అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.దాదాపు 150 సంవత్సరాల దాస్య సృంఖలాలను తెంచుకున్న స్వతంత్ర భారతావని తనకంటూ సొంతమైనటువంటి రాజ్యాంగాన్నిఏర్పరచుకున్నటువంటి రోజు ఈ రోజు.1950, జనవరి 26న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వం లో భారతదేశం ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం గా, సెక్యులర్ దేశం గా ఆవిర్భవించింది.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కై ఒక రాజ్యాంగం ఏర్పడిన రోజు.ప్రపంచదేశాల సరసన గర్వంగా భారతదేశం నిలబడ్డ రోజు ఈ రోజు.
జాతి గర్వించదగ్గ రోజు. కానీ నేటి సమాజం నిజంగా నాటి మహనీయులు కలలుగన్న సమాజమేనా? నిజంగా గర్వించ తగినటువంటి పరిస్థితులు నేటి సమాజం లో ఉన్నాయా????
ఎన్నోఏళ్ల బానిస బ్రతుకు తర్వాత, ఎందరో అమర వీరుల త్యాగ ఫలం వల్ల, మరెందరో మహనీయుల కృషి వల్ల ఏర్పడిన ఈ స్వతంత్ర భారతావని మళ్ళి తన ఉనికిని కోల్పోతోందా??
మన దేశం లో జరిగే ఘోరాలూ చూస్తోంటే నాకు కలిగిన అనుమానాలు ఇవి.ముఖ్యంగా స్ర్తీ లకు జరిగే అన్యాయాలు.
స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా స్త్ర్రీ కి రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ కు జరిగిన ఘోరం మరిచిపోయే లోపు అటువంటి ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయ్. అవి మరచిపోఎలోపు మానవత్వమే సిగ్గు పడేలా దేశఆర్ధిక రాజధాని అయిన ముంబయ్ లో అనూహ్య అనే అమ్మాయి అత్యంత దారుణంగా హింసించబడి , హత్య చేయబడింది.అదీ పట్టపగలు .ఒక్క సారిగా యావత్ భారతావని ఉల్లిక్కి పడింది.అంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు నిజమైన స్వాతంత్రం మనకు రానట్లే కదా?
క్యాబ్ డ్రైవర్లు,ఆటో వాలాలు, అపరిచితులు, టీచర్లు, భంధువులు, ప్రమాదం ఏ రూపం లోనైనారావచ్చు. సామాన్య మహిళకు రక్షణ అనేదే పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోతోంది.పసిపిల్లలు కూడా ఈ రాక్షస కార్యాలకు బలైపోతున్నారు.అమాయకంగా,ఆనందంగా గడచిపోవలసిన బాల్యం ప్రశ్నార్ధకంగా మారిపోతోంది.
కొన్ని ఏళ్ల తర్వాత, వంటింటి కుందేళ్ళు అనే పిలుపు నుండి విముక్తి పొంది, అన్ని రంగాల్లోతమ ప్రతిభను చాటుతున్నారు మహిళలు.కానీ ఈనాటి పరిస్థితులలో స్త్ర్రీ బయటికి రావడమే ఒక సాహసమైపోయింది. కొందరు మృగాల్ల పశుబలం ముందు ఓడిపోతోంది.
ఈ ఓటమి మన భారతజాతి మొత్తానిది. స్త్రీ ని శక్తీ స్వరూపిణిగా చూపే దేశం లోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి.. మొన్నఎవరో, మన దేశానికీ వచ్చిన జర్మనీ దేశస్తురాలి పై కూడా కొందరు అఘాయిత్యం చేసారట.ప్రపంచదేశాలలో మన పరువు ఏమైపోవాలి?.నన్నడిగితే ఇలాంటి వాళ్ళు కూడా దేశ ద్రోహులే. కాదంటారా????
అసలు మనకెందుకీ జాడ్యం.???
ఢిల్లీ సంఘటన తర్వాత పంజాబ్ లో మహిళల రక్షణ కోసం హెల్ప్ లైన్ పెడితే ఆరు నెలలలో 5లక్షల ఫిర్యాదులు వచ్చాయట. దీన్నిబట్టి మన సమాజం ఎటు వైపు వెల్తోందో మీరే ఆలోచించండి.
తప్పు ఎవరిది?? ఇంత దారుణమైన కార్యాలను చేసే వారికి ఈ సంఘంలోఉండే హక్కుఉందా???
ఆడపిల్లల స్వేచ్చను హరించే శక్తి వీల్లకి ఎవరు ఇచ్చారు???ఏ రాజ్యాంగం దీన్నిహర్షిస్తుంది???
ఇటు వంటి సమాజం లో ఉన్నామని గర్విద్దామా??
ఏమో,, అనూహ్య వార్త చదివాక స్వాతంత్రం మనకి వచ్చిందన్న ఆలోచనే కోల్పోయాను.మేరా భారత్ మహాన్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా వుంది.
ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు తెలీదు.కాని సాటి మహిళగా నా ఇంటి నుండి ఇటువంటి మృగం ఒకటి సమాజం లో కి వెళ్ళకుండా మాత్రం జాగ్రత్త తీస్కుంటాను.అది నా భాధ్యత అనుకుంటాను.
“ఇల్లు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది,సమాజం బాగుంటే జాతి గర్వించతగ్గ దేశం ఏర్పడుతుంది.”
సర్వజన సురక్షితమైన భారత దేశాన్నినిర్మించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడు మనస్పూర్తిగా గర్వంగా చేసుకోవచ్చు స్వతంత్ర దినాలు, గణతంత్రదినోత్సవాలు…..
సర్వేజనా సుఖినోభవంతు….
Leave a Reply