నవ్వుల్ పువ్వుల్ – 3

How to utilize negative energy

🙎‍♀️అప్పట్లో ఒకడుండేవాడు ! మొన్నీ మధ్య FB లో మళ్ళీ కనిపించాడు !

👩‍🎤అంటే topless గా బైక్ మీద తిరుగుతున్న రౌడీ విజయ్ దేవరకొండ లాగానా ?

🙎‍♀️కాదు .. 4th క్లాస్ లో వేళ్ళాడుతున్న నిక్కరుని గట్టిగ పట్టుకుని , టీచర్ ప్లీజ్ అర్జెంటు .. అంటూ “దైన్యం” అనే పదానికి pictorial ఇమేజ్ లా నిలబడ్డ వాడిలా !

👩‍🎤ఓహో ! స్కూల్ డేస్ ఆ ! ఇంతకీ ఏం జేశాడు ?

🙎‍♀️నా మనోభావాలు దెబ్బ తీసాడు , నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని అణచేసాడు ?

👩‍🎤హౌ ? ఎలా?

🙎‍♀️8థ్ క్లాస్ లో నీ favourite సబ్జెక్టు ఏంటి అని అడిగితే , “తెలుగు” అని చెప్పా, “ఎందుకు ? “ అని టీచర్ అడిగింది .

ఎందుకని తెలుగంటే ఇష్టమో నేను అందంగా చెప్పేలోపే ,

“ఎందుకంటే బాగా భట్టీ పెట్టొచ్చని ” అని వెనక నుండి అరిచి క్లాసంతా ఘొల్లుమని నవ్వేలా చేసాడు . అలా దారుణంగా నా మనో భావాలను దెబ్బ తీసాడు .

👩‍🎤ఇంకా ?

🙎‍♀️10th క్లాస్ లో టీచర్ అప్పజెప్పమంది కదా అని, నా కిష్టమైన పద్యమని ఆనందంగా

“అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌.. ” అని

దూకే జలపాతము లాగా, పరవశించి చెప్తోంటే …

“ బా బా భట్టీ క్వీన్ “ అని పిల్లి కూతలు కూసి గేలి చేసి నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాల రాచాడు .

👩‍🎤ఇంకా ?

🙎‍♀️అరువు తెచ్చుకున్న బాలమిత్ర పుస్తకం చదివి inspire అయ్యి , స్కూల్ lawn లో ఉన్న గడ్డిపువ్వుని చూస్తూ ….

“ పచ్చల దీవిలో , ముత్యపు చినుకు “ అని ఎదో వర్ణన మనసులో అనుకుంటోంటే , చట్టుక్కున వచ్చి ,

“ A B C D ఎప్ఫు .. మీ తాత తలకాయ టప్పు ” అని పుట్టుకున్న ఆ గడ్డిపువ్వుని తెంపి నా మనో భావాలను దెబ్బ తీసాడు .

👩‍🎤ఇప్పుడేం చేస్తున్నాడు ?

🙎‍♀️నన్ను భట్టీ queen అన్నవాడు, ఆ పై విజయవాడలో మూడేళ్లు ముక్కు మూసుకుని భట్టీయం వేసి జీవితం లో సెటిల్ అయినాడు .
ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకి FB లో కనపడి , ఆరిన మంటలు రాజేసాడు …

👩‍🎤ఇప్పుడు ఎం చేద్దామనీ ?

🙎‍♀️debate లో కూర్చోపెట్టి నా భావ వ్యక్తీకరణ స్వేచ్చని తొక్కేసి , మనోభావాలని దెబ్బ తీసినందుకు చర్చిద్దాము అని 4 స్టూడియోలకి కాల్ చేసా .. అందరూ బిజీ అంట .

👩‍🎤చివరికి ఎం జేసావ్?

🙎‍♀️ఏం జేస్తాం .. కాస్త చింతపండు, పీతాంబరి తీస్కుని వాడి మొహం లా మట్టి గొట్టుకు పోయిన రాగి కూజా తీస్కుని , నా కోపం పోయే దాకా తోమి తోమి ఇలా చేశా !

*********************************************************************

When you are obsessed with your saucepan 🙍‍♀️

🙂 అమ్మాయ్ ,అన్నీ సిద్ధంగా ఉంచుకున్నావా ? నేను టైం అంటే టైమే . ఆనక తిరిగి మళ్ళీ నన్ను శాడిస్టు , సైకో అంటే ఒప్పుకోను చెప్తున్నా !

🙋‍♀️ అబ్బా సరేలే , ప్రతి సారీ అలాగే చేస్తానా ఏంటి ! ఈసారి చూస్కో నా ప్రతాపం .

😏 ఏమో , మీ జాతిని ఎవరు నమ్మొచారు . ఓడ దాటే దాకా ఓడ మల్లన్నా , ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నా అనే రకం . ఎన్ని యుగాల నుండి చూడట్లేదూ .
సర్లే కానీ , నేను రెడీ మరి .. నువ్వు?

💁‍♀️ వో ఎస్ … ఎప్పుడో రెడీ ! dont be silly ya .

😌 ఆవాలు వేస్కో ..

💁‍♀️ వేసేసా

😌 జీలకర్ర వేస్కో

💁‍♀️ వేసేసా … సో ఈజీ ఐ సే .

🙄 సర్లే చానా జూసాం కానీ … పోపు గింజలు, వెల్లుల్లి ,ఎండు మిరపకాయలూ ?

🙋‍♀️ వేసేసా … ఏమనుకున్నావ్ మరి నేనంటే !

🤨 మరి కరేపాకో ???

🤦‍♀️ ఓఓఓ … షి ష్ ష్… అఅఅఅఅ … ఒక్క నిమిషం …ఒకే ఒక్క నిమిషం .. ప్లీజ్ !!ప్లీజ్ ..ప్లీజ్ !

🤓 మరదే నే ముందే చెప్పా … మాటంటే మాటే ..టైమంటే టైమే అని ! నా వల్ల కాదు అమ్మడు … ఆగలేను … వేగిపోతున్నా ఇక్కడ .

🙍‍♀️ ప్లీజ్ ప్లీజ్ .. ఇదుగో ఫ్రిడ్జ్ డోర్ తెరిచా ,వెతుకు తున్నా … ఏడ చచ్చిందో ఇది ఈ మహారణ్యం లో ! కనపడదే !

🤪 ఇహ ఆగడం నా వాళ్ళ కాదు అమ్మడోయ్ !

🙍‍♀️ ప్లీజ్ నా బుజ్జివి కదూ , ఒక్క అర నిమిషం … నీకు బంగారు చెవులు చేపిస్తా .. నీ పీఠానికి వెండి తొడుగు చేపిస్తా . . జీవితాంతం కలిసి మెలిసి కాపురం చెయ్య వలసిన వాళ్ళం .. ఇదిగో వచ్చేస్తున్నా !
ఆ దొరికింది … కొత్తిమీరకీ బెండకాయలకి మధ్యలో నక్కింది .. రా బయటికి రా !
ఇదిగో కరివేపాఆఆఆఆఆ …

😔 అయిపొయింది అమ్మడూ , అంతా అయిపోయింది … మాడి మసైపోయింది నీ పోపు.

🙆‍♀️ ఛీ పో ఎప్పుడూ ఇంతే నువ్వు , ఇంత దుర్మార్గం నే నెక్కడా చూడలేదు .. మరీ ఇంత కాఠిన్యం పనికిరాదు ..నిన్ను తప్ప వేరొకరిని ఇష్టపడను అనేగా నేనంటే అలుసు .. పో ..నీ ముఖం చూపించకు నాకు.. పొయ్యి ఆ సింకు లో పడీ ఏడువు !

అందుకే దేనిపై ఎక్కువ మమకారం పెంచుకో రాదు .

**************************************************************************************

“భావుకత” now a days be like.

ఆమె: “అన్నాను ఈ పొద్దు రావొద్దు నువ్వని … రావొద్దనీ !
సూరీడుతో మాట అన్నాను !!”

అతడు : మరే .. మంచి పని చేసావ్ .. new code release ఉంది , offshore కాల్స్ కూడా తీస్కోవాలి .. చాలా పనుంది .. థాంక్స్ యా !

ఆమె : “అన్నాను మా ఫోన్ లోని తొలికోడితో , నేను తొలికోడితో …
కూతెట్టి చంపొద్దు అన్నాను !!”

అతడు : మరి ..అంతగాక . పొద్దున్నే వెధవ డిస్టర్బెన్స్యూ ….క్విక్ గా ఒక జత ఇస్త్రీ , స్నానం , స్టేషనూ , 8.10 కి ట్రైనూ … ఓ 7.45 కలా లేపు చాలు !

ఆమె: ఇదిగో నీ పనంతా అయిపోయాక .. if at all … in case .. నే గుర్తొస్తే ఆదిలాబాద్ అడవులకి వచ్చెయ్ .. తపస్సు చేస్కుంటూ వుంటాను .

అతడు: ఓకే డన్ ! You carry on! నాకోసం వెయిట్ చెయ్యకు .. have fun యా !

ఆమె: %#@@%#$%@$%#@%&$#%@&$#%

P.S: those “lyrics” are from “mallepandiri” Telugu movie song!

by
Srinidhi Yellala.

Use Facebook to Comment on this Post


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *