ఊరుకోరు.ఖచ్చితంగా వాటికి కారణాలు అడుగుతారు కాబట్టి వాటి గురించి కూడా ఓసారి చూద్దాం..

bg_r2_c2ఆషాడం మనకు వర్షా కాలం,ఈ కాలంలో రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.గోరింటాకు రసంలో అంటి బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయంట.గోరింటాకుని చేతులకి ,వేళ్ళకి పెట్ట్టుకోవడం వల్ల తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్ళకుండా ఇది కాపాడుతుందని ఒక వివరణ.

గోరింటాకుకి ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట.కాబట్టి ఉద్యోగాలు చేసే అమ్మాయిలూ ఒకసారి ప్రయత్నం చేసి చూడొచ్చు.

సో గోరింటాకుతో రాబోయే పండుగ సీజన్లకి స్వాగతం చెప్పేద్దామా?…

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *