సాయంకాలం కబుర్లు
  • సాయంకాలం కబుర్లు
  • activity corner
  • ఎందరో మహానుభావులు ..
  • మన పండుగలు
  • కధలు
సరదా కబుర్లు 0

నవ్వుల్ పువ్వుల్ – 5

By Srinidhi Yellala · On December 3, 2018

When you are at a stage where you can relate every thing with your present situation 🤓😎

“స్వాతంత్ర్యం అర్ధరాత్రి ఎందుకిచ్చారంటావ్ ?”

“అప్పటికి పిల్ల పిశాచాలు అంతా పడుకునేసి ఉంటారు కదా, వటపత్ర శాయికి మల్లే! పెద్దలంతా తీరిగ్గా, ప్రశాంతంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీస్కుని ఉంటారు ఆ టైంలో, నా మాదిరిగా.”

“తల్లీ! మదర్ మేడ్ ఇన్ ఇండియా , నీకు సాష్టాంగ దండ ప్రణామాలు. చెట్టుమీది కాయకి సముద్రం లో ఉప్పుకి జత కలిపిన వారి వారసత్వం ఎక్కడికి పోతుంది!”

*********************************************************************************************

When you are fed up with the daily morning routine but at the same time addicted to it #pallichutney 😋😋😋

“మా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు !”
“మరి …ఓ సీమ పౌరుషమా ?”
“ఛస్ కాదు.”
“మరైతే ఏంటి .. కమాన్ టెల్ మీ ఐ సే ?”
“చనిక్కాయల చట్నీ !”
“ఆ ఆ ఆఁ !!!”
“య్యా .. యెస్ . ఇడ్లి అయినా దోస అయినా, ఉప్మా అయినా పొంగల్ అయినా, పూరీ అయినా పులిహోర అయినా, రొంత చనిగ్గింజల చట్నీ పడితేనే మన బండి పరిగెట్టేది. ఇక తాలింపు కూరల్లో, పులుసుల్లో అయితే పల్లీ పొడిని ఎరువులు జల్లినట్టు జల్లాల . otherwise its worthless you see !”

అద్గదీ !తొడ కొట్టరా చిన్నా ! 😎

***********************************************************************************************************

Wanna know the value and beauty of life, stay in a hostel for sometime! The days that taught me survival lessons 🙏🙌🏻🤗🤗

అమ్మా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అందరూ పండుగ చేసుకుంటారు. కానీ ఒక్కోసారి పండక్కి ఇంటికెళ్లే అవకాశం రాదు, ముఖ్యంగా ఇంటికి దూరంగా వేరే రాష్ట్రం లో హాస్టల్ లో ఉన్నవాళ్ళకి పండగ విలువ మా గొప్పగా తెలుసు.

హాస్టల్లో ఉన్నపుడు జైల్లో ఖైదీలకు కొట్టినట్లు మెస్సు బెల్లు కొట్టగానే , గ్లాసులు, ప్లేట్లు తీసుకుని మెస్సుకు వెళ్ళేవాళ్ళం. లైన్లో నిల్చుంటే ఊతప్పాలు, దద్దోజనం పెట్టేవాళ్ళు తంజావూరులో. భోజనం లేదా అంటే , ” సాపాడు మధ్యాహ్నం దానే, నైటుల టిఫినుదా ఇరుక్కుమ్,” అని తాబూలం నవ్వు నవ్వే వాడు, మెస్సు అంకుల్ .

ముప్పొద్దులా అన్నం తినే మాకు మహా కష్టంగా తోచేది. ఆలా మా సాంబారు కష్టాలు ఒక సంవత్సరం సాగాయి. ప్రతి రోజు సాంబారుతో చంపేసేవాడు. చివరికి కలలో కూడా సాంబారు సముద్రంలో ఒక్కదాన్నే ఈదుతున్నట్లు , మధ్యలో తైరు సాదం (పెరుగన్నం) దీవిలో ఒక్కదాన్నే చిక్కుకున్నట్లు, మా మెస్సు అంకులు నాపైకి ఊతప్పాలతో దాడి చేస్తున్నట్లు, నేను వాటిని ఇడ్లీ బాంబులతో ఎదుర్కొన్నట్లు పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. పండుగ పూట కూడా సాంబార్ సాదం, తైర్ సాదం పెట్టి స్పెషల్ ఎఫెక్ట్ కింద ఎదో కొళంబు అని పెట్టేవాళ్ళు. అదే మా పండుగ భోజనం.
చివరాఖరికి చెప్పొచ్చేదేంటంటే, అనివార్య కారణాల వల్ల హాస్టళ్లలో చిక్కడిపోయి ఇంటికి వెళ్లలేని సోదర సోదరీమణులకి “దసరా మరియు అడ్వాన్స్డ్ దీపావళి శుభాకాంక్షలు .”

************************************************************************************************

 

You can learn lessons from anything, anywhere and at anytime. 🙏🙏😎

గురు శ్రీ: ఏమ్మా ! ఈ మధ్య ఇటువైపు రావడం లేదే !

శిష్య శ్రీ : అవసరం పడట్లేదు గురు గారూ .. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇంట్లోనే దొరికేస్తున్నాయి . ఇలాగే సాగితే ముందు ముందు నేనే ఒక time management కం stress management కం anger management కం meditation ఇలా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేస్తా .

గురు శ్రీ: ఇంతలో అంత మార్పు ఎలా సాధించావు తల్లీ?

శిష్య శ్రీ: మిమ్మల్ని ఏమడిగినా థియరీ పేపర్ లాగా తికమకగా చెప్తారు.

అదే నేను ఇంట్లో పనులు చేస్తుంటే ప్రాక్టీకల్స్ చేసేటప్పుడులా తేలిగ్గా అర్ధం అయిపోతున్నాయి గురూజీ !

ఉదాహరణకి, జీవితం అంటే ఏంటో చెప్పమంటే తిప్పిచ్చి మళ్ళిచ్చి మొదటికే తీసుకొస్తారు కదా !
ఇప్పుడు నాకు మొత్తం తేట తెల్లంగా అర్ధం అయిపొయింది.

గురు శ్రీ: అంత వివరంగా చెప్పినవారెవరు తల్లీ !

శిష్య శ్రీ: ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నప్పటికీ, నేను గుర్తించలేని నా ఆధ్యాత్మిక గురువు, శ్రీ మిక్సీ గారు .

అసలుకొస్తే anger management లో వారిని కొట్టేవారే లేరు. ఎంతోసి భల్లాల దేవ అయినా, రెండు సిట్టింగ్స్ వారితో వేస్తే దెబ్బకి బుద్ధుడు ఐపోవాల్సిందే.

గురు శ్రీ: ఏమని సెలవిచ్చారు వారు ?

శిష్య శ్రీ : జీవితం అంటే మిక్సీ కున్న మూడు జార్ల వంటిదీ అని ,
మనకి కావల్సినది ఎప్పుడూ , చిన్న జార్ కి ఎక్కువా, పెద్ద జార్ కు తక్కువా అని !
జీవించడం అంటే మనకి కావాల్సిన వాటికి సరిగ్గా సరిపొయ్యే జార్ ని ఎంచుకోవడమే అని !

గురూజీ! గురూజీ ! ఎక్కడా కనిపించరేమిటబ్బా !!!

**********************************************************************************************

Secret behind a fresh Monday morning 🤪😎💁‍♀️

Manager మేష్టారు :ఒరేయ్ వీకెండ్ ఎలా గడిపారో ఒక్క సొంత వాఖ్యం లో చెప్పండిరా !

Software పిలకాయలు : నేన్ ! నేన్ !నేన్ చెప్తానోచ్ !

Manager మేష్టారు : చెప్పవోయీ .. చూడబోతే భలే ఉత్సాహంగా కనపడుతోంది నీ వారాంత వ్యవహారము !!

పిల్ల software : మరేనండీ !

Manager మేష్టారు : చెప్పుమరీ ! చూస్తాను ఎంత చమత్కారంగా చెప్పగలవో !

Software పిల్లపిడుగు : ఈ నా వారాంతము “ ఇల్లే వైకుంఠము, కడుపే కైలాసము ”వలె గడిచినది . అదియే నా ఈ ఉత్సాహమునకు కారణమూ !

మేష్టారు : #%*#%@*%#$

******************************************************************************************************

And it’s a wrap..#happyhalloween2018

“టిక్ టిక్ టిక్ …. trick or treat !!”

“వస్తన్న వస్తన్నా ! ఎవర్రా అబ్బాయ్ నువ్వు .. ?”

“నేనేమో కొండ బూచోడు, వీడు అగ్గి బరాటా , వాడేమో ఒంటి కన్ను రాక్షసుడు, ఇడిగో వీడు భల్లూక రాజు, వాడు జటాజూట !”

“మరి మీరు ఎవలు అమ్మలూ ?”

“ఐ ఆమ్ జగన్మోహిని, తను జ్వాలాముఖి, తిను అపూర్వ చింతామణి !! అది త్రిజట ఇది కాపాలిక !”

“భేష్ భేష్ , భలే ఉన్నార్రా ! ఇదిగో వరసాకి వచ్చి candies తీసుకెళ్లండి ..ఒక్కొక్కళ్ళు రెండేసి తీస్కోండి ! మీరెళ్ళాక conjuring బ్యాచ్ వస్తోంది . మరి, హ్యాపీ హాలోవీన్ రా !!”

****************************************************************************

Get set go...#happyshopping!

“హల్లో ! సామానంతా మారుస్తున్నట్టున్నారు, ఏంటీ ఇల్లు షిఫ్ట్ అవుతున్నారా ? “

“లేదోయ్ . జస్ట్ సామాను మాత్రం స్టోర్ హౌస్ కి షిఫ్ట్ చేసేస్తున్నాము.”

“ఎందుకో ?”

“ఇహ thanksgiving వస్తోందిగా, online shopping మొదలు. దానికి తోడు ఊరినుంచి బావలు, బామ్మర్దుల విన్నపాలు వినవలె వింత వింతలు . ఈ నెల ఇహ అట్టపెట్టెలతోనే సంసారం నిండిపోతుంది. అందుకని కాస్త చోటు చేసుకుంటున్నాము అంతే ! “

***************************************************************************

What’s your count for this Deepavali 🤪🎉🎊🙌

“రేయ్ నీకు ఎన్నొచ్చాయ్ రా ?”

“మూడొందల ముప్పై ఆరు . మరి నీకో ?”

“ఆరొందల డెబ్భై నాలుగూ ! ”

“అర్రె ! నువ్వే గెలిచావ్ రా ..ఇదుగో థౌసండ్ వాలా , నీకే !”

“హెల్లొ ఏస్కూస్ మీ ! నాకు మూడువేల ఐదొందల పన్నెండు వచ్చాయి . చీప్ గా థౌసండ్ వాలా కాదు, పందెం ప్రకారం టెన్ థౌసండ్ వాలా పట్రండిరారేయ్ !”

“హౌ ? అదెలా రా ?”

“వాడిది పెద్ద జాయింట్ ఫ్యామిలి రా , 30 ఫామిలీ గ్రూప్స్ , ఏడాదికో ఊర్లో చదువు కాబట్టి 20 ఫ్రెండ్స్ గ్రూప్స్ , చిన్నా చితకా ఇంకో 50 గ్రూప్స్ వేసుకో !”

“ఛ .. పద మరి , టెన్ థౌసండ్ వాలా కొందాం !”

*“ఒరేయ్ పిలకాయలు, ఇంతకీ దేని గురించిరా మీరు మాట్లాడుకునేది . లాటరీ గానీ తగిలిందా ?”

“అబ్బే అదేంకాదు తాత , వాట్స్ అప్ లో కొత్తగా stickers పెట్టారు కదా, దీపావళికి ఎవరికి ఎక్కువ sticker విషెస్ వచ్చాయా అని పందెం!”

**********************************************************************************************

The great Indian Children’s day celebrations 🎉 😎😍🤗

“ఏంట్రా ఈ రోజు స్పెషల్సు !”

“అంతా మాములే ! నలుగురు టీచరమ్మలు, ఏడుగురు డాక్టర్లు , ఒక బెంగాలీ పెళ్లికూతురు ఒక్క అస్సామీ పెళ్ళికొడుకు , ఐదుగురేమో నర్సులు , ఇద్దరు మేరీమాతలు ఒక బుద్ధ భగవానుడూ, కడవ ఎత్తుకొచ్చిన శకుంతల, బాణమట్టుకొచ్చిన వేటగాడు !”

“చాల్లే ఎప్పుడూ వీళ్ళే వచ్చేది ఎలాగూ. మరి ప్రైజు ఎవరికొచ్చిందిరా ?”

“ఈ సారి స్పెషల్ ఎఫెక్ట్స్ మెర్మెయిడ్ కి ఇంకా నాగ కన్య కీ రా ! భలే ఉన్నారనుకో ! ”

“అబ్బో జలకన్యా, నాగ కన్యే .. రొటీన్ వేషాలే ఉంటాయని మిస్ అయిపోయానే ! ఛా ! ”
Happy Children’s day.. 😀

****************************************************************************************

It’s Friday night 😀 yay! #friyay

“నరుడా ఓ నరుడా ఏమి కోరికా ?”

“ఎస్కుస్ మీ .. ఎవరు సిస్టర్ మీరు ?”

“పాతాళ భైరవిని, పిలిచితివేల .. వచ్చితిని, ఏమి నీ కోరిక ?”

“సోమవారం నుండి శుక్రవారం దాకా దేకుతూ “పాండురంగ మహత్యం” లో ఎన్టీఆర్ లాగా, ‘ అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా ‘ అని పిలిచా, మొత్తుకున్నా…వచ్చావా? లేదే !! ఇప్పుడు శుక్రవారం రాత్రి వస్తే హౌ? ఎలా ! టెల్ మీ !! కమాన్ టెల్ మీ ఐ సే !!”

“సరే గాని, ఇప్పుడేమంటావ్ !!”

“శుక్రవారం రాత్రి కుబేరుడు వచ్చినా సోమవారం దాకా క్యూ లో ఉండాల్సిందే !! కమింగ్ బ్రో ! Bye-bye సిస్టర్ !”

******************************************************************************************

Done with my holidays 😒🙄

“ఉన్నావా, అసలున్నావా ? స్వామీ .. రా దిగిరా , దివి నుండి …..”

“బాలా , వచ్చితిన్ ! ఏలా ఊరికూరికే పిలిచెదవు !!”

“ఇదే ఈసారికి ఆఖరు అనుకో! ఆదివారం స్కిప్ చేసి సోమవారం వచ్చేట్టు చూడు తండ్రీ !
వరసగా 4 రోజులు సెలవులు. కథలు చెప్పి చెప్పి నోరు నొప్పి , ఆటలు ఆడించి ఆడించి తల నొప్పి , ఊ కొట్టి కొట్టీ చెవులు నొప్పి. బుర్రలో అంతా రైమ్స్ ఏ రిపీట్ మోడ్ లో ప్లే అవుతున్నాయి .
నేనెవరో , ఏంటో, జీవితం , పరమార్థం, మోక్షం, లాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్ ! ఇంకో రోజు అంటే నా వల్ల కాదు, తొరగా సోమవారం వస్తే వాళ్ళ టీచర్ కి అప్పగించి ఒక దణ్ణం పెట్టి వస్తా !’

“ఇదిస్తే అదంటావు ! అదిస్తే ఇంకోటంటావు … అందుకే సుబ్బరంగా నా గేమ్సు , నా రూల్సు అనేది . ఆప్షన్స్ లేవు ఇక వస్తా .. మరిక పిలవకు ! ”

*****************************************************************************************************

by
Srinidhi Yellala.

Use Facebook to Comment on this Post

funpunchestelugujokestelugupunches
Share Tweet

Srinidhi Yellala

You Might Also Like

  • సరదా కబుర్లు

    నే చెప్పానా !!

  • సరదా కబుర్లు

    నాకు ఇంటరెస్ట్ పోయింది

  • సరదా కబుర్లు

    అదంతా ఒక ఇదిలే

No Comments

Leave a reply Cancel reply

Categories

  • activity corner
  • ఎందరో మహానుభావులు ..
  • కధలు
  • మన పండుగలు
  • సరదా కబుర్లు
  • సాయంకాలం కబుర్లు

Latest Posts

  • నే చెప్పానా !!

    October 19, 2019
  • నాకు ఇంటరెస్ట్ పోయింది

    October 19, 2019
  • పడమటి తీరాన ఓ కోయిల

    July 16, 2019
  • అదంతా ఒక ఇదిలే

    July 1, 2019
  • సరదాగా అలా

    July 1, 2019

Tags

akkineni ANR dasara bullodu india nirbhaya pelli poola jada republic day savithri telangana telugu film posters telugujokes telugu story tv ads
  • సాయంకాలం కబుర్లు
  • activity corner
  • ఎందరో మహానుభావులు ..
  • మన పండుగలు
  • కధలు
ఉత్తమ తెలుగు బ్లాగులు - బ్లాగిల్లు | Top Telugu Blogs
మాలిక: Telugu Blogs


కూడలి

Blaagulokam logo