Ammaa! 😍
“అమ్మా ఒక కత చెప్పవూ !”
“హ్మ్ .. సరే . ఈ చీర కథ చెప్పనా ?”
“చీరకి కూడా కథ ఉంటుందా ?”
“ఓ .. మనసు పెట్టి చూడాలే కానీ రాళ్ళలో కూడా రాగాలు వినొచ్చు తెలుసా ?”
“అయితే చెప్పు !”
“ఈ చీర మా నాయనమ్మ మీ అమ్మమ్మకి తన పెళ్ళిలో ఇచ్చిన చీర !! “
“అమ్మమ్మ చీర ఎందుకు కట్టుకున్నావు ?”
“అమ్మ నా ప్రతి పండుగని అందమైన జ్ఞాపకంగా మార్చడానికి ఎంత శ్రమపడిందో ఇప్పుడు తెలిసొచ్చి, అంతే చక్కని జ్ఞాపకాలు నీకు కూడా ఉండాలని కట్టుకున్నాను. ఈ చీర కట్టుకుంటే మా అమ్మని చుట్టుకున్నట్టే ఉంది మరి ! ”
**********************************************************************************************************
Life is full of wonders when you see how we are connected to the Nature 🙏🙏🤗
చల్లని తల్లి, సింగరేణి ఒడిలో గడిచిన బాల్యంలో తంగేడు పువ్వంటి జ్ఞాపకం “బతుకమ్మ”. మాకు లేని ఆచారం అవ్వడం వల్ల ఎక్కువగా స్నేహితుల ఇళ్లల్లో చూసేదాన్ని . ఎదురు బొదురు పిల్లలంతా ఒకింటి పిల్లల్లా పెరిగాం. నాకు చాలా నచ్చి మనసులో నిలిచిన పదం
“ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా ! ఏమేమి కాయొప్పునే గౌరమ్మా !
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మా ! గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మా !”
ఈరోజు బుజ్జమ్మ ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా “pumpkin patch” కి వెళ్తే ఎన్నెన్ని గుమ్మాడి పువ్వొప్పులో , కాయొప్పులో !
ప్రచంచం అటు వైపు, ఇటు వైపు చేసుకునే సంబరాల్లో ఎంత సామీప్యం.
ఎటు చూసినా గుమ్మడి కాయ పీచు సంబంధాలే .
ప్రకృతితో కలిసి చేసుకునే సంతోషాలు ! మిగతావన్నీ పై పై మెరుగులు!!
(పాటలో వ్యాకరణ దోషాలుంటే మన్నించండి )
****************************************************************************************
On World Elephant Day 😍
మా తంజావూరు బృహదీశ్వరాలయం గజ రాజు గారు ! వారి గురువు గారి చేతిలో రెండు రూపాయిల బిల్ల పెడితేనే మా నెత్తి మీద తొండం ఉంచి ఆశీర్వదించేది. ఒక coin కి ఒక ఆశీర్వాదం మటుకే సుమా! ఎన్ని అరటిపండ్లు ఇచ్చినా బొజ్జలో వేసేస్కుని హాయిగా తొండం అటూ ఇటూ ఆడిస్తూ ఉంటారే తప్ప అనుగ్రహించరు . వాళ్ళ మాస్టర్ చేతిలో తైలం పడాల, అప్పుడు మాత్రమే మన నెత్తిన తొండం మోపేది ! పక్కా భారత రాజ్యాంగ నియమాలు పాటించేది .
అంతరించి పోతున్నాయట మరి.
**************************************************************************************************
No mission is possible with just a hand few of people. Each one of us is as important as every other individual. Let’s do our part.
అనగనగా కథ :
అనగనగా ఒక రాజు తన ప్రజల నీతి నిజాయతీలని పరీక్షించడానికి రెండు పెద్ద కడవలు పెట్టి, ఒకదాంట్లో పాలు, ఒక దాంట్లో నీళ్లు పొయ్యమన్నాడు . మనోళ్ళేమో, ఎలాగూ మిగతావాళ్ళు పోస్తారు కదా, నేనొక్కడినీ నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అనీ, ప్రతి వోడు రెండిట్లో నీళ్ళే పోసాడంట.
ఇప్పటి కథ :
ఉండగా ఉండగా ఒక పుర పాలక వ్యవస్థ. వంటింటి చెత్తని సేంద్రియ ఎరువు గా మారుద్దామని, “ గ్రీన్ వేస్ట్” కింద ఒక కుండీ, “ప్లాస్టిక్ వేస్ట్” కింద ఇంకో కుండీ పెట్టారట. మనోళ్ళేమో మిగతావాళ్ళు వేరు చేస్తారు లే , నేనొక్కడినీ చెయ్యకపోతే ఏమవుతుంది లే అనీ..అన్నీ కలిపిన చెత్తనే రెండిట్లో వేస్తున్నారట 🤦♀️.
రాజ్యాలూ, రాజ్యాంగాలు మారినా ప్రజల ఆలోచనలలో, నీతి నిజాయతీల లో మాత్రం అస్సలు మార్పు లేదోయ్. మాటంటే మాటే !
************************************************************************************************************
Life is as simple as you make it 😇🤗🤗
👩🏫హెల్లో అమ్మా ? ఏం చేస్తున్నావు ?
👩ఆ చెప్పవే . నేను వంకాయ కూర చేసి టొమాటో రసం పెట్టా . నువ్వేం చేస్తున్నావు ?
👩🏫ఆర్గానిక్ కీన్వా మిక్సడ్ వెజిటబుల్ రైస్ ఇంఖా యోగర్ట్ పుడ్డింగ్ అండ్ సలాడ్ మా .
👩ఓహో !ఇంకేంటి విశేషాలు ?
👩🏫ఏంలేదు మా .. ఆఫీస్ నుండి వచ్చేసా, ఫుడ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి సో, online న్యూస్ చదివేసి వాటికి supporting వీడియోస్ యూట్యూబ్ లో చూసేసి, నా ఒపీనియన్ సోషల్ మీడియా లో పెట్టేసి, దానిపైన ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో ఫాలో చేసేసి, controversial కామెంట్స్ ని షేర్ చేసి హైలైట్ చేసి ఇది ఎంతవరకు సాగుతుందో అని వాట్స్ ఆప్ గ్రూప్ లో డిస్కస్ చేసి ఒక బీపీ మాత్ర వేసేస్కుని పడుకోవడమే ! ఉస్షో .. సో బిజీ యా !24 hours సరిపోవడం లేదనుకో !
మరి నీ ప్రోగ్రాం ఏంటి మా ?
👩ఏముంది. వంట అయిపోయింది, కింద పోర్షన్ వాళ్ళ ఇంట్లో వ్రతం , బజారు కెళ్ళి వెండి కుంకుమ భరిణె తీసుకురావాలి, మల్లెచెట్టు ఒంగి పోతోంది పందిరి మళ్ళీ కొత్తది వేయించాలి , బ్యాంక్ ఆంటీ అమెరికా వెళ్తోంది రెండు రకాల పచ్చళ్ళు , కొన్ని పొడులు పడుతోంది సాయం రమ్మంది. వానలు మొదలయ్యాయి . ఈసారి టెన్త్ క్లాస్ కి క్లాస్ టీచర్ ని, కాబట్టి కాస్త హడావిడే. వచ్చే నెలలో మూడు పెళ్లిళ్లు, స్టేషన్ కాలనీలో ఆంటీ వారణాసి వెళ్లి కొత్త చీరలు తెచ్చిందంట రేపెళ్లి చూసి రావాలి , కనకాంబరం రంగులో ఒక చీర కావాలని చూస్తున్నా . మీరు లేక ఏమీ తోచడం లేదు ,ఒకటే బోరు .
👩🏫 😥😱😨😔🙄🙄🙄😳
👩హలొ …హలో … ఇంతకీ కనకాంబరం రంగుకి గ్రీన్ బోర్డర్ తీస్కొనా లేక రెడ్ తీస్కొనా ?
************************************************************************************
You can be a Feminist and enjoy femininity at the same time 💁♀️
“ఏరా తల్లీ ?”
“చూడు నాన్నా ! ఇంత ఇష్టపడి ఎంత చక్కగా పెంచుతున్నానా వీటిని !బాల్కనీ ఇనుప చువ్వలని పొడుచుకుని మరీ అటు తిరిగి పూస్తాయే ? ”
“…… ”
“ఇదిగో మళ్ళీ అదే నవ్వు … చెప్పొచ్చు కదా నాన్నా !”
Leave a Reply