Do whatever…stay home. Keep your family and community safe . #quarentineparenting#stayhome#staysafe
ఇప్పుడు పిల్లని ఏదో ఒక పనిలో పడేసి కాసేపు ఊపిరి పీల్చుకోడం ఎలాగో fb అమ్మగారు చెపుతారు .. చూదాం !
“ఇంటిలో ఉన్న ఏదైనా సీసానో, డబ్బానో తీ…సీ !!!”
“తీసి !!”
“కాసిన్ని రంగులు తీసుకునీ….!”
“తీసుకున్నామండీ !!”
“ఈ రంగులన్నీ ఆ డబ్బాకి నైసుగా పులమమని ఒక బ్రష్షు ఇస్తే సరి ! ఎక్కడ అంటించినా హైరానా పడకుండా వీలైతే ఆ గదిలో లేకుండా వచ్చేస్తే అధమపక్షం ఒక గంట మీదే .. మీదే ..మీదే!”
అటు వైపు నాన్నారు : ఇక్కడ ఉప్పు డబ్బా ఉండాలి కదండీ ! ఉండాల్సిన చోట ఒక్క వస్తువు ఉండకపోతే ఎట్లా గండి ! కదలకుండా నిల్చుంటే నన్ను ఉన్నచోట నిల్చోబెట్టి రంగులేసేట్టు ఉన్నారు అమ్మా కూతురు ! నాకు ఇంటరెస్ట్ పోయింది. ఈ ఐడియా కూడా బాగుంటది. గంట నుండీ రెండు గంటల సమయం మీదే.. మీదే…మీదే… అమ్మలూ !
***************************
Shelter in place is our responsibility#qurentineparenting#stayhome
ఇంకొకానొక .. ఇటువంటివి ఇంకా ఎన్నో తెలియనటువంటి రోజు. పిల్లలకు బొమ్మలు గీయమని చెప్పి వదిలెయ్యండి. వారి ఉహలోకపు అద్భుతాల్ని ఆవిష్కరించనివ్వండి. ఆశ్చర్యానందాలకు లోనవ్వండి. కింది పటం మా బుజ్జి దాని ఊహల్లో మేము అన్నమాట. మా పెళ్లికి మా ఊరి ఫోటో స్టూడియో అన్న కూడా ఇంత బాగా తీయలేదు మమ్మల్ని! ఎవరక్కడ “కాకి పిల్ల కాకికి ముద్దు” అని అరుస్తాఉండాది ! కళా పోషణ తగ్గిపోతోంది బొత్తిగా !
******************************
Quarantine festivities… #Stayhome#staysafe
“అమ్మా అసలు ఉగాది అంటే ఏంటి?”“ఉగాది అంటే…”“అమ్మా ఆకలి!”
“హ్మ్మ్ ! ఇందా.. ఉగాది అంటే…”
“అమ్మా రోజు చీకటి ఎందుకవుతుంది?”
“%*#..సరేనా .. అసలు ఉగాది అంటే!”
“అమ్మా పిప్పి .”
“పదా.. అసలు ఉగాది అంటే …”
“అమ్మా చందమా…”
“ఉష్ష్ ..ఉష్షు … ఉగాది అంటే తెలుగోళ్ల కొత్త సంవత్సరం అన్నమాట . హమ్మయ్య. ఇంక మొదలెట్టు పగలు ఎందుకు తెల్లారుతుంది, లేచే సరికి రాత్రి ఎక్కడికి పారిపోయింది అనీ..”
*************************
Feeling Nothing #stayhome#staysafe
నా రాజ్యంలో ఇన్ని తప్పులా ? నేనొప్పుకోను!
‘ధనియాలు పొడి’ కాదది. ‘ధనియాల పొడి.’
The ‘లు’ should be cut into half … నిలువుగా కొయ్యబడాలన్నమాఠ!
అంతరాత్మ: ముందైతే నీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ని ఏదైనా భోషాణంలో పాతిపెట్టెయ్యాలన్నమాట!#కాపాడండయ్యానన్ను
*************************
Feeling..Sorry I don’t have any other feeling except if all my surfaces around are sterile
“అమ్మా నాకు మార్బల్ రన్ కావాలి! ఆడుకుంటా..హెల్ప్ మీ!”
అడిగిన ప్రశ్నకి తెలిసి కూడా నిజం చెప్పకపోతే బేతాళుడి శాపం వల్ల వెయ్యి ముక్కలు అయినా మార్బల్ రన్ ని గంట పాటూ కష్టపడి అమర్చిన పిమ్మట ట ట ట … *****
ఒకే ఒక్క గోలీ కాయని అలా విసిరి అది సాంతం తిరిగి మొదటికి రాకముందే “నా పాపకి ఆకలేస్తోంది నేను బువ్వ వండాలి.” అని బుడ్డది తుర్రుమన్నప్పుడు … నాకేమనిపించిందో…నాకూ తెలీదు! ఇంకా తేరుకోలేదు.. మీరే పూరింపుకోవలయును.
***********************
When I asked him about tomorrow’s plans #Stayhome#StaySafe
“హ్మ్ హ్మ్మ్ ! హః !”
“ఏంటీ ?”
“రేపు గుడ్ ఫ్రైడే కదా?”
“అవును.. అయితే!”
“సెలవు..ఉందా! అని అడుగుదామని ?!”
“$&&$!$&@!???@&$?!!!”
“సరే సరే ! ఊర్కో ! ..ఊర్కో! పని చేస్కో ! ఉంటా!”
“వెళ్ళేటప్పుడు తలుపేసుకుని వెళ్లు .”
పాపం పగలూ రాత్రీ తప్పించి వేరే ఏ కాలమాణాలూ తెలీకుండా పంచేస్కుంటున్నాడు కదా! తెలిసీ ఉడికిస్తావే !“అదంతే ! తుత్తి కోసం ! ”
*******************
It’s time for some life lessons to my beloved subjects in my garden
2018 ఆగస్టు లో వాళ్ళమ్మ నుండి ఒక ఆకు అప్పిప్పించుకుని ఈ పిల్ల మొలకని తెప్పించా! అంతే మళ్లి మర్చిపోయా!
మీ అందరికీ పోసేటప్పుడు కాసిన్ని నీళ్లు పడేవి దానికి కూడా!ఈరోజు 2020 లో చూడండి ..ఎంత సొగసుగా ఒక్కో ఆకే చుట్టూతా చుట్టుకుంటూ నెట్టుకొచ్చిందో ..కష్టం అంతా దానిదే. ఉన్న శక్తి అంతా కూడబెట్టుకుని నిలబడింది. బతికింది. ఉన్నదాంట్లోనే అన్నీ చూసుకుంది!
మిగతా మొక్కలతో నేను: చూసి నేర్చుకోండే!
*************************
Quarentine struggles #stayhome#staysafe
రోజంతా అందరూ ఇట్లాగే ఉండాలి. ఒక్క వెంట్రుక బయటికి రాకూడదు. ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ రబ్బర్ బ్యాండ్లు వేసినా కూడా గెంతి గెంతి ఊడబెరుక్కోకూడదు.
అలా చేస్తే quarentine సౌకర్యాలలో అన్నింట్లో కోతే చెప్తున్నా! హమ్మా! మంచి నీళ్ల కోసం మీటింగ్ నుండి బయటి వస్తే, నట్టింట్లో తలో వీపో తెలీకుండా విరబోసుకుని కూర్చుని ఎర్ర పెయింట్ తో ఇల్లలుకుతున్న నిన్ను చూసి దడుచుకుని కేకలు వేసాడు మీ నాన్న! పాపం!
*******************
Mere Insult #కాపాడండయ్యానన్ను
“అబ్బబ్బబ్బా! కరెక్టుగా మీటింగ్ మొదలయ్యిందంటే చాలు మొదలెడతారు అమ్మా కూతురు!నేను ఉద్యోగమే చేసుకునేదా ..మీ పంచాయతీలే తీర్చేదా ?? ఎందుకు బుడ్డది పొర్లు దండాలు పెడుతోంది ?!”
“అమ్మ నా కిట్ కాట్ చాకోలెట్ తినేసిందీ ఈ ఈ ఈ .. లాస్ట్ కిట్ కాట్ !”
“నన్ను చూస్తావే? సంచి లో అన్ని కాండీస్ ఉన్నాయ్ .. వేరేవి ఏమైనా తాకనైనా తాకానా ? ఏదో చిన్నప్పటి నుండి చూసిన చోక్లెట్ కదా అని బాల్యాభిమానంతో అసంకల్పిత ప్రతీకార్య చర్య లాగా ఆ ఒక్కటీ తింటే .. సీఐడి లాగా పరిశోధన చేసి నేనే అని నిరూపించి మరీ ఏడుస్తోంది! నేనేవరికి చెప్పుకోవాలి?దీని కన్నా మా అక్కే బెటర్ .. కాస్త ఏడుపుమొకం పెడితే వదిలేసేది. మిగిలింది కూడా నాకే పెట్టేదీ ఈ ఈ ఈ!”
“నావల్ల కాదు! ఆ గొడవ పడేదేదో లోపల గదిలోకెళ్ళి తలుపులేసుకుని పడండి..ఇంకో కాల్ ఉంది నాకు!”
*********************
Leave a Reply